డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ క్రింద చికిత్సల వ్యయ పరిమితి రూ.25 లక్షలకు పెంపు
అమరావతి.
డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ క్రింద చికిత్సల వ్యయ పరిమితి రూ.25 లక్షలకు పెంపు, మరింత మెరుగైన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీతో పాటు లబ్దిదారులకు దిక్సూచిలా పనిచేసే ఆరోగ్యశ్రీయాప్ ను ప్రతి ఒక్కరి సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేయించే కార్యక్రమం, ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఎక్కడకు వెళ్లాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఎవరిని అడగాలి అనే ఇలాంటి సందేహాలన్నింటికి వివరంగా ప్రతి ఇంటిలోనూ వివరించే కార్యక్రమానికి నాంది పలుకుతూ.. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నేడు (18-12-2023, సోమవారం నాడు) లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్.
పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఉచిత కార్పొరేట్ వైద్యం అందించే విషయంలో మరిన్ని మెరుగులు దిద్దుతూ.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి మరింత జీవం పోస్తూ.. ఆరోగ్యశ్రీలో అతిపెద్ద మైలురాయి.
ఇక నుంచి డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం.
ఇప్పటికే క్యానర్సర్ వంటి వ్యాధులకు ఎంత ఖర్చయినా పూర్తి ఉచితంగా చికిత్స అందిస్తున్న శ్రీ వైయస్.జగన్ ప్రభుత్వం.
ప్రతి ఇంటికి వచ్చి మరింత అవగాహన కల్పిస్తూ.. కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ.
ఆరోగ్యశ్రీపై మరింత విస్తృతంగా….
నేటి నుంచి (18–12–2023) కొత్త ఫీచర్లతో కూడిన ఆరోగ్యశ్రీ కార్డులు ఇంటింటికీ పంపిణీతో పాటు ప్రతి ఇంటిలో కనీసం ఒక్కరికి ఆరోగ్యశ్రీ యాప్ డౌన్‌లోడ్ అయ్యాలా చూడనున్న ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, అశావర్కర్లు, వాలంటీర్లు, మహిళా పోలీసులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు.
తద్వారా 1.48 కోట్ల కుటుంబాలకు మరియు 4.52 కోట్ల మంది లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ సేవలపై విస్తృతంగా అవగాహన.
కొత్త ఫీచర్లతో మెరుగైన ఆరోగ్యశ్రీ కార్డులు.
ప్రతికార్డులో క్యూఆర్ కోడ్, లబ్ధిదారుని ఫోటో, కుటుంబ యజమాని పేరు, ఫోన్ నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో పొందుపరిచిన లబ్ధిదారుని ఆరోగ్యవివరాలతో ABHA ID..
ఆరోగ్యశ్రీ కార్డులో పొందుపరిచిన క్యూఆర్ కోడ్‌తో లాగిన్ అవ్వడం ద్వారా రోగి చేయించుకునే వ్యాధి నిర్ధారణ పరీక్షలు, తీసుకుంటున్న వైద్యం, చికిత్సలు, డాక్టు సిఫార్సులు, సమీపంలోని ఆసుపత్రులు, ఆ ఆసుపత్రులకు చేరేందుకు గూగుల్ మాప్స్ ద్వారా ఆనుసంధానించబడిన మార్గాలు, ఆరోగ్య మిత్ర కాంటాక్ట్ నెంబర్లు తెలుసుకునే వెసులుబాటు,.. తద్వారా రోగి ఆరోగ్యపరిస్థితులపై డాక్టర్లకు, సిబ్బందికి పూర్తి అవగాహన, మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు సులభతరం.
వైఎస్సార్ ఆరోగ్య ఆసరా…
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీలో చికిత్స తీసుకున్న రోగి పూర్తిగా కోలుకుని తిరిగి పనుల్లోకి వెళ్లేవరకు వారి జీవనోపాధికి ఎలాంటి లోటు లేకుండా రోజుకు రూ.225ల చొప్పున నెలకు రూ.5,000 రెండు నెలలైతే రూ.10,000లు అలా ఎన్ని రోజులైనా డాక్టర్ల సూచన మేరకు ఆరోగ్యఆసరా అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిన శ్రీ వైయస్.జగన్ ప్రభుత్వం.
ఇప్పటి వరకూ 25,27,870 మందికి అందించిన భృతి రూ.1,310 కోట్లు.
గత ప్రభుత్వానికీ నేటికీ ఆరోగ్యశ్రీలో తేడా….
గత ప్రభుత్వంలో ఏటా సగటున రూ.1,034 కోట్లు కూడా ఖర్చు పెట్టని పరిస్థితి నుంచి… డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా మీద ఏడాదికి రూ.4,100 కోట్లకు పైగా ఖర్చు చేసిన శ్రీ వైయస్.జగన్ ప్రభుత్వం.
క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులకు ఎలాంటి పరిమితులు లేకుండా నాలుగున్నర సంవత్సరాల కాలంలో వీటి మీద రూ.1,897 కోటు వ్యయం చేసిన శ్రీ వైయస్.జగన్ ప్రభుత్వం.
వైద్య రంగంలో కేవలం సంస్కరణలపై ఈ 55 నెలల్లో జగనన్న ప్రభుత్వం చేసిన, చేస్తున్న మొత్తం వ్యయం దాదాపు రూ.32,279 కోట్లు.
డాక్టర్ వైఎస్సార్‌ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం. ఇప్పటికే క్యాన్సర్ వంటి వ్యాధులకు ఎంత ఖర్చయినా పూర్తి ఉచితంగా చికిత్స అందిస్తున్న ప్రభుత్వం.
కొత్త స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ…
ప్రతి ఇంటికీ వచ్చి మరింత అవగాహన కల్పిస్తూ… కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ.
ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం…
వ్యాధి నివారణ సేవల్లో (ప్రివెంటివ్ హెల్త్ కేర్)లో దేశానికే రోల్ మోడల్‌గా..
గత ప్రభుత్వంలోలా వైద్యం కోసం డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. మీ ఊరిలోనే మీ వద్దనే ఉచిత వైద్యం అందించేలా… దేశంలో ఎక్కడా లేని విధంగా, ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్, ప్రతి మండలానికి కనీసం రెండు పీ.హెచ్.సీలు, ప్రితి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు, ఒక 104 వాహనంలో అనుసంధానం.. ఒక డాక్టర్ పీహెచ్‌సీలో ఉంటే మరొక డాక్టరు తనకు కేటాయించిన గ్రామాలలోని డా.వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్, పాఠసాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి వైద్య సేవలు అందిస్తున్నారు.
కొత్తగా 53,126 వైద్య సిబ్బంది నియామకం, నిరంతరాయంగా ఖాళీల భర్తీ.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ ఒక్క పోస్టూ ఖాళీగా ఉండకూడదనే ఉద్దేశ్యంతో కొత్తగా 53,126 మందికి పైగా వైద్య సిబ్బందిని నియమించిన శ్రీ వైయస్.జగన్ ప్రభుత్వం. సగటున దేశంలోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల కొరత 61 శాతంగా ఉంటే మన రాష్ట్రంలో అది కేవలం 4 శాతం మాత్రమే కావడం రాష్ట్రానికే గర్వకారణం.
జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ –2.
ఫేజ్ –2 లో భాగంగా జనవరి 1, 2024 నుంచి ప్రతి వారం గ్రామీణప్రాంతాల్లో మండలానికి ఒక గ్రామ సచివాలయంలో, పట్టణ ప్రాంతాల్లో ప్రతి వారం ఒక వార్డు పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు.
ఫ్యామిలీ డాక్టర్ సూచన మేరకు సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా విలేజ్ క్లినిక్‌లకు మందులు చేరవేసి, అక్కడి నుంచి ఏఎన్‌ఎంల ద్వారా సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు నేరుగా ఇంటి వద్దనే డబ్యూ.హెచ్.ఓ మరియూ జీఎంపీ ప్రమాణాలు గల మందులు ఉచితంగా అందించే ఏర్పాటుకు శ్రీకారం.
మందులు అయిపోయిన తర్వాత వాటి కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్‌తో అనుసంధానం చేసి నేరుగా డోర్ డెలివరీ చేసే సదుపాయం.
వైద్య సేవల్లో గతానికీ నేటికీ తేడా…
గత ప్రభుత్వంలో
అరకొరగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు. ప్రాణాలు నిలుపుకోవడానికి ప్రజలు అప్పులు చేయాల్సిన దుస్ధితి. క్యాన్సర్ వంటి వ్యాధులకు ప్రత్యేకంగా ఏవిధమైన వెసులుబాటు లేదగు. ఆరోగ్యశ్రీ కోసం ఏటా చేసిన వ్యయం కేవలం రూ.1,304 కోట్లు.
1059 చికిత్సలకు మాత్రమే ఆరోగ్య శ్రీ పరిమితి. మానవతా ధృక్ఫథం లేదు.
ఆరోగ్యశ్రీ కింద నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఖ్య 748 మాత్రమే. ఇక బిల్లుల మాట దేవుడికెరుక. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై మెట్రో నగరాల్లో కేన్సర్, గుండె జబ్బులు, చిన్న పిల్లల జబ్బులు వంటి 3 స్పెషాల్టీస్‌లో మాత్రమే 72 ఆసుపత్రులు అందుబాటు.
ఆరోగ్యఆసరా వంటి పథకం లేదు.
అతి స్వల్పంగా అంబులెన్స్ సేవలు. ప్రాణాప్రాయస్ధితిలో ఉన్నా గంటల తరబడి అంబులెన్స్‌ల కోసం చూడాల్సిన దుస్ధితి.
మందులు కూడా అరకొరగానే ఆస్పుత్రులలో అందుబాటు. అవీ నాణ్యతలేని మందులు.
గతంలో పేదవారు ఆసుపత్రులకు వెళ్లడానికి రవాణా ఛార్జీలు ఇవ్వాలన్న ఆలోచనే లేదు.
మెడికల్ కాలేజీలు సంఖ్య అంతంత మాత్రమే.
విలేజ్, ఆర్బన్ హెల్త్ క్లినిక్‌లు ఊసే లేదు.
ఉద్దానం కిడ్నీ బాధితులను పట్టించుకున్న పాపాన పోలేదు.
ఏచిన్న జబ్బు వచ్చినా వృద్ధులు, గర్భిణీలు, దివ్యాంగులు సైతం మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి వెళ్లాల్సిన దుస్థితి. తీరా అక్కడికి వెళితే డాక్టర్లు అందుబాటులో ఉంటారో లేదో తెలియని దిక్కుమాలిన స్ధితి.
గిరిజన ప్రాంతాల్లో వైద్యం గాలికొదిలేసిన పరిస్థితి. హృద్రోగ బాధితులను పట్టించుకున్న దాఖలాలు శూన్యం.
ప్రస్తుత ప్రభుత్వంలో..
మన ప్రభుత్వంలో వైద్యం ఖర్చు రూ.1,000 దాటిన చికిత్సలకు ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందించాలనే తాపత్రయంతో చికిత్స వ్యయ పరిమితి రూ.25 లక్షల వరకు పెంపు.
క్యాన్సర్ వ్యాధికి ఎలాంటి పరిమితి లేకుండా ఉచిత చికిత్స.
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరాపై మన ప్రభుత్వంలో ఏడాదికి చేసిన వ్యయం రూ.4,100 కోట్లు.
వైద్యం ఖర్చు రూ.1000 దాటీఇన చికిత్సల వైద్య ప్రక్రియలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేరుస్తూ.. చికిత్సల సంఖ్య 3,257 కి పెంపు.
రాష్ట్ర పరిధిలో ప్రమాదాలకు గురైన ఇతర రాష్ట్రాలకు చెందిన బాధితులకు డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు లేనిప్పటికీ నెట్‌వర్క్‌ఆస్పత్రుల్లో ఉచితంగా నగదు రహిత చికిత్స.
నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఖ్య 2,304 కి పెంపు. ఆరోగ్యశ్రీ సేవలు పొందిన వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని తర్వాత ఆసుపత్రులకు క్రమం తప్పకుండా బిల్లుల చెల్లింపు. గత ప్రభుత్వ బకాయిలు రూ.680 కోట్లు కూడా చెల్లించిన శ్రీ వైయస్.జగన్ ప్రభుత్వం.
హైదరాబాద్‌లో 85, బెంగుళూరులో 35, చెన్నైలో 16 ఆసుపత్రులలో 716 ప్రొసీజర్లలో మెరుగైన చికిత్సలు. రాష్ట్రం వెలుపల మొత్తంగా 204 ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు.
వైఎస్సార్‌ఆరోగ్య ఆసరా ద్వారా రోజుకు రూ.225 చొప్పున నెలకు రూ.5,000 అలా ఎన్నిరోజులైనా డాక్టర్ల సూచన మేరకు ఆరోగ్య ఆసరా అందిస్తూ ఇప్పటివరకు 25,27,870 మందికి రూ.1,310 కోట్ల లబ్ధి.
ఆపత్కాలంలో ప్రజల ప్రణాలకు భరోసా కల్పించేలా 1,704 వాహనాలు 104,108 సేవలు కోసం కొనుగోలు. తల్లిబిడ్డీ ఎక్స్‌ప్రెస్‌తో కలిపి అందుబాటులో ఉన్న మొత్తం వాహనాలు 2,204.
డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలు కలిగి ఉన్న మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.
జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల నుంచి ఆస్పత్రులకు రిఫర్ చేసిన వారికి ఆరోగ్యశ్రీ క్రింద ఉచితంగా వైద్యం, ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకున్న అనంతరం వారు తిరిగి ఫాలో అప్ చెకప్ కోసం డాక్టర్ వద్దకు వెళ్లేందుకు రవాణా ఛార్జీల క్రింద రూ.300 చెల్లింపు.
అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ రంగంలో 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, ఇప్పటికే 5 కాలేజీలు ప్రారంభం.
రాష్ట్ర వ్యాప్తంగా 10,132 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, పట్టణ ప్రాంతాల్లో 542 అర్బన్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా వైద్య సేవలు.
రూ.785 క్టోలతో ఉద్దానం ప్రాంతంలో డాక్టర్ వైఎస్సార్ సుజలథార సురక్షిత మంచినీటి ప్రాజెక్టు, పలాసలో కిడ్నీ రీసెర్చ్ మరియూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు.
గిరిజన ప్రాంతాలైన సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాలలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మాణం. పాడేరు, పార్వతీపురం, నర్సీపట్నం గిరిజన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు.
తిరుపతి (పిల్లల హార్ట్ సెంటర్), కడప (మానసిక ఆరోగ్య కేంద్రం), పలాస (కిడ్నీ సెంటర్)లలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు.
హృద్రోగ బాధితుల కోసం విశాఖపట్నం, గుంటూరు, కర్నూలులలో 3 వైద్య హబ్‌లు.. గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, కడప, కాకినాడ, అనంతపురంలో 6 క్యాన్సర్ కేర్ సెంటర్లు ఏర్పాటు దిశగా అడుగులు.
వైద్య రంగంలో కేవలం సంస్కరణపై ఈ 55 నెలల్లో శ్రీ వైయస్.జగన్ ప్రభుత్వం చేసిన, చేస్తున్న మొత్తం వ్యయం దాదాపు. రూ.32,279 కోట్లు.