18.03.2023
Amaravati
Jaganna’s educational blessing – Jagananna VidyaDeevena
Full Fee Reimbursement – Regularly paid quarterly fees as soon as that quarter is due
9.86 lakh students for the quarter of October – December 2022 Rs. 698.68 crores today (19.03.2023) CM Shri YS Jagan will deposit directly into the accounts of students’ mothers at the touch of a button in Tiruvuru, NTR district.
The arrears from the year 2017 for the partial fee reimbursement given by the previous government is Rs. 1,778 crores, so far the total assistance given by Shri YS Jagan government under Jagananna Vidya Devena and Jagananna Dharam Devena is Rs. 13,311 crores.
There are no limits to the Jagananna Vidya Deevena and Jagananna Dharam Deevena schemes offered by Shri YS Jagan’s government to help poor students pursue higher studies. As many people in the family can study as many people can study.
Jaganna’s educational blessing- Vidya Deevena
Shri YS Jagan’s government has been directly depositing the full fees payable to the colleges by the poor students studying ITI, polytechnic, degree, engineering, medicine and other courses in the accounts of the mothers of the students regularly after the end of that quarter with the lofty goal of making the poor students also pursue higher studies.
Jagananna’s accommodation is blessed – Vasati Deevena
ITI students in two installments every year without having to worry about food and lodging expenses for poor students pursuing higher education. 10 thousand, polytechnic students Rs. 15 thousand, degree, engineering, medicine and other courses for Rs. 20 thousand per financial aid. Shri YS Jagan’s government is directly depositing the number of students in the family into the accounts of their mothers twice a year.
To increase accountability in colleges, give mothers the right to question and empower mothers by directly depositing financial aid into the accounts of students’ mothers.
The previous government did not even think of giving full fee reimbursement to the poor students pursuing higher studies, even the partial fee reimbursement was delayed for years, the situation of huge arrears, food and accommodation expenses, the previous government also gave partial fee reimbursement.
Promotion of higher education
Jagananna Vidya Deevena, Jagananna Dharam Deevena by providing financial assistance for food and lodging facilities along with full fee reimbursement for poor students to pursue higher education.
4-year honors courses and 30 percent skill development courses to increase the skills of the students to get immediate employment by changing the curriculum to meet the current needs with a job-oriented curriculum.
By putting 10 months compulsory internship in the curriculum, Shri YS Jagan government is preparing the students according to the requirements of the industries.
Agreement with Microsoft to train 1.62 lakh students in 40 skills, already 1.07 lakh people have been trained in Microsoft technology and 73 thousand people in other cutting-edge technologies, distribution of certificates, AP is the only state in the country to achieve more than 1.75 lakh certifications in a single calendar year.
The reforms of Shri YS Jagan’s government are giving good results
In 2018-19, the number of students who did not go for studies on Inter Pass was 81,813, but due to the education and accommodation benefits introduced by the Jagananna government, this number has significantly reduced to 22,387 by 2022-23. In 2018-19, the average number of students who did not go for higher education was 20.37 percent, and by 2022-23, this average has come down to 6.62 percent.
Gross Enrollment Ratio (GER) increased to 37.2 in 2020-21 from 32.4 in 2018-19. Steps will be taken to bring the GER percentage to 70 in the coming days. In 2018–19, on an average, 81 girls were enrolled in colleges for every 100 boys, and this average increased to 94 by 2020–21.
Campus placements have also increased significantly from 37,000 in 2018-19 to 85,000 by 2021-22.
Providing transparent schemes to all the deserving people without discrimination of caste, religion and party and without resorting to bribes, only on reforms in the education sector, the total expenditure of Shri YS Jagan’s government in the last 45 months is Rs. 57,642.36 crores.
Steps towards digital education
Free tabs with Byjus content for 8th standard students, 30,213 interactive flat panels in every classroom above 6th standard in schools already developed by Nadu, 10,038 Smart TVs in foundation and foundation plus schools.
Shri YS Jagan’s government introduced revolutionary reforms in the education system with the aim that government schools should not compete with corporate schools, but corporate schools should compete with government schools.
18.03.2023
అమరావతి
జగనన్న విద్యా దీవెన
పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్ – క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లింపులు
అక్టోబర్ – డిసెంబర్ 2022 త్రైమాసికానికి 9.86 లక్షల మంది విద్యార్ధులకు రూ. 698.68 కోట్లను సీఎం శ్రీ వైఎస్ జగన్ నేడు (19.03.2023) ఎన్‌టీఆర్ జిల్లా తిరువూరులో బటన్ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం శ్రీ వైఎస్ జగన్
గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీఇంబర్స్‌మెంట్‌కు 2017 సంవత్సరం నుండి పెట్టిన బకాయిలు రూ. 1,778 కోట్లతో కలిపి ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 13,311 కోట్లు.
పేద విద్యార్ధులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు లిమిట్స్ లేవు. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందిని చదివించవచ్చు.
జగనన్న విద్యా దీవెన
పేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం
జగనన్న వసతి దీవెన
ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించేవారికి రూ. 20 వేల చొప్పున ఆర్ధిక సాయం. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి, వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో నేరుగా జమ చేస్తున్న శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం
కాలేజీల్లో జవాబుదారీతనం పెరిగేలా, తల్లులకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ, తల్లుల సాధికారతకు పట్టం కడుతూ ఆర్ధిక సాయం నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ
గత ప్రభుత్వంలో ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులకు పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్ ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు, అరకొరగా ఇచ్చిన ఫీజు రీఇంబర్స్‌మెంట్ కూడా సంవత్సరాల తరబడి జాప్యంతో, భారీగా బకాయిలు పెట్టిన పరిస్ధితి, భోజన, వసతి ఖర్చులు దేవుడెరుగు, ఇచ్చిన ఫీజు రీఇంబర్స్‌మెంట్ సైతం అరకొరగా ఇచ్చిన గత ప్రభుత్వం.
ఉన్నత విద్యకు ప్రోత్సాహం
పేద విద్యార్ధులు ఉన్నత విద్యను అభ్యసించేలా పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌తో పాటు భోజన, వసతి సౌకర్యాలకు కూడా ఆర్ధిక సాయం అందిస్తూ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన
జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్‌తో ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు కరిక్యులమ్‌లో మార్పులు చేసి నాలుగేళ్ళ ఆనర్స్ కోర్సులు, విద్యార్ధులలో నైపుణ్యాలు పెంచి వారు వెంటనే ఉపాధి పొందేలా 30 శాతం నైపుణ్యాభివృద్ది కోర్సులు
కరిక్యులమ్‌లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్‌షిప్ పెట్టడం ద్వారా విద్యార్ధులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్న శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం
40 నైపుణ్యాలలో 1.62 లక్షల మంది విద్యార్ధులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం, ఇప్పటికే 1.07 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలో, 73 వేల మందికి ఇతర అత్యాధునిక సాంకేతిక అంశాల్లో శిక్షణ పూర్తి, సర్టిఫికెట్స్ పంపిణీ, దేశంలో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 1.75 లక్షల కంటే ఎక్కువ సర్టిఫికేషన్స్ సాధించిన ఏకైక రాష్ట్రంగా ఏపీ
సత్ఫలితాలు ఇస్తున్న శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వ సంస్కరణలు
ఇంటర్ పాసై పై చదువులకు వెళ్ళని విద్యార్ధుల సంఖ్య 2018–19 లో 81,813 కాగా జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా దీవెన, వసతి దీవెన కారణంగా ఈ సంఖ్య గణనీయంగా తగ్గి 2022 –23 నాటికి 22,387 కి చేరింది. 2018 – 19 లో పై చదువులకు వెళ్ళని విద్యార్ధుల సగటు 20.37 శాతం కాగా, 2022–23 నాటికి ఈ సగటు 6.62 శాతంకి తగ్గింది.
2018–19 సంవత్సరంలో 32.4 గా ఉన్న స్ధూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) 2020–21 సంవత్సరానికి 37.2 కి పెరిగింది. రాబోయే రోజుల్లో జీఈఆర్ శాతం 70 కి తీసుకువెళ్ళేలా చర్యలు. 2018–19లో సగటున ప్రతి 100 మంది బాలురకు 81 మంది బాలికలు కళాశాలల్లో చేరితే 2020–21 నాటికి ఈ సగటు 94 కు పెరిగింది.
2018–19 లో 37,000 గా ఉన్న క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కూడా గణనీయంగా పెరిగి 2021 – 22 సంవత్సరానికి 85,000 కు చేరడం విశేషం
అర్హులందరికీ క్రమం తప్పకుండా కుల, మత, పార్టీ వివక్ష లేకుండా, లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా పథకాలు అందిస్తూ కేవలం విద్యారంగంలో సంస్కరణలపై మాత్రమే శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం గత 45 నెలల్లో చేసిన వ్యయం మొత్తం రూ. 57,642.36 కోట్లు.
డిజిటల్ విద్య దిశగా అడుగులు
8 వ తరగతి విద్యార్ధులకు బైజూస్ కంటెంట్ తో కూడిన ఉచిత ట్యాబ్‌లు, నాడు నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ది చేసిన పాఠశాలల్లో 6 వ తరగతి పైన ప్రతి క్లాస్ రూమ్‌లో ఉండేలా 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, 10.038 ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్ళల్లో స్మార్ట్ టీవీలు.
ప్రభుత్వ బడులు కార్పొరేట్ బడులతో పోటీ పడడం కాదు, కార్పొరేట్ బడులే ప్రభుత్వ బడులతో పోటీపడాలి అన్న లక్ష్యంతో విద్యావ్యవస్ధలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం