మచిలీపట్నం
వచ్చే 2024 25 సంవత్సరానికి రూ.226.32 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ను ఆమోదిస్తూ తీర్మానం చేశామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక పేర్కొన్నారు
శనివారం నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జడ్పీ చైర్ పర్సన్ వుప్పాల హారిక ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం కృష్ణాజిల్లా కలెక్టర్ పి రాజబాబు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తో కలిసి నిర్వహించారు.
ఈ సమావేశం అనంతరం జడ్పీ చైర్ పర్సన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో జిల్లాను ప్రగతి పథంలో అగ్ర భాగాన నిలిపేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు.
సభ్యులు లేవనెత్తిన సమస్యలు అంశాలపై అధికారులు సానుకూలంగా స్పందించి వివరాలు అందించారన్నారు.
ప్రతి ఒక్క అంశం పైన జడ్పిటిసి ఎంపీపీ సభ్యులు కూలంకషంగా చర్చించారన్నారు.
గత సమావేశంలో లేవనెత్తిన అంశాల పైన కూడా తీసుకున్న చర్యల నివేదికను అందజేయడం జరిగిందన్నారు.
జిల్లా ప్రజా పరిషత్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగము, గ్రామీణ నీటి సరఫరా విభాగములతో కలిపి 2024 25 సవరణ బడ్జెట్ అంచనా ప్రారంభ నిలువ రు.211.99,99,440 లు కాగా ఆదాయం అంచనా రు.957,36,88,573లు కాగా ఖర్చు అంచనా రు.9,43,04,90,529 లు కాగా ముగింపు నిలువ రు.226,31, 97,484 లుగా అంచనా వేశామన్నారు.
అలాగే 2023 24 సవరణ బడ్జెట్ అంచనా ప్రారంభ నిలువ రు.201,93,09,486లు కాగా, ఆదాయపు అంచనా రు.842,04,41,196 లు కాగా ఖర్చు అంచనా రు.831,97,51,242 లు కాగా ముగింపు నిలువ రు.211,99,99,440లుగా అంచనా వేసి సభ ఆమోదించిందన్నారు.
అలాగే 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా 2023 24 సంవత్సరంలో విడుదలైన అంచనాల మొత్తం 40 కోట్ల రూపాయలకు గాను రు.37.80,44,589లు వ్యయం చేశామన్నారు.
2024 25 సంవత్సరంలో విడుదలైన అంచనాల మొత్తము 45 కోట్ల రూపాయల గాను వ్యయం అంచనా 45 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు చెప్పారు.
జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు మంచి మార్కులు సాధించాలనే లక్ష్యంతో 18 లక్షల రూపాయల వ్యయంతో స్టడీ మెటీరియల్ అందజేశామన్నారు
అలాగే పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక ట్యూషన్లు నిర్వహించే సమయంలో వారికి 13 లక్షల రూపాయలు తో స్నాక్స్ సౌకర్యం కల్పించామన్నారు.
కొందరు ఉద్యోగులు అనారోగ్యంతో మృతి చెందగా 44 మంది వారి వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టడం జరిగిందన్నారు.
జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించుటకు జడ్పిటిసిలు ఎంపీపీలు తమ వంతు సహకారం అందించాలన్నారు.
జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం సేకరణ సజావుగా జరుగుతుందన్నారు. రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సంబంధిత రైతు భరోసా కేంద్రాల ద్వారా సమీపంలో ఉన్న మిల్లులకు కేటాయించడం జరుగుతుందన్నారు.
జిల్లాలో గోనె సంచులకు ఏలాంటి కొరత లేదని 40వేల సంచులను ఆర్.బి.కెలలో సిద్ధంగా అందుబాటులో ఉంచామన్నారు. ఆర్ బికేలలో ఉన్న ప్రమాణాల అనుసరించి ధాన్యం ధరలు నిర్ణయించడం జరుగుతుందని, ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే బయట ఎక్కువ ధర లభిస్తుంటే బయటనే రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవచ్చన్నారు.
అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ అవనిగడ్డ జాతీయ రహదారి పక్కన మురికి నీటి కాలువ పూడి పోయిందని దాని బాగు చేయించాలన్నారు. మోపిదేవి పాత కరకట్ట పక్కన నివసిస్తున్న వారికి పొసెషన్ ధ్రువీకరణ పత్రాలు లేదా పట్టాలు ఇవ్వాలని కోరారు.
ఈ విషయమై సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్ పర్సన్ సూచించారు.
ఈ సమావేశంలో కృష్ణాజిల్లా సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు జిల్లాల కు చెందిన వివిధ శాఖల జిల్లా అధికారులు, జడ్పిటిసిలు, ఎంపీపీలు పాల్గొన్నారు.