ANDHRA UNIVERSITY VC HIDING…
ఏయూకు ముఖం చాటేసిన వీసీ!
గత ఐదేళ్లుగా ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరించిన ఉప కులపతి పీవీజీడీ ప్రసాదరెడ్డి మూడు రోజుల నుంచి క్యాంప్‌సలో కనిపించడం లేదు.
వైసీపీ హయాంలో ఇష్టానుసారం వ్యవహరించారనే ఆరోపణలు
విశాఖపట్నం: గత ఐదేళ్లుగా ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరించిన ఉప కులపతి పీవీజీడీ ప్రసాదరెడ్డి మూడు రోజుల నుంచి క్యాంప్‌సలో కనిపించడం లేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి ఆయన ఎక్కడికి వెళ్లారో సమాచారం లేదు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రసాదరెడ్డి నియంత తరహాలో పాలన సాగించారన్న విమర్శలు ఉన్నాయి. ఒకప్పుడు విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీసీని కలిసి తమ సమస్యలు చెప్పుకునేవారు. కానీ, ఈ ఐదేళ్లలో ఎప్పుడూ ఆయన ఎప్పుడూ అలాంటి అవకాశం ఇవ్వలేదు. పైపె చ్చు మూడంచెల భద్రతను ఏర్పాటు చేసి విద్యార్థుల ను పరిపాలనా భవనం దరిదాపుల్లోకి కూడా రాకుం డా చేశారు. అదే సమయంలో ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు, నియామకా లు వివాదాస్పదమయ్యాయి. అస్మదీయులకు అడ్డగోలుగా పదవులు కట్టబెట్టారు. ఐదేళ్లుగా వర్సిటీలో ప్రసాదరెడ్డి తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలపై టీడీపీ, జనసేన నాయకులు పోరాడారు. కూటమి అధికారంలోకి వస్తే ప్రసాదరెడ్డి అరాచకాలపై దృష్టిసారిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం కూటమి అధికారంలోకి రావడంతో ప్రసాదరెడ్డిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందోనన్న చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఎక్కడున్నారంటూ పలువురు ఆరా తీయగా… మూడు రోజుల నుంచి వర్సిటీకి రావడం లేదని తెలిసింది. ఒక దశలో ఆయన రాజీనామా చేశారన్న ప్రచారం కూడా సాగింది. కానీ, ప్రసాదరెడ్డి రాజీనామా చేయలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖం చెల్లకే వర్సిటీకి రావడం లేదని పేర్కొంటున్నారు.
విదేశాలకు వెళ్లిపోయిన ఓఎ్‌సడీ
ఏయూలో రిజిస్ర్టార్‌గా పనిచేసి, ఆ తర్వాత ఓఎ్‌సడీగా నియమితులైన ప్రొఫెసర్ కృష్ణమోహన్ కూడా ప్రస్తుతం సెలవులో ఉన్నారు. ఎన్నికల అనంతరం ఆయన రెండు నెలలు సెలవు పెట్టి విదేశాలకు వెళ్లినట్టు చెబుతున్నారు. ఆయన ఎప్పుడొస్తారన్న దానిపై స్పష్టత లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీలో చక్రం తిప్పిన ఇద్దరు అధికారులు… కూటమి గెలవగానే కనిపించకపోవడం గమనార్హం. ఇదిలావుండగా వర్సిటీలో ఐదేళ్లుగా వీసీ నియంతృత్వ పోకడలతో ఇబ్బందిపడిన విద్యార్థి సంఘాల నేతలు కూటమి విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. థియేటర్ ఆర్ట్స్ డిపార్టుమెంట్‌లో పనిచేసే ఒక ఉద్యోగి ఏయూలోని గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలను శుద్ధి చేసి.. వర్సిటీకి పట్టిన శని విరగడైందంటూ ఆనందం వ్యక్తంచేశారు.