మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధికి కేంద్ర ప్రభుత్వం కృషి
— కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా
మచిలీపట్నం
మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానిమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసికెళ్లి పరిష్కరిస్తామని, జీవనోపాధి మెరుగుపర్చడానికి కృషి చేస్తామని కేంద్ర మత్స్యకార, పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా హామీ ఇచ్చారు.
సాగర్ పరిక్రమ – ప్రోగ్రాం ఫేజ్ – 10 లో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలదిండి ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న హార్బర్ నిర్మాణ ప్రాంతానికి మంగళవారం సాయంత్రం ఆయన చేరుకొన్నారు.దశలవారీగా అభివృద్ధి చెందుతున్న ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పురోగతిని ఆయన పరిశీలించారు. స్థానిక మత్స్యకారులు ఘన స్వాగతం పలికారు. హార్బర్ ప్రాంగణ ఆవరణలో మత్స్యకారులతో కేంద్ర మంత్రి ముఖాముఖి నిర్వహించారు.
తొలుత ఆయన పిఎమ్‌ఎమ్‌ఎస్‌వై పథకం కింద ఇద్దరు ఎస్సీ లబ్దిదారులకు, ఒక ఎస్టీ లబ్ధిదారునికి పంపిణీ చేయబడిన 4 చక్రాల మూడు నంబర్లు (2 లైవ్ ఫిష్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ , ఒక ఇన్సులేటెడ్ వెహికల్)
పిఎమ్‌ఎమ్‌ఎస్‌వై పథకం కింద 3-వీలర్ (అనుకూలీకరించిన ఆటో) ఒకటి లబ్ధిదారునికి పంపిణీ చేశారు.అలాగే పిఎమ్‌ఎమ్‌ఎస్‌వై కింద ఫిష్ ఆంధ్రా మినీ ఫిష్ రిటైల్ అవుట్‌లెట్లను గ్రౌండింగ్ చేయడానికి మంజూరు ప్రక్రియలు నలుగురు లబ్ధిదారులకు కేంద్ర మంత్రి పంపిణీ చేశారు
అనంతరం కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా మాట్లాడుతూ.. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి గల అవకాశాలను అంచనా వేసేందుకు తమిళనాడు, గోవా, మహారాష్ట్రలో పర్యటించి 2024 జనవరి 1 వ తేదీ ,నుండి 6వ తేదీ వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో,ఎం ఎం ఎస్ వై స్కీమ్‌లపై ప్రచారంతో పాటు రైతుల మాదిరిగానే మత్స్యకారులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు అందిస్తున్నట్లు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలు డిల్లీలో కాకుండా మీ ముందు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని మత్స్యకారులను ఉద్దేశించి అన్నారు. మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం మత్స్యకారులకు రాయితీ రుణాల చెక్కులు అందజేశారు అనంతరం నూతన సంవత్సర కేక్ కట్ చేసి అందరికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 50 శాతం సబ్సిడీతో కూడిన రెండు ఐచర్ వాహనాలను, ఫిషాంద్ర ఒక మొబైల్ ఆటో, రెండు మోపెడ్లను లబ్ధిదారులకు అందించడం జరిగింది. 30 లక్షల రూపాయల విలువచేసే కిసాన్ క్రెడిట్ కార్డులను మత్స్యకారులకు అందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానిమంత్రి నరేంద్ర మోడీ ద్వారా మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించిందని 20 వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉందని, రానున్న కాలంలో దానిని రెండు రెట్లు పెంచే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ సూచనప్రాయంగా అంగీకరించారని తెలిపారు.మత్స్యకారుల సంక్షేమానికి అవసరమైన పథకాలను, సహాయ సహకారాలు ప్రధాని నరేంద్ర మోడీ నిరంతరం దేశవ్యాప్తంగా ఉన్న ఎనిమిది కోట్ల మత్స్యకారులకు అందించడానికి సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు. మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు
ఆక్వా రంగంలో సమస్యలపై కేంద్ర మంత్రికి గాదె నారాయణ, విష్ణు, అవనిగడ్డ రవీంద్రబాబు తదితరులు తమ ఇబ్బందులు తెలిపారు. ఆక్వా పరిశ్రమలో మేతల ధరలు తగ్గించాలని కేంద్ర మంత్రిని అభ్యర్ధించారు.
మత్స్యకారుల్లో విద్యావంతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, సముద్రంలో బోట్లు మునిగితే బీమా చెల్లించాలని, బోట్లు, వలలు, ఇంజన్ కు వేర్వేరుగా సబ్సిడీ ఇవ్వాలని, కేసీసీ రుణాన్ని రూ.1.60 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలని మత్స్యకారులు కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా దంపతులు, రాజ్యసభ సబ్యడు బీదా మస్తాన్ రావు, ఏపీ మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు, జాయింట్ సెక్రటరీ నీతూ ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ సంజయ్ పాండే, జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు, కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, డాక్టర్ ఎల్ ఎన్ మూర్తి, ఎఫ్ డి సి ఆంటోనీ జేవియర్, వి. శ్రీనివాసరావు, డైరెక్టర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిషరీస్, డిప్యూటీ కన్సల్టెంట్, ఫిషరీస్ విభాగం,డాక్టర్ సంజయ్ పాండే , కృష్ణాజిల్లా జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఎన్. శ్రీనివాస రావు,ఆర్డీవో ఎం.వాణి , తదితరులతో పాటు తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు, ఎఫ్‌ఎఫ్‌పిఓలు, ఆక్వా రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు