అమరావతి రాజధాని నగర పరిధిలో వ్యాపారాలు నిర్వహించే వారికి ముఖ్య గమనిక
ప్రజారాజధాని అమరావతి నగర పరిధిలో ప్రభుత్వ భూములు లేదా APCRDA ఆధీనంలో ఉన్న భూములు, రహదారులు, ఖాళీ స్థలాలు, ప్రజా ప్రదేశాల్లో గత కొన్ని రోజులుగా అక్రమ ఆక్రమణల తొలగింపు చర్యలు చేపడుతున్నాము.
అమరావతిలో అనుమతి లేకుండా కంటైనర్లు, బండ్లు, కియోస్కులు, తాత్కాలిక షెడ్లు లేదా ఇతర శాశ్వత నిర్మాణాలు అనుమతించబడవని తెలియజేయుచున్నాము. వాటి యొక్క తొలగింపు, రవాణా, నిల్వ & ఇతర ఖర్చులు సంబంధిత ఆక్రమణదారుల నుంచే వసూలు చేయబడతాయని తెలియజేయుచున్నాము. కాగా మొబైల్ వ్యాన్లు, తోపుడు బళ్ళు(ఏ రోజుకా రోజు తరలించే విధంగా ఉన్నవి) ద్వారా వ్యాపారం నిర్వహించుకోవడంపై APCRDAకి ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేయుచున్నాము. కానీ సంబంధిత నిర్వాహకులు వారి వ్యాపారాలను ప్రజారవాణాకు అడ్డంకిగా ఉంచకుండా నిర్వహించుకోవాలని తెలియజేయడమైనది.


















































