పేదలకు మంచి జరుగుతుంటే చూడలేని శాడిస్టు చంద్రబాబు
కొనకనమిట్ల సభలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి
పేదల వ్యతిరేకులను ఓడించి సంక్షేమాన్ని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా
పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి
ఈ ఎన్నికలు రాబోయే మీ ఐదేళ్ల భవిష్యత్ నిర్ణయిస్తాయి
మీ బిడ్డ ఎప్పుడూ పేదల పక్షమే
జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు..బాబుకు వేస్తే ముగింపు
చంద్రబాబు దారి ఎప్పుడూ అడ్డదారే
చంద్రబాబు పేరు గుర్తుకొస్తే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, దగా, మోసం, అబద్ధాలు, కుట్రలు
చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్‌తో ఫిర్యాదు చేయించాడు
అవ్వాతాతలకు వితంతు అక్క, చెల్లెలకు, పేదవారికి ఫించన్లు ఇంటికి పోకుండా అడ్డుకున్నాడు
వాలంటీర్లతో ఫించన్లు ఇంటికెళ్లడం నేరమని ఫిర్యాదు చేయించాడు
ఈ ఎన్నికలు పేదలు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు
వాలంటీర్లు చిక్కటి చిరునవ్వుతో నెల ఒకటో తారీఖున ఫించన్లు తెచ్చిచ్చారు
వెయ్యి రూపాలయ కోసం రోజుల తరబడి నిలుచున్నా ఫించన్లు రాలేదు
వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి
అవ్వా తాతలను చంపిన దిక్కుమాలిన హంతకుడు చంద్రబాబు
ఎస్సీ,ఎస్టీ,బీసీలను కించపరుస్తూ మాట్లాడిన చంద్రబాబు షాడిస్టు
పేదలకు నగదు అందిస్తే ఏపీ శ్రీలంక అవుతుందన్న బాబు షాడిస్టు కాక ఇంకేంటి
14 ఏళ్లు సీఎంగా చేసినా ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ గుర్తుకు రాని చంద్రబాబు మనకు ప్రత్యర్థి
గ్రామగ్రామాన రైతు భరోసా కేంద్రాలంటే మీ జగన్.. మీ బిడ్డ
గ్రామగ్రామానా ఫ్యామిలీ డాక్టర్ అంటే మీ జగన్.. మీ బిడ్డ
అవ్వాతాతలకు ఇంటికే వచ్చిన రూ.3 వేల పెన్షన్ అంటే మీ జగన్.. మీ బిడ్డ
ఇంటింటికి వాలంటీర్ సేవలంటే మీ జగన్..మీ బిడ్డ
వంద సంవత్సరాల తర్వాత భూముల రీ సర్వే చేయిస్తున్నది మీ జగన్..మీ బిడ్డ
58 నెలల కాలంలో 80 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఎస్సీ,ఎస్టీ,బీసీ అక్కచెల్లెమ్మలకే దక్కాయి
నామినేటెడ్ పోస్టుల్లోనూ ఎస్సీ,ఎస్టీ,బీసీలకు న్యాయం చేశాం
రాష్ట్రంలో 4 సీ పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి
ఎయిర్‌పోర్టుల నిర్మాణం వేగంగా జరగుతోంది
కొత్త మెడికల్ కాలేజీలు శరవేగంగా నిర్మిస్తున్నాం
మేనిఫెస్టోలో నూటికి 90 శాతం హామీలు నెరవేర్చాం
స్కీములన్నీ గ్రామంలో కళ్లెదుటే కనిపిస్తున్నాయి
ఈ కార్యక్రమాలన్నీ మీ బిడ్డ ఎలా చేశాడు..చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు
స్కీములన్నీ చూస్తుంటే చంద్రబాబుకు ఐదు జెలుసిల్ ట్యాబ్లెట్లు వేసుకున్నా కడుపుమంట తగ్గట్లేదు
ఇందుకే మన జెండా తలెత్తుకోని ఎగురుతూ ఉంది
వాళ్ల జెండా 4 జెండాలతో జత కట్టినా కింద పడుతోంది
రాష్ట్ర భవిష్యత్తును కాపాడటానికి మీరు సిద్ధమేనా
175కు 175 ఎమ్మెల్యే..25కు25 ఎంపీ సీట్లు గెలిపించేందుకు సిద్ధమేనా
మన గుర్తు ఫ్యాను.. గుర్తుంచుకుని ఓటేయండి
ప్రకాశం జిల్లా: పేదలకు మంచి జరుగుతుంటే చూడలేని శాడిస్టు చంద్రబాబు అంటూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు.. నిమ్మగడ్డ రమేష్‌తో ఈసీకి ఫిర్యాదు చేయించి పెన్షన్లను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు దారి అడ్డదారి.. పేదల భవిష్యత్‌ను అడ్డుకునేందుకు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి. ప్రజల ఎజెండాతో మనం.. జెండాలు కట్టి వాళ్లు.. జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. ప్రజలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు’’ అంటూ సీఎం వైయస్ జగన్ దుయ్యబట్టారు. మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా కొనకనమిట్ల సభ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు.
ఇది చంద్రబాబు మార్క్ రాజకీయం..
‘‘వెన్నుపోట్లు, దగా, మోసం, అబద్దాలు, కుట్రలు చంద్రబాబు మార్క్ రాజకీయం. ఇంటింటికి అందుతున్న సంక్షేమాన్ని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా?. మన అడుగులు ముందుకా.. వెనక్కా అని తేల్చే ఎన్నికలివి. చంద్రబాబుకు ఓటేస్తే జగన్ తెచ్చిన పథకాలకు ముగింపే. చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ పాతాళంలో ఉంటాయి’’ అని సీఎం జగన్ ధ్వజమెత్తారు.
అవ్వాతాతలను చంపుతున్న నరహంతకుడు చంద్రబాబు
‘‘56 నెలలుగా అందుకున్న పెన్షన్లను అర్ధాంతరంగా నిలిపివేయించాడు. ఆదివారమైనా, సెలవురోజైనా వాలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్లు ఇచ్చేవారు. మండే ఎండలో పేదలను నడిరోడ్డుపై నిలబెట్టాడు. అవ్వాతాతలను చంపుతున్న నరహంతకుడు చంద్రబాబు. వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెత్తించింది. అందుకే వాలంటీర్లు లేకుండా చంద్రబాబు కుట్ర. తన రాజకీయం కోసం పేదల్ని చంపే చంద్రబాబు శాడిస్ట్ కాక ఇంకేంటి?. పేదలకు మంచి జరుగుతుంటే చూడలేని వాడే శాడిస్టు’’ అంటూ చంద్రబాబుపై సీఎం జగన్ నిప్పులు చెరిగారు.
చంద్రబాబులో తగ్గని కడుపుమంట..
అవ్వాతాతలను చంపిన చంద్రబాబును శాడిస్టు అనాలి. దళితులను అవమానించని వాడిని శాడిస్టు అనాలా? వద్దా?. మన ప్రభుత్వంలో మంచి జరుగుతోందని గీతాంజలి చెప్పడమే ఆమె చేసిన పాపం. తన మనుషులతో సోషల్‌మీడియాలో గీతాంజలిని వేధించి చంపారు. 20 జెలొసిల్ ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గని కడుపుమంట చంద్రబాబులో కనిపిస్తోంది. అసూయ, కుళ్లు, కడుపు మంటతో చంద్రబాబు బాధపడుతున్నాడు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకువస్తుందా?. మహిళల సాధికారితకు పెద్దపీట వేశాం. ఆక్వారైతులకు రూపాయిన్నరకే విద్యుత్ అందిచాం. వందేళ్ల తర్వాత భూముల్ని రీ సర్వే చేయిస్తున్నాం’’ సీఎం జగన్ వివరించారు.
చంద్రబాబు చరిత్ర ఏంటో అందరికీ తెలుసు..
ప్రతీ ఇంటికీ మంచి కోసం మనం అధికారాన్ని ఉపయోగించాం. మేం చేసిన పనులన్నీ కళ్ల ముందు కనిపిస్తున్నాయి. చంద్రబాబు మాత్రం దోచుకోవడం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేశారు. చంద్రబాబు చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. జన్మభూమి కమిటీలతో పేదలను ఇబ్బంది పెట్టారు. 2014లో ఈ ముగ్గురే కూటమిగా ఏర్పడ్డారు. ముఖ్యమైన హామీలు అంటూ చంద్రబాబు ఇంటింటికి కరపత్రాలు పంపించారు. 2014లో ఈ మూడు పార్టీలు ఏం హామీలిచ్చాయో అందరికి తెలుసు. పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామన్నారు.. చేశారా?. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.. నెలకు రూ.2వేలు ఇచ్చారా?’’ అంటూ సీఎం జగన్ నిలదీశారు.
మీ జగన్ తొలిసారి ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కేవలం 58 నెలలు. ప్రజలు ఒక్కసారి మీ బిడ్డను ఆశీర్వదిస్తేనే ఈ 58 నెలల పరిపాలన తర్వాత అదే ప్రజల ముందు మీ బిడ్డ నిలబడి, మీ జగన్, మీ బిడ్డ ఏం చెబుతున్నాడంటే… ఇంటింటికీ మంచి చేస్తూ ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా చేశాడు అని మీ బిడ్డ గొప్పగా ఈరోజు మీ ముందు నిలబడి చెప్పగలుగుతున్నాడు.
మీ బిడ్డ మీ ఆశీర్వాదం కోరుతున్నాడు
మీ బిడ్డ ఈరోజు మీ అందరి ముందూ గొప్పగా నిలబడుతూ ఏకంగా మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథం, ఎన్నికలప్పుడు మనం ఏవైతే హామీలిస్తామో.. ఎన్నికలు అయిపోయిన తర్వాత అవి చెత్తబుట్టలో కాదు వేయాల్సింది. ఆ ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్ గా, బైబిల్ గా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చి మీ బిడ్డ మళ్లీ మీ ముందుకు వచ్చి ఇదిగో మేనిఫెస్టో ఇదిగో 99 శాతం హామీలు నెరవేర్చిన మీ బిడ్డ అని మళ్లీ మీ అందరి ఎదుట నిలబడి ఆశీస్సులు కోరుతున్నాడు.
ఇంటింటికీ కూడా పౌర సేవలు డోర్ డెలివరీ చేయిస్తున్నాడు. అది పెన్షన్ కావచ్చు, రేషన్ కావచ్చు,లేదా వివిధ పథకాలు కావచ్చు, లేదా బర్త్ సర్టిఫికెట్, కులధృవీకరణ సర్టిఫికెట్ కావచ్చు.. ఏదైనా కూడా మీ బిడ్డ.. మీ ఇంటి వద్దకే వచ్చే పౌర సేవలను ఇంటింటికీ పంపిస్తున్నాడు.
అక్కచెల్లెమ్మల సాధికారత అంటే ఇదీ
మీ జగన్ ఓ లంచాలు లేని, వివక్ష లేని వ్యవస్థ తీసుకొచ్చాడు. ఎక్కడా ఎవరూ లంచాలు అడగడం లేదు.ఎక్కడా ఎవరూ వివక్ష చూపించడం లేదు. మీ జగన్ కు గత ఎన్నికల్లో ఓటు వేయిన వారైనా సరే అర్హత ఉంటే చాలు వారికి కూడా మంచి చేసే కార్యక్రమం జరుగుతున్నది కేవలం మీ బిడ్డ హయాంలోనే. ఓ లంచాలు లేని, ఓ వివక్ష లేని వ్యవస్థ తీసుకొచ్చాడు మీ జగన్. గ్రామాల్లో మన స్కూళ్లను మార్చాడు మీ జగన్, గ్రామాల్లో మన హాస్పటళ్లను, గ్రామాల్లో మన వ్యవసాయం మార్చాడు. సామాజిక న్యాయానికి అర్థం చెప్పాడు మీ జగన్. అవ్వాతాతల సంక్షేమం, అక్కచెల్లెమ్మల సాధికారత అంటే ఇదీ అని చేసి చూపించాడు మీ జగన్, మీ బిడ్డ అని ఈ సందర్భంగా గర్వంగా చెబుతున్నాను.
మరి 14 ఏళ్లు చంద్రబాబు నాయుడుగారు ముఖ్యమంత్రిగా చేశారు కదా.. మరి జగన్ చేసిన దాంట్లో, మీ బిడ్డ చేసిన దాంట్లో కనీసం 10 శాతం అయినా కూడా నేను చేశాను అని ఇదే చంద్రబాబునాయుడు గారు గుండెల మీద చేయి వేసుకుని ధైర్యంగా నిబద్ధతో చెప్పగలడా అని అడుగుతున్నాను.
గ్రామాన్నే మార్చే వ్యవస్ధ.
జగన్ ఒకవైపున సిద్ధం సభలు పెట్టి ఏ గ్రామానికైనా కూడా 7 వ్యవస్థలు. ఓ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రం ఆర్బీకే వ్యవస్థ, విలేజ్ క్లినిక్ వ్యవస్థ, ఇంగ్లీషు మీడియం, నాడునేడుతో మారిన మన గవర్నమెంట్ బడులు, ప్రతి గ్రామంలో ఓ మహిళా పోలీస్, ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లో ఓ దిశ యాప్, అదే గ్రామంలో డిజిటల్ లైబ్రరీ, ఓ లంచాలు లేని, వివక్ష లేని పాలనతో గ్రామాన్నే మార్చిన వ్యవస్థ తీసుకొచ్చానని మీ బిడ్డ ధైర్యంగా చెబుతున్నాడు.
ఏ గ్రామాన్ని తీసుకొన్నా…
నేను అడుగుతున్నాను, ఏ గ్రామమైనా తీసుకోండి. కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా మీ ఇష్టం. ఏ గ్రామమైనా తీసుకోండి. ఆ గ్రామంలో ఇవాళ మనం చెబుతున్న ప్రతి మాటా కూడా కళ్ల ఎదుటే కనిపిస్తోంది. అదే గ్రామంలో ఒక సచివాలయ వ్యవస్థ, ఇంటికే వచ్చే వాలంటీర్ వ్యవస్థ, ఆర్బీకే, విలేజ్ క్లినిక్, మారిన ఇంగ్లీషు మీడియం స్కూలు, మహిళా పోలీస్, ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లో ఓ దిశ యాప్, గతంలో మాదిరిగా కాకుండా ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఏ గ్రామాన్ని తీసుకున్నా నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకే అందజేస్తున్న అదే గ్రామానికి చెందిన ఓ వాలంటీర్ చెల్లెమ్మలు, తమ్ముళ్లు.. వీరందరికీ పైన మీ బిడ్డ జగన్ ముఖ్యమంత్రిగా మంచి చేస్తూ కనిపిస్తున్నాడు.
ప్రతి ఇంటికీ మంచి చేశాం కాబట్టేఅందుకే మీ జగన్ ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. రైతులకు ఇవి చేశాను, అక్కచెల్లెమ్మలకు ఇవి చేశాను, అవ్వాతాతలకు ఇవి చేశాను, చిన్నారులకు ఇవి చేశాను, పెద్ద చదువుల కోసం ఇవి చేశాను, వైద్యం కోసం ఇవి చేశాను, యువత కోసం ఇవి చేశానంటూ మొత్తం కుటుంబానికి ఏం చేశాను, ప్రతి గడపకూ ఏమి చేశాను అని పదే పదే వివరిస్తున్నాడు మీ జగన్, మీ బిడ్డ. ధైర్యంగా చేశాం కాబట్టే, నిబద్ధతతో చేశాం కాబట్టే, ప్రతి ఇంటికీ మంచి చేశాం కాబట్టే మీ బిడ్డ ఇలా ధైర్యంగా మీ ముందు నిల్చుని చెప్పగలుగుతున్నాడు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని గట్టిగా మీ బిడ్డ అడగగలుగుతున్నాడు. మీ బిడ్డ ప్రతి చోటా కూడా చెబుతున్నాడు. చేసిందే చెబుతున్నాడు. పేదల భవిష్యత్ కోసం ఈ మంచి కొనసాగాల్సిన అవసరం గురించి మీ బిడ్డ ప్రతి సిద్ధం సభలోనూ చెబుతున్నాడు.
మరో 5 ఏళ్లు ఈ మంచి కొనసాగాలంటే..
ఈరోజు మంచి జరిగింది. ఇదే మంచి మరో 5 సంవత్సరాల పాటు మళ్లీ కొనసాగాలంటే జరుగుతున్న ఈ మంచిని మనం కాపాడుకోవాలి అంటే మీలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎన్నికల్లో మీ ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కోరుతున్నాను. మీరు వేసే ఈ ఓటు వచ్చే 5 ఏళ్లలో మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాబట్టి ప్రతి ఇంటా కూడా ప్రతి ఒక్కరూ కూడా నేను అడుగుతున్నా, నేను చెబుతున్నా, మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ మీ ఇళ్లకు వెళ్లండి. మీరంతా మీ ఇంట్లో ఉన్న అక్కచెల్లెమ్మలతో, ఇల్లాలితో, అవ్వాతాతలతో, చిన్న బిడ్డలు, పిల్లలతో కూడా మాట్లాడండి. చిన్న పిల్లలకు ఓటు లేదని వాళ్లతో మాట్లాడకుండా పోవద్దు. చిన్న పిల్లతో కూడా మాట్లాడండి. చర్చించండి. ఎవరి వల్ల మేలు జరిగింది? ఎవరు ఉంటే మన కుటుంబాలు బాగుపడతాయన్న విషయాన్ని లోతుగా ఆలోచన చేయమని కోరుతున్నాను.
ఒక్కసారి 2014 ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దామా?
2014లో చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురు.. ఇంటింటికీ పంపించిన పాంప్లెట్ ఇది. గుర్తుందా ఈ పాంప్లెట్. ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. చంద్రబాబు 2014లో ముఖ్యమైన హామీలు అంటూ ప్రతి ఇంటికీ పంపించాడు ఈ పాంప్లెట్. ఇందులో మోడీగారి ఫొటో ఉంది, దత్తపుత్రుడి ఫొటో, చంద్రబాబు నాయుడు ఫొటో ఉంది. కింద చంద్రబాబు నాయుడు సంతకం కూడా ఉంది. ప్రతి టెలివిజ్ లోనూ వాళ్ల ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, టీవీ5లో అడ్వటైజ్ మెంట్లు ఊదరగొడుతూ అడ్వటైజ్ మెంట్లు ఇచ్చారు. ముఖ్యమైన హామీలంటే ఏం రాశారో తెలుసా? చెప్పమంటారా?
చంద్రబాబు విఫలహామీలు….
రైతులకు రుణ మాఫీపైమొదటి సంతకం చేస్తానన్నాడు. రూ.87,612 కోట్ల రుణ మాఫీ చేశాడా? రెండో ముఖ్యమైన హామీ.. పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. మరి రూ.14,205 కోట్లు.. కనీసం ఒక్క రూపాయి అయినా ఆ పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రుణాల మాఫీ చేశాడా? అని మిమ్మల్నందరినీ అడుగుతున్నాను. మూడో ముఖ్యమైన హామీ.. ఆడ బిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకు డిపాజిట్ చేస్తామన్నాడు. మీకు ఆడబిడ్డలుపుట్టారు కదా.. 2014–19 మధ్యలో. మీ పక్కన చుట్టుపక్కల వాళ్లకైనా పుట్టారు కదా.. కనీసం ఒక్కరికైనా.. రూ.25 వేలు కథ దేవుడెరుగు. కనీసం ఒక్క రూపాయి అయినా వేశాడా? అని అడుగుతున్నాను.
నాలుగో ముఖ్యమైన హామీ..
ఇంటింటికీ ఓ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికీ రూ.2 వేల నిరుద్యోగభృతి అన్నాడు. 5 ఏళ్లు అంటే 60 నెలల్లో 2 వేల చొప్పున రూ.1.20 లక్షలు. ఇచ్చాడా? మరో ముఖ్యమైన హామీ.. అర్హలులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. కనీసం ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని అడుగుతున్నాను. రూ.10వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. చేశాడా? మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తానన్నాడు. చేశాడా? ప్రతి నగరంలోనూ ఓ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మీ మార్కాపురంలో ఏమన్నా కనిపిస్తోందా?
మరి నేను అడుగుతున్నాను. మరి 2014లో ఇదే ముగ్గురు కూటమిగా ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి, ప్రతి ఇంటికీ ఆ పాంప్లెట్ పంపించి ముఖ్యమైన హామీలు అంటూ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చాడా? అని మిమ్మల్నందరినీ అడుగుతున్నా. పోనీ ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చారా? అని అడుగుతున్నాను. మరి నేను ఒక్కటే మిమ్మల్నందరినీ అడుగుతున్నాను. మరి ఇదే కూటమి మళ్లీ ఇప్పుడు ఇదే చంద్రబాబు, ఇదే మోడీగారు, ఇదే దత్తపుత్రుడు.. ఇదే ముగ్గురి ఫొటోలతో మళ్లీ ఇవాళ చంద్రబాబు నాయుడు సంతకం పెట్టి కొత్త మేనిఫెస్టోతో రంగురంగుల హామీలతో మేనిఫెస్టో అంటున్నాడు. ప్రతి ఇంటికీ బెంజ్ కారు కొనిస్తామంటున్నాడు. నమ్ముతారా? ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తానంటాడు. నమ్ముతారా? సూపర్ సిక్స్ అంటున్నాడు. సూపర్ సెవెన్ అంటున్నాడు. నమ్ముతారా?
బాబును నమ్మితే పులి– బంగారు కడియం కథే
చంద్రబాబునాయుడును నమ్మితే మాత్రం బంగారు కడియం, పులి కథే గుర్తుపెట్టుకోండి. ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలతో రాష్ట్ర పేదల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధంలో మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతున్నాను. మీలో ప్రతి ఒక్కరూ ఒక స్టార్ క్యాంపెయినర్ గా ప్రతి పేదవాడి ఇంటికీ వెళ్లి నిజాలు చెప్పి వారిని కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మార్చడానికి మీరంతా కూడా సిద్ధమేనా? అని అడుగుతున్నాను. మరి సిద్ధమే అయితే, వారి చీకటి యుద్ధాన్ని, వారి సోషల్ మీడియా, ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబులోంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. అందులో లైట్ బటన్ నొక్కండి. ఆన్ చేయండి. ఆన్ చేసి పేదల భవిష్యత్తు కోసం యుద్ధం చేసేందుకు మేమంతా కూడా సిద్ధమే అని గట్టిగా చెప్పండి.
విశ్వసనీయతకు– వంఛనకు మధ్య జరుగుతున్న యుద్ధం.
ఇది విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధం. ఈ యుద్ధంలో వంచకుల్ని, వెన్నుపోటుదారులను ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? అని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికీ వెళ్లి, వాలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన బడులు, మన పిల్లలు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, హాస్పటళ్లు బాగుపడాలన్నా, ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాను గుర్తుమీద రెండు బటన్లు నొక్కాలి.
175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు తగ్గడానికి వీలే లేదు. సిద్ధమేనా? అని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్లి ఆలోచన చేయమని కోరుతున్నా. మనం వేసే ఓటు రాబోయే 5 సంవత్సరాల మన తలరాతలు ఎలా ఉంటాయన్నది నిర్దేశిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలు చేసి, ఎవరి వల్ల మంచి జరిగింది, ఏ ప్రభుత్వం కొనసాగితే మంచి జరుగుతుందన్న ఆలోచనతో ప్రతి అడుగూ వేయండని కోరుతున్నాను.
మన అభ్యర్ధులను పరిచయం చేస్తున్నా – ఆశీర్వదించండి
ఈరోజు మీ అందరికీ కూడా మన ఎంపీ అభ్యర్థులను, మన ఎమ్మెల్యే అభ్యర్థులను పరిచయం చేస్తున్నాను.
మీ అందరి చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు మన ఎంపీ అభ్యర్థుల మీద, ఎమ్మెల్యే అభ్యర్థుల మీద ఉంచవలసిందిగా కోరుతున్నాను. నా ముందు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిల్చుని ఉన్నాడు. మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా తాను నిల్చోబోతున్నాడు. మంచి వాడు సౌమ్యుడు. అన్నిటికన్నా ముఖ్యం ఏమిటంటే నాకు అత్యంత సన్నిహితుడు కూడా. మీ ప్రాంతానికి మంచి చేస్తాడు. మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నాయి. భాస్కర్‌ను గొప్ప మెజార్టీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరినీ కోరుతున్నాను.
మార్కాపురం అసెంబ్లీ నుంచి అన్నా రాంబాబు
ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి
ఎర్రగొండపాలెం నుంచి చంద్ర
దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
కనిగిరి నుంచి మీలో ఒకడు, అతి సామాన్యుడు నారాయణయాదవ్
కొండేపి నుంచి ఆదిమూలపు సురేష్
గిద్దలూరు నుంచి నాగార్జున రెడ్డి
ఇంకా చీకటి పూర్తిగాపడలేదు కాబట్టి ఒక్కసారి అంతదాకా వచ్చి మీ అందరికీ మళ్లీ నమస్కారం పెట్టి మళ్లీ వెనక్కి వచ్చేస్తా. మన గుర్తు ఇది. అద్దాలు పెట్టుకున్న అవ్వా మన గుర్తు ఇది. తాతా మన గుర్తు ఇదీ. ఫ్యాను గుర్తు మన గుర్తు. ఎవరైనా అక్కడో ఇక్కడో మర్చిపోయి ఉంటే మాత్రం గుర్తుపెట్టుకోండి. మన భవిష్యత్తు మార్చేది ఈ ఫ్యానే అని గుర్తుపెట్టుకోండి. అని సీఎం వైయస్.జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.