విజయవాడ. పడమట లంక
###################
బాలికలు విధ్యతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి.
…. కేసలి అప్పారావు
@@@
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని బాలికలు అందరూ చదువుతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది రాణించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు తెలిపారు.
విజయవాడ పడమట లంక
కే సి ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో యూత్ ఫర్ సేవ స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఎన్ ఎం ఎం ఎస్ పరీక్షలలో ప్రతిభ కనబర్చిన 15 మంది బాలికలుకు ప్రోత్సాహక బహుమతులును జిల్లా విద్యా శాఖ అధికారిని రేణుక సమక్షంలో ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ అప్పారావు మాట్లాడుతూ ప్రభుత్వం తో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు బాలలకు విద్యా, వైద్య సేవలు విషయంలో సహాయ సహకారం అందించి వారిని నిరంతరం ప్రోత్సహిస్తున్నాయి అని తెలిపారు.
ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం బాలికలు విధ్య కోసము అనేక రకాల పదకాలును ప్రవేశపెట్టి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం కల్పిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారిని రేణుక మాట్లాడుతూ జిల్లా విధ్యా శాఖ బాలికలు విద్యా ప్రమాణాలును పెంచుతూ వారికి కావలసిన సకల సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వాటిని పూర్తి స్థాయిలో వినియోగించు కొని రాణించాలని కోరారు.ప్రభుత్వ పాఠశాలలను అన్ని రకాలుగా మౌళిక సదుపాయాలు అందుబాటులో ఉంచుతున్నా రని, కార్పొరేట్ స్థాయిలో ఉంటున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిది ఆదూరి అనూష మరియు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు