అమరావతి, 12.04.2023
వైఎస్సార్ ఈబీసీ నేస్తం
రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ. 658.60 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేడు (12.04.2023) ప్రకాశం జిల్లా మార్కాపురంలో బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్న సీఎం శ్రీ వైఎస్ జగన్
వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుండి 60 ఏళ్ళలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు (ఈబీసీ) ఏటా రూ. 15,000 చొప్పున అదే అక్కచెల్లెమ్మలకు 3 ఏళ్ళలో మొత్తం రూ. 45,000 ఆర్ధిక సాయం చేస్తూ వారు సొంత వ్యాపారాలు చేసుకుని వారి కాళ్ళ మీద వారు నిలబడేట్టుగా తోడ్పాటు అందిస్తున్న శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం
ఇప్పటికే మేనిఫెస్టోలో చెప్పిన 98.44 శాతం హామీలు నెరవేర్చడంతో పాటు, మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు మంచి జరగాలని, వారి కుటుంబాలు బాగుండాలని, వారికి తోడుగా ఉండాలని శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న కానుక – వైఎస్సార్ ఈబీసీ నేస్తం
నేడు అందిస్తున్న రూ. 658.60 కోట్లతో కలిపి శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా అందించిన మొత్తం సాయం రూ. 1,257.04 కోట్లు. ఒక్కో అక్కచెల్లెమ్మకు ఇప్పటివరకు అందించిన సాయం రూ. 30,000.
వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు గత 46 నెలల్లో శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన లబ్ధి రూ. 2,25,991.94 కోట్లు (డీబీటీ మరియు నాన్ డీబీటీ)
అక్కచెల్లెమ్మలకు ఉద్యోగ, రాజకీయ సాధికారత
వలంటీర్ ఉద్యోగాలు 2.65 లక్షల మందికి ఇస్తే వీరిలో 1.33 లక్షల మంది మహిళలే, 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో సైతం 51 శాతం మహిళలకే
రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టుల్లో ఏకంగా చట్టం చేసి మరీ 50 శాతం మహిళలకే కేటాయింపు, నామినేటెడ్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌లుగా 51 శాతం మహిళలకే, డైరెక్టర్, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్‌పర్సన్, రాజకీయ నియామకాల్లో 50 శాతంపైగా పదవులు అక్కచెల్లెమ్మలకే
శాసనమండలిలో తొలిసారిగా డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మహిళకు అవకాశం, కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు అవకాశం
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, వార్డు మెంబర్, మున్సిపల్ చైర్‌పర్సన్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవుల్లో 50–60 శాతం పైగా మహిళలకే
అమ్మ కడుపులోని బిడ్డ నుండి అవ్వల వరకు, అక్కచెల్లెమ్మలకు అన్ని దశల్లోనూ అండగా నిలిచి ఆదుకుంటున్న శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం
గర్భవతులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కొరకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా సంపూర్ణ పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం పంపిణీ
మన బడి నాడు నేడు ద్వారా కౌమార బాలికల ఆత్మగౌరవం నిలబెట్టేలా పాఠశాలల్లో ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు రూపురేఖలు మార్చిన ప్రభుత్వ బడులు
స్వేచ్ఛ పథకం ద్వారా కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్ కిన్స్ పంపిణీ
మహిళల భద్రత కోసం దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులు
వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫా ద్వారా ఆర్ధిక సాయం
అక్కచెల్లెమ్మల పేరు మీదే ఇళ్ళపట్టాలు, ఇళ్ళ రిజిస్ట్రేషన్లు
జగనన్న అమ్మ ఒడి ద్వారా ఆర్ధిక సాయం
వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నావడ్డీ, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ పెన్షన్ కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా అక్కచెల్లెమ్మలకు, మహిళలకు అండగా నిలుస్తున్న శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం.
11.04.2023
Amaravati
YSR EBC NESTAM BY CM YS. JAGANMOHAN REDDY
Across the state, 4,39,068 poor sisters belonging to Reddy, Kamma, Arya Vaishya, Brahmin, Kshatriya, Velama and other OC social groups have been given Rs. 658.60 Crore financial assistance will be directly deposited in their accounts today (12.04.2023) at Markapuram of Prakasam District by pressing a button, CM Shri YS Jagan
Through YSR EBC Nestham, the poor elder sisters (EBC) of Reddy, Kamma, Arya Vaishya, Brahmin, Kshatriya, Velama and other OC communities in the age group of 45 to 60 years are given Rs. 15,000 each to the same elder sisters in 3 years, a total of Rs. 45,000 by providing financial assistance to them so that they can start their own businesses and stand on their own feet.
In addition to fulfilling the 98.44 percent promises already mentioned in the manifesto, even if it is not mentioned in the manifesto, the gift of Shri YS Jagan’s government is that every poor sister should do well, their families should be good and they should be with them – YSR ABC Network
Today offering Rs. 658.60 crores, the total assistance given by YSR ABC since the government came to power till now is Rs. 1,257.04 crores. So far the assistance given to each elder sister is Rs. 30,000.
The benefit provided by Shri YS Jagan government to Akkachellemma in the last 46 months through various schemes is Rs. 2,25,991.94 crores (DBT and Non-DBT)
Employment and political empowerment for older sisters
Volunteer jobs are given to 2.65 lakh people out of which 1.33 lakh are women and 1.34 lakh village and ward secretariat jobs are also 51 percent for women.
50 percent allocation for women in nominated posts and contracts in the state, 51 percent for nominated corporation chairpersons, director, market yard committee chairperson, more than 50 percent of political appointments for older sisters.
For the first time in the legislative council, a woman has the opportunity to be the deputy chairperson, and in the cabinet, women from SC and ST social groups have the opportunity to be the deputy chief minister and home minister.
More than 50-60 percent of Zilla Parishad Chairperson, Vice Chairperson, Municipal Corporation Mayor, Deputy Mayor, Ward Member, Municipal Chairperson, Sarpanch, MPTC, MPP, ZPTC posts are held by women.
The government of Shri YS Jagan is standing by and supporting all the stages from the child in the mother’s womb to the grandmothers and elder sisters.
Distribution of nutritious food with complete nutritional value through YSR Sampurna Posha for health protection of pregnant women, infants and children
Mana Badi Nadu Today government schools that have changed their appearance with the construction of special toilets in schools to maintain the self-esteem of adolescent girls.
Distribution of free sanitary napkins to teenage girls through the Freedom Scheme
Disha App for Women’s Safety, Women Police at Disha Police Stations, Village and Ward Secretariats
Financial assistance by YSR Kalyanamastu and YSR Shaditofa
The house titles and house registrations are in your sister’s name
Financial help from Jagananna Amma Odi
YSR Asara, YSR Sunnavaddy, YSR Cheyuta, YSR Kapu Nestham, YSR ABC Nestham, YSR Pension Kanuka, Jagananna Vidya Deevena, Jagananna Dormiya Diwena, the government of Shri YS Jagan is standing by the sisters and women.