ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
గుంటూరు, మార్చి 17 : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు మార్చి 18వ తేదిన మంగళగిరిలో పర్యటించనున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా , పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ మంగళవారం మంగళగిరిలో ఏర్పాట్లు పరిశీలించారు. “దివ్యాంగ శక్తి” దివ్యాంగులకు ఉచిత బస్ సౌకర్యం ప్రారంభించి, వారితో కలసి మంగళగిరి నుండి ఉండవల్లి వరకు ప్రయాణించే అవకాశాలు, అందుకు తగిన ఏర్పాట్లు తనిఖీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ ఎం సామ్రాజ్యం, అదనపు ఎస్పీ జి.వి. రమణ మూర్తి, ఎం.టి.ఎం.సి మున్సిపల్ కమిషనర్ అలీం భాషా, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.














































