భూలోక స్వర్గం ఫిన్లాండ్
ఆదాయం, ఆరోగ్యం, ఆదరించేవారు, జీవితంలో నిర్ణయాలు తీసుకోగలిగిన స్వేచ్ఛ, వితరణ, అన్నింటికన్నా ముఖ్యం లంచగొండితనం లేకపోవడం వల్ల ఫిన్లాండు సంతోషకరమైన దేశంగా రెండోసారి కూడా ఎన్నికైంది. ఒక్కమాటలో చెప్పాలంటే సంతోషం కేరాఫ్ ఫిన్లాండ్ గా గణతికెక్కింది.
ఫిన్లాండు వాసులు ఒకరిని ఒకరు నమ్ముతారు,అదే సమయంలో సహాయపడతారు ఇదే వారి ఆనందకర జీవిత రహస్యం. ఫిన్లాండు కుటుంబ జీవితానికి చాలా మంచి దేశం. మానవహక్కులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే దేశం. అలాగే లింగ వివక్షలేనిదేశం. ఇదే ప్రపంచ దేశాల ప్రశంసలకు కారణమైంది.
2021లో 36 వేల మంది అక్కడ శాశ్వతంగా నివాసం ఉండటానికి వెళ్లారు. అలాగే 20వేల మంది విద్యార్థులు కూడా ఉన్నత చదువుల కోసం వెళ్లారు.
ఉత్తర యూరప్ లో ఉన్న ఫిన్లాండులో రెండువంతుల భూమి అడవులు, కొలనులతో నిండి ఉంటుంది. అక్కడ 41 జాతీయ పార్కులు ఉన్నాయి. అందమైన కోస్తాతీరం దాని సొంతం. ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ద్వీపసమూహం అతిపెద్ద సరస్సులు గల జిల్లా ఫిన్లాండులో ఉంది. హెల్సింకి, ఎస్పో, టాంపేర్, తుర్కు, వంటా, ఓయులు ముఖ్య నగరాలు. కుటుంబాలన్నీ అడవుల్లో ఉన్న పెద్ద గ్రామాల్లో నివశిస్తారు. వైద్యం, విద్య, డేకేర్ సెంటర్లు, వంటివన్నీ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ నివసించే ప్రజలు ప్రకృతికి దగ్గరగా ఉంటారు దీంతో వారంతా ఆనందంగా ఉంటారు.
1. ఉచిత విద్య
ఎల్ కేజీ నుంచి పీహెచ్డీల వరకు విద్య అక్కడ ఉచితమే. కుటుంబ ఆదాయం ఎంతయినప్పటికీ అందరికీ ఒకే రకమైన విద్య అందుబాటులో ఉంటుంది. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా దేశ ప్రగతిలో పాలుపంచుకోవాలని పాలకులు భావిస్తారు. అందుకోసం ఫ్రీ స్కూల్, ఎలిమెంటరీ, అప్పర్ సెకండరీ, వొకేషనల్ ఎలిమెంటరీ విద్యార్థులకు ఫ్రీ మీల్స్ ఉంటుంది.
2. అంతర్జాతీయ విద్యార్తులు కూడా ఫిన్లాండులో నచ్చిన రంగంలో పనిచేయవచ్చు. వారానికి 30 పని గంటల ఉంటాయి. గంటకు 8 నుంచి 12 యూరోలు సంపాదించుకోవచ్చు.
3. అందరికీ కల్తీలేని సమతుల్య ఆహారం అందుతుంది. ప్రకృతి వనరులను ఏమాత్రం కాలుష్యం బారిన పడనీయరు. ఆర్గానిక్ ఉత్పత్తులను వారు తింటారు. అందులో పుట్టగొడుగులు, బెర్రీ లాంటివి చాలా ఉన్నాయి.
4. ఆహార భద్రత కలిగిన మొదటి దేశం ఫిన్లాండ్, ఆరోగ్యకరమైన ఆహారం ఫిన్లాండు ప్రజలందరికీ అందుతుంది.
5. ప్రపంచంలోనే అతి శుద్దమైన నీరు ఫిన్లాండులో ఉంది. ఆదేశంలో సుమారు 1,88,000 సరస్సులు ఉన్నాయి. పజ్జీనాలోని నీటిని యధాతధంగా తాగవచ్చు. (సగం రోగాలకు నీటికాలుష్యం మూలం). ఈ నీటిని దేశంలోని అందరికీ పంపుతారు.
6. ఇక్కడ విద్య కోసం ప్రభుత్వం దేశంలోని పిల్లలందరిపై పెట్టుబడిపెడుతుంది. లిటరసీ రేటు 100 శాతం. వీరంతా ప్రపంచ పౌరులుగా ఎదిగి, అందరి సంక్షేమం కోసం వారు పాటుపడతారు.
7. ఫిన్లాండును ఒక్కసారి దగ్గర నుంచి చూస్తే మన జీవితాల్లో తప్పకుండా మార్పు తీసుకొస్తుంది. అక్కడ బాగా నాగరికత చెందిన ఆనందకరమైన సమాజాన్ని చూడగలం.
8. సురక్షితమైన పర్యావరణంలో ఆనందకరమైన కుటుంబంతో జీవించవచ్చు. ఇక్కడ మానవహక్కులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కుటుంబంతో స్నేహ పర్యావరణం, లింగ సమానత్వం ఇంకా ఎన్నో పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందుకే ఇధి భూమిపై సంతోషకరమైన దేశంగా పేరుపొందింది.
ఇక్కడ క్రైమ్ రేటు చాలా తక్కువ. కేవలం 5శాతం మంది మాత్రమే హింసాత్మక ఘటనలకు గురయ్యారు అది కూడా ట్రాఫిక్ దుష్ర్ఫవర్తనల వల్లే.
9. ఈ దేశంలో బిడ్డను కలిగి ఉండటం ఆశీర్వాదంగా భావిస్తారు. ఈ శుభసమయాన్ని ప్రభుత్వం విలువైనదిగా భావించి తల్లిదండ్రులకు 164 రోజులను సెలవులను మంజూరు చేస్తుంది. అంతేకాకుండా రోజుకు 30 యూరోలను అందచేస్తుంది. (జీతాన్ని బట్టి) తల్లి మాత్రం బిడ్డకు ఏడాది వయస్సు వచ్చేవరకు సంరక్షణ చూసుకుంటుంది. ప్రభుత్వం ఇక్కడ మంచి పేరెంట్ చట్టాలను కూడా అమలు చేస్తుంది. సింగిల్ పేరెంట్ కూడా ఇక్కడ అనేక సదుపాయాలు ఉన్నాయి.
10. ఈ దేశంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. పురుషులు ,మహిళలు సమానంగా చట్టసభల్లో ఉంటారు. 1906 నుంచి మహిళలు చట్టసభలకు ఎన్నికవుతున్నారు. ఇక్కడ మహళలు అంతర్జాతీయంగా అనేక అవకాశాలు అందిపుచ్చుకుంటారు. 2019లో బాధ్యతలు స్వీకరించిన ప్రస్తుత ప్రధాని సన్నామరిన్ (34) ప్రపంచంలోనే అతిపిన్న ప్రధానిగా పేరుపొందారు.
11. ప్రకృతి రమణీయతతోపాటు అక్కడి ఆర్కెటెక్ కూడా మనస్సు దోచుకుంటుంది. అక్కడ దాదాపు అన్ని భవనాలకు ప్రపంచస్తాయి ఆర్కిటెక్చర్ మనలను కళ్లుతిప్పుకోనీయదు.
స్యూమెన్లిన్న కోట, ఫిన్లాండ్ హాల్, లూధరన్ ఛాపెల్ ఆఫ్ సైలెన్స్, డిజైన్ మ్యూజియం, మ్యూజియం ఆఫ్ ఫిన్నిష్ ఆర్కెటెక్చర్ చూడాల్సిందే.. వీటిని అక్కడి వారు చాలా గౌరవంగా గర్వంగా పరిచయం చేస్తారు.
ఫిన్లాండులోని హెల్త్ కేర్ ప్రపంచంలో మరెక్కడా ఉండదు. ఆరోగ్యం, వైద్యం, సమాజిక సేవలు అక్కడి మున్సిపాలిటీలే చూసుకుంటాయి. ప్రాధమిక వైద్యం నుంచి ప్రత్యేక మెడికల్ కేర్ వరకు హెల్త్ సర్వీసులు చూసుకుంటాయి. ఇందులో కంపెనీలు, డాక్టర్లు, ఫౌండేషన్లు, ఆర్గనైజేషన్లు ఈ సేవల్లో పాలుపంచుకుంటాయి.
12. ప్రకృతి ఒడిలోని ఫిన్లాండులో అందమైన దృశ్యాలతోపాటు, శుద్ద జలాలు కూడా ఉంటాయి. ప్రభుత్వం, ప్రజలు వాటిని నిరంతరాయం శ్రద్దగా కాపాడుతారు. చాలా దేశాలకంటే ఫిన్లాండు ప్రకృతి వనరులను జాగ్రత్తగా కాపాడుకుంటుందని ప్రపంచం గుర్తించింది. 2035 నాటికి కర్బన ఉద్గారాలను తటస్తీకరించి, 2050 నాటికి 90శాతానికి తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.
13. అత్యద్భుత రవాణా వ్యవస్థ ఫిన్లాండులో ఉంది. రాజధాని హెల్సికి నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లకు ఉంది. ట్రైన్లు, బస్సులు అన్నిప్రాంతాలకు అందుబాటులో ఉంటాయి. వెబ్ సైట్లద్వారా, వెండింగ్ మిషన్ల ద్వారా రైలు టికెట్లను కొనుగోలు చేయవచ్చు. ఇంకా అనేక కంపెనీలు కూడా బస్సు సదుపాయం కల్పిస్తాయి. పెన్షనర్లకు, పిల్లలు, విద్యార్థులు, మిలటరీ, సివిల్ సర్వీసువారికి చార్జీలలో డిస్కౌంటు ఉంటుంది.
14. ట్రాఫిక్ కష్టాలు లేని దేశం ఫిన్లాండు దీంతో ఇక్కడ యాక్సిడెంట్లు, ట్రాఫిక్ ఇబ్బందులు, ఉండవు, రోడ్డు నిర్వహణ చాలా బాగుంటుంది. కారణం ముందుగా ప్లాన్ చేసుకొని రోడ్లను రూపొందించడమే. ఫిన్లాండు ప్రజలు నడవడానికి, సైకిల్ పై వెళటానికి ప్రాధాన్యత ఇస్తారు. నగర వీధుల్లో రోడ్డుపై కేవలం 40 కిమీ వేగంతోనే ప్రయాణించాలి.
15. ప్రపంచంలో ఎన్ని మార్పులు జరిగినా ఫిన్లాండు మాత్రం తమ దేశ ప్రజల చిరునవ్వుని కొనసాగించే ప్రక్రియలనే చేపడుతుంది. అందుకే అది భూమిపై స్వర్గంగా పేరుతెచ్చుకుంది.
ఒక్కసారి ఫిన్లాండు వెళ్లండి.. ప్రభుత్వాలు ఎలా పనిచేయాలో… ప్రజలు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో తెలుస్తుంది. అంతేకాదు సంతోమైన సమాజాన్ని ఎలా నిర్మించాలో కూడా తెలుసుకోవచ్చు.
Finland is heaven on earth
Finland was voted the happiest country for the second time because of income, health, people who care, freedom to make life decisions, distribution and most importantly lack of bribery. In a word, the carafe of happiness is Finland.
Finns believe in each other and help each other at the same time, this is the secret of their happy life.
Finland is a very good country for family life. A country where human rights are given top priority. Also a gender neutral country. This is the reason for the praise of the world countries.
In 2021, 36,000 people moved there to live there permanently. Also 20 thousand students also went for higher studies.
Located in Northern Europe, two-thirds of Finland’s land is covered with forests and lakes. There are 41 national parks. It has a beautiful coastline. Finland is home to the world’s largest archipelago and largest lake district. Major cities are Helsinki, Espoo, Tampere, Turku, Vantaa and Oulu.
All the families live in large villages in the forest. Medical, education, day care centers etc are available. People living here are close to nature and thus they are all happy.
1. Free Education
Education is free there from KG to PhDs. The same kind of education is available to all regardless of family income. The rulers think that everyone should be healthy and happy and participate in the progress of the country. For that, there will be free meals for free school, elementary, upper secondary and vocational elementary students.
2. International students can also work in the field of their choice in Finland. There are 30 working hours per week. You can earn 8 to 12 euros per hour.
3. All get unadulterated balanced food. Natural resources are not affected by pollution at all. They eat organic produce. There are many mushrooms and berries in it.
4. Finland is the first country with food security, healthy food is available to all Finnish people.
5. Finland has the cleanest water in the world. There are about 1,88,000 lakes in the mandate. The water in Pajjina can be drunk as usual. (Half of the diseases are caused by water pollution). This water is sent to everyone in the country.
6. Here the government invests in all the children of the country for education. Literacy rate is 100 percent. All of them grow up to be global citizens and work together for the welfare of all.
7. A close look at Finland will definitely change our lives. There we can see a well-civilized and happy society.
7. Live with a happy family in a safe environment. Human rights are very important here. Friendly environment with family, gender equality and many other positive factors. That is why Idhi is known as the happiest country on earth.
The crime rate here is very low. Only 5 percent of people were victims of violent incidents and that too due to traffic mishaps.
8. Having a child is considered a blessing in this country. The government values this auspicious time and grants 164 days of leave to parents. Also provides 30 euros per day. (Depending on salary) The mother takes care of the child till the age of one year. The government also enforces good parenting laws here. Single parent also has many facilities here.
9. Safety of women is a top priority in this country. Men and women are equal in the legislatures. Women have been elected to legislatures since 1906. Here Mahals are offered many opportunities internationally. The current Prime Minister Sannamarin (34), who took charge in 2019, is known as the youngest Prime Minister in the world.
11. Along with the beauty of nature, the architecture is also mind-blowing. The architecture of almost all the buildings there is stunning.
Syumenlinna Castle, Finland Hall, Lutheran Chapel of Silence, Design Museum, Museum of Finnish Architecture are must-sees.
Healthcare in Finland is second to none in the world. Health, medical and social services are taken care of by the local municipalities. Health services range from primary care to specialized medical care. Companies, doctors, foundations and organizations participate in these services.
12. In the lap of nature, Finland has beautiful scenery and clear waters. The government and the people protect them constantly. The world recognizes that Finland conserves its natural resources more carefully than most countries. The government hopes to neutralize carbon emissions by 2035 and reduce them to 90 percent by 2050.
13. Finland has an excellent transport system. From the capital Helsinki to all over the world. Trains and buses are available to all areas. Train tickets can be purchased through websites and vending machines. Many companies also provide bus services. There is a discount in charges for pensioners, children, students, military and civil service.
14. Finland is a country without traffic problems, so there are no accidents, traffic problems, and the road management is very good. The reason is to plan ahead and build the roads. Finnish people prefer walking and cycling. Travel at a speed of just 40 kmph on the city streets.
15. No matter how many changes happen in the world, Finland takes the same steps to keep the smile of its people. That is why it is known as heaven on earth.
Go to Finland once… you will know how governments should work… how responsible people should be. Also learn how to build a happy society.