ఓటర్లను మభ్యపెట్టడం దుర్మార్గం : జేడి లక్ష్మినారాయణ
పోస్టల్ బ్యాలెట్ ఓటర్ ల యొక్క పూర్తి వివరాలు ఒక అధికార పార్టీకి చెందిన అభ్యర్థులకు మాత్రమే ఆర్ వో అందించడం దుర్మార్గపు చర్య అని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని స్పష్టంగా అర్థం అవుతుందని జై భారత్ పార్టీ అధ్యక్షులు విశాఖ ఉత్తర నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ అన్నారు
మిగిలిన పార్టీల అభ్యర్థులకు అదే వివరాలను ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని స్వయంగా అభ్యర్థి అడిగినా కూడా పూర్తి సమాచారం ఇస్తామని చెప్పి అనేక కారణాలు చెప్పి సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏయూ క్యాంపస్ లో పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు బార్లు తీరారు అదే సమయంలో పోలింగ్ బూత్ ను సందర్శించిన జెడి అక్కడి ఓటర్లు కలిసి కొన్ని వాస్తవాలు తెలుసుకొని షాక్ కు గురయ్యారు అక్కడ ఓటర్లు సమాచారం ప్రకారం 7670 807307 అనే నెంబర్ నుండి ఫోన్ చేసి మీరు ఓటు కేకే రాజు వేశారా? ఒకవేళ వేయకపోతే కేకే రాజుకి ఓటు వేయాలని ఓటర్లు మభ్య పెడుతున్నారని వారు వాపోతున్నారు కొంతమంది ఓటర్లు ఓటు వేసేటప్పుడు ఫోటో తీసి అధికార పార్టీ కార్యకర్తలకు పంపగా ఆ ఓటర్ కు ఫోన్ ద్వారా డబ్బులు ట్రాన్ఫెర్ చేస్తున్నారని తెలియ వచ్చింది. ఈ విషయాలపై జేడీ లక్ష్మీనారాయణ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా కు ఫిర్యాదు చేయడం జరిగింది.
ఆయన వెంటనే తగు చర్యలు తీసుకుంటూ పోలింగ్ బూత్ లోకి సెల్ ఫోన్ అనుమతిని నిరాకరించారు ఎట్టి పరిస్థితులలోనూ ఓటర్లు సెల్ ఫోన్ ను పోలింగ్ బూత్ లోకి తీసుకు రానివ్వకూడదని ఆదేశాలు ఇచ్చారు. ఈ విధంగా అధికార పార్టీ ప్రభుత్వ అధికారులు సహాయంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు జేడీ ఆరోపించారు.