మీడియా సిబ్బందిపై దాడిని ఖండించిన : ఎన్.యు.జె(ఐ).
విధి నిర్వహణలో ఉన్న మీడియా సిబ్బందిపై ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేయడానికి నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్టు, ఇండియా ( ఎన్.యు.జె(ఐ) ), జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ కాశపు. వి. వి. వి. సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. మీడియా అనేది ప్రపంచంలో జరిగే విషయాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయడానికి ప్రయత్నిస్తుందని దానికి అన్ని వర్గాల వారు సహకరించాల్సిందేనని కోరారు. మీడియా ప్రతినిధుల పై దాడి, వాహనాలను ధ్వంసం చేయడం సరికాదని దీనిని ఎన్.యు.జె(ఐ) తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని జాతీయ స్థాయి నాయకులకు తెలియజేసి వారి సూచనలకు అనుగుణంగా తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
మీడియాలో పనిచేసే వారికి ఇప్పటికే అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించడానికి తీసుకోవలసిన చర్యలు గురించి జాజ్పూర్, ఒరిస్సా రాష్ట్రంలో జరిగిన అఖిలభారత జాతీయ జర్నలిస్టుల సమావేశంలో చర్చించినట్లు ఆయన తెలిపారు.