స్పూర్తి నిచ్చే మహిళా మణులు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా …
అమ్మగా, అక్కగా, చెల్లిగా , ఆలిగా, అన్నీ తానుగా.. అణువణునా అందరి జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది. ఆకాశంలో సగం తానే ..కానీ అవని అంతా.. తానే అయ్యి ..నేల నుంచి నింగిదాకా నేడు అన్ని రంగాల్లో ముందుoటున్నారు నేటి మహిళా మణులు.. అటువంటి ఎందరో మహిళా మూర్తుల గురించి మహిళా దినోత్సవ శభాకాంక్షలుతో మీ ముందుకు వస్తున్నాం ..
కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది .ఆ కష్టానికి తలవంచితే తెలివికింక విలువేది..అన్నారు ఓ మహాకవి.. అది అక్షర నిజం అయింది ఆమె విషయములో..కంపెనీకి వచ్చిన నష్టాలు అప్పుల బాధ తట్టుకోలేక ఆమె భర్త సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్నాడు. అది చిన్న చితక అప్పు కాదు అక్షరాల 7200 కోట్ల అప్పు.. మగవాడైయుండి కూడా గుండె ధైర్యం నింపుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు సిద్ధార్థ . కానీ మహిళ అయినా ధైర్యంగా ముందు అడిగు వేసి ఆ అప్పులను సవాళ్లుగా తీసుకుని జవాబుగా నిలబడ్డారు మాళవిక హెగ్డే..
1969 వ సంవత్సరంలో జన్మించారు మాళవిక హెగ్డే.ఈమె కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కూతురు. ప్రముఖ కాఫీడే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ భార్య. మంగుళూరు కాఫీ ఘుమఘుమలను ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు విజి సిద్ధార్థ. కంపెనీ loss లో ఉండటంతో అప్పులు బాధలు తాళలేక సిద్ధార్థ 2019 లో ఆత్మహత్య చేసుకున్నారు. అతని మరణానంతరం ఆమె గుండె ధైర్యాన్ని కోల్పోకుండా, అప్పుల గురించి భయపడకుండా ఒక్క అడుగు ముందుకు వేసి CEO గా భర్త కంపెనీ బాధ్యతలను చేపట్టారు.. అప్పుడు ఆమె ముందుంది రెండే రెండు . ఎలాగైనా , ఎన్ని కష్టాలు ఎదురైనా తాను నిలబడి కాఫీడేను నిలబెట్టాలి .అలాగే సంస్థ ఉద్యోగులకు అండగా ఉండాలి అని..
కంపెనీ అప్పులు తగ్గించడం వాళ్ళ కంపెనీని నిలబెట్టడం ప్రథమ లక్ష్యమని ఆమె చెప్పారు .చెప్పటమే కాదు చేతల్లో చేసి చూపించారు సీఈఓ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కంపెనీ అప్పలను దాదాపు 95% పూర్తి చేశారు .7,200 కోట్ల అప్పు నుంచి 465 కోట్లకు అప్పుని తగ్గించారు అది 6 సంవత్సరాల లోపే.. అది అంత తేలికైన విషయమైతే కాదు .సిద్ధార్థ మరణానంతరం ఉద్యోగుల్లో అడుగంటిన ఆశలను తట్టి లేపేనదుకు 25 వేల మంది ఉద్యోగులు అందరికీ వ్యక్తిగతంగా లేఖలు రాశారు. వాటాలను కొన్ని మైండ్ ట్రీ ,శ్రీరామ్ క్రెడిట్ కంపెనీ , వే టు వెల్ట్ లకు అమ్మి అప్పును 2693 కోట్లకు తగ్గించారు. ఆదాయం పెంచుకోవడం తప్ప ఆమెకి ఇంకొక మార్గం కూడా లేదు .అందుకే ఆమె 20,000 ఎకరాల పొలం నుండి అధిక నాణ్యత గల అరేబియా బీన్స్ ను ఎగమతి చేయడం ద్వారా విదేశాల్లో కూడా తమ డిమాండ్ పెంచుకున్నారు. అలాగే హైవేలపై ,ఆఫీసుల్లో ,థియేటర్లో , మాల్స్ లో కూడా తమ కంపెనీ మెషీన్స్ ను ఉంచారు అలా అప్పును 1731 కోట్లకు తగ్గించుకున్నారు. ఆపై 165 నగరాల్లో 572 కెఫే లు,333 వాల్యూ ఎక్స్ప్రెస్ కియోస్క్ లు ఏర్పాటు చేశారు. అలా 465 కోట్ల వరకు అంటే తమకున్న అప్పుల్లో 95% వరకు తగ్గించేశారు. విజయ పథం వైపు ఉన్న ఆమె జీవితం.. ఆత్మహత్య వైపు అడుగులు వేసే ఎంతో మందికి ఆదర్శం అవ్వాలి..
స్పాట్
(మాళవిక హెగ్డే ఇమేజ్ )
Infosis ప్రతి ఒక్కరికీ తెలిసిన ప్రముఖ సంస్థ.. ఆ సంస్థ స్థాపకులు నారాయణమూర్తి భార్యా . Non profit charitable organisation infosis foundation chairperson సుధామూర్తి. simplicity కి మారు పేరు.. ఒక సామన్యురాలిగా మొదలైన ఆమె ప్రయాణం ఓ సంస్థ అధినేతగా మారడం వరకే కాదు రాజ్యసభ వరకు చేరింది ఆమె ఇన్స్పిరేషనల్ స్టోరీ తెలుసుకుందాం..
సుధామూర్తి కర్ణాటక రాష్ట్రం హవేరీ జిల్లా షిగ్గాన్ లో 1950ఆగస్టు 19 న ఆమె జన్మించారు. ఆమె బాల్యం అంతా కుటుంబ విలువలతో ఒక గారాబంగా అందరి మధ్య పెరిగారు .అందుకే ఆమె How I Taught my grandmother to Read & other stories అనే పుస్తకాన్ని కూడా రచించారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో పట్టాను పొందారు. అంతేకాదు తమ కళాశాల నుంచి topper గా నిలిచారు. అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు. ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ ను ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి చేశారు. అందులోనూ topper గా gold medal అందుకున్నారు ఆవిడ..
ఆ తరువాత ప్రసిద్ధ TELCO AUTOMOBILES లో మొదటి ఉద్యోగం చేపట్టారు .వాస్తవానికి అప్పుడు ఆ సంస్థ కేవలం పురుషులకు మాత్రమే ఉద్యోగం ఇచ్చేవాళ్ళు. దాన్ని ప్రశ్నిస్తూ ఆవిడ ఆ సంస్థ అధ్యక్షుడుకు ఒక లేఖ రాసి పంపారు. దానికి స్పందించిన ఆ సంస్థ అధ్యక్షుడు ఆమెకు ముఖాముఖి ఇంటర్వ్యూ నిర్వహించారు .ఆ తర్వాత స్పాట్లోనే ఆమెకు నియామక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఆ సంస్థ యొక్క పూణే బ్రాంచ్ లో ఆమె పని చేశారు. ఇక ఆ సమయంలోనే ఆమెకు తన భర్త నారాయణమూర్తి తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నారాయణమూర్తి భార్య గా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కూడా స్థాపించారు . గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాలలో కీలక పాత్రను పోషించారు. అనేక అనాధాశ్రమాలు నిర్మించారు.గ్రామీణ అభివృద్ధి పనులు కూడా చాలా చేపట్టారు. ఆమె సంఘ సేవకురాలు, రచయిత్రి కూడా.. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. ఆమె కన్నడ నవల డాలర్ సాస్ రాశారు. అది ఆంగ్లంలోకి అనువదించబడింది. Z tv లో కూడా ఈ సీరియల్ ప్రసారం చేయబడింది.ఆమె కృషికి గాను అనేక అవార్డులను కూడా ఆమె కైవసం చేసుకున్నారు .అయితే 2006లో అత్యుత్తమ భారత ప్రభుత్వ పురస్కారమైనటువంటి పద్మశ్రీ ని సామాజిక సేవా ,దాతృత్వం, విద్యారంగాలలో ఆమె చేసిన సేవలుకు అందజేశారు . అలాగే 2023 లో పద్మభూషణ్ అవార్డును కూడా పొందారు .
అవని లోనే కాదు ఆకాశంలో కూడా నేటి మహిళా తన సత్తా చాటుతోంది. వినీల ఆకాశంలో ఉన్న రహస్యాలను సైతం ఛేదించే దిశగా సాహసోపేత అడుగులు అంతరిక్షం వైపుకు వేస్తుంది. అందుకు నిలువుటేత్తూ ఉదాహరణ సునీతా విలియమ్స్..
సునీతా విలియమ్స్ యునైటెడ్ స్టేట్స్ నావికా దళ అధికారి. నాసా వ్యోమగామి. సునీతా విలియమ్స్ అమెరికాలో ఒహాయో రాష్ట్రంలో జన్మించారు. తండ్రి దీపక్ పాండ్యే భారతదేశం గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఇక ఆమె తల్లి స్లోవేకియా దేశాస్తురాలు. ఆ దంపతుల 3 వ సంతానమే సునీతా విలియమ్స్. అమెరికాలోని నావల్ అకాడమీలో physics degree ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి engeneering mangement లో master degree చేశారు. నౌకా దళంలో గతంలో బేసిక్ డైవింగ్ ఆఫీసర్గా తండ్రి ప్రోద్భలంతో జాయిన్ అయ్యారు.. ఆ పై యుద్ధ విమానాలు నడపడంలో కూడా శిక్షణ పొందారు 30 సంవత్సరాల తన వృత్తిలో వివిధ ఎయిర్ క్రాఫ్ట్ లపై 2770 ఫ్లైట్ అవర్స్ గడిపారు. 1987 లో నావెల్ ఏవియేషన్ ట్రైనింగ్ కమాండ్ వద్ద ఏవియేటర్ శిక్షణ పొంది తర్వాత జులై 1989లో యుద్ధ హెలికాఫ్టర్లో శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు. పెర్షియన్ గల్ఫ్ యుద్ధ సన్నాహాక కార్యక్రమాలు ఇరాక్ లోని కుర్దుష్ ప్రాంతాలపై నో ఫ్లై జోన్ లు స్థాపన లో కూడా ఆమె పాల్గొన్నారు. నాసా వ్యోమగామిగా ఎంపిక అయ్యారు.1998 లో అంతరిక్ష శిక్షణ కూడా తీసుకున్నారు. కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ మహిళగా రికార్డు కూడా సృష్టించారు.సునీత విలియమ్స్ తొలి అంతరిక్ష పర్యటన 2006 డిసెంబర్ నుండి 2007 జూన్ వరకు జరిగింది .ఇక రెండవసారి 2012లో 4నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఆమె గడిపారు. అంతరిక్ష మొదటి ప్రయాణంలో ఆరు నెలలు సౌరఫలకాలను అమర్చడం. ప్రయోగాలకు అనువుగా ఆ కేంద్ర మరమ్మతులు చేయడం వంటివి చేశారు. ఇక రెండవసారి ఆర్బిటింగ్ ప్రయోగశాలపై పరిశోధనలు చేశారు. అంతేకాదు ఆమె సముద్ర గర్భంలో కూడా పరిశోధనలు చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాకు దగ్గరలో కీలర్గో అనే ప్రాంతంలో 9 రోజులు పాటు జరిగిన అన్వేషంలో సముద్ర గర్భంలో మానవ ఆవాసానికి వీలయ్యే పరిస్థితులను పరిశోధించి నాసా ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ మిషన్ ఆపరేషన్స్ లో పాల్గొన్నారు. కాగా సునీతా విలియమ్స్ 2024 జూన్ 5 న కేవలం 10 రోజులు మిషన్ లో భాగంగా రోదసి యాత్ర చేపట్టారు .జూన్ 14 ,2024 లో ఆమె తిరుగు ప్రయాణం కావాలి కానీ.. స్టార్ లైనర్ వ్యోమ నౌకలో హీలియం లీకేజ్ కారణంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ప్రయాణం వాయిదా పడింది. ఆ తరువాత june 26 న ఆమె అంతరిక్షం నుండి భూమికి తిరుగు ప్రయాణం అనుకున్నారు. కానీ అది కూడా వాయిదా పడింది. చివరకు సునీత విలియమ్స్ తో పాటు మరో వ్యోమగామి లేకుండానే బోయింగ్ భూమి మీదకు వచ్చేసింది.. కాగా గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ తో పాటు మరో వ్యక్తిని తీసుకురావడానికి 2025 మార్చి 12 న మిషన్ తిరిగి స్టార్ట్ చేయనుంది నాసా. అయితే వీరిని తీసుకురావడానికి కొత్త క్యాప్సిల్ మిషన్ ఆలస్యం జరగడంతో నాసా ముందుగా ఉపయోగించిన space ఎక్స్ కాప్సూల్నే పంపాలని ఎంచుకుంది ఇక మార్చి 12వ తారీఖున నింగిలోకి ఆ మిషన్ దూసుకు వెళ్లనుంది .సునీత విలియమ్స్ సహా మరో వ్యోమగామినీ తీసుకొని march 19 కు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ మిషన్ సక్సెస్ అయ్యి క్షేమంగా సునీత విలియమ్స్ నింగి నుంచి నేల మీదకు రావాలని అందరం మనసారా ఆకాంక్షిద్దాం..