పరిశ్రమల స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అధికారులతోపాటు డైరెక్టర్లు అంతా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్య తరహా ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఎంఈడిసీ) ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. ఏపీ ఎంఎస్ఎంఈడిసీ సమీక్ష సమావేశం సోమవారం ముత్యాలంపాడులోని కార్యాలయంలో జరిగింది. ధీనికి సీఈవో ప్రవీణ్ కుమార్ ఆన్లైన్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. వీటి పరిశీలన కొరకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. కార్పొరేషన్ పరిధిలో ఉద్యోగుల కొరత ఉందనే విషయాన్ని అధికారులు ఛైర్మన్ దృష్టికి తీసుకురావటంతో ప్రభుత్వానికి నివేదిక తయారు చేయాలని పేర్కొన్నారు.
బ్యాంకులు ద్వారా రాయితీతో కూడిన చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుకు ప్రతి జిల్లాల్లో అవగాహన సధస్సులు నిర్వహించాలని చెప్పారు. అనంతరం సమావేశ అజెండాలోని అంశాలను కులంకుశంగా పరిశీలించి అధికారులు, డైరెక్టర్లతో చర్చించి ఆమోదించారు. ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ విజయవంతం అవ్వటంతో అంధరికి ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ ప్రత్యేక అభినందించి సమ్మిట్ గిఫ్ట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈడీ బి. గోపాలకృష్ణ, ఎస్.ఈడి.అనిల్ కుమార్, ఏడీ ఎం.శ్రీనివాస రెడ్డి ఏపీ ఎంఎస్ఎంఈడిసీ ఆయా జిల్లాల డైరెక్టర్లు పాల్గొన్నారు