రాజధాని సెంటు స్థలాల్లో ప్రమాదానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి
గాయపడ్డ కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలి
వైసిపి నేతలైన కాంట్రాక్టర్లు బిల్లులు చేసుకుంటూ పారిశుధ్య కార్మికులచే పనులు చేయించడం గర్హనీయం
మండుటెండల్లో తగు రక్షణ ఏర్పాట్లు చేయకపోవడం శోచనీయం
రాజధాని నిడమర్రు లేఔట్ లో టెంట్లు కూలి 30 మందికి గాయాలు, పదిమందికి తీవ్ర గాయాలు
ఎయిమ్స్ లో కొనసాగుతున్న వైద్యం
గాయపడ్డ కార్మికులను పరామర్శించిన సిపిఎం, సిఐటియు నేతలు
కార్మికులకు సహాయం అందించాలని విజ్ఞప్తి చేసిన నేతలు
#ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిఐటియు నేతలు ఎం.రవి, భాగ్యరాజు తదితరులు మాట్లాడుతూ……
🐚 రాష్ట్ర ప్రభుత్వం హడావుడి పనుల ఫలితంగా ఈ దుర్ఘటన జరిగింది.
🐚 లే ఔట్లు ఏర్పాట్లలో వైసిపి నేతలే కాంట్రాక్టర్లుగా చలామణి అవుతున్నారు, బిల్లులు చేయించుకుంటున్నారు, కానీ సి ఆర్ డి ఏ లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, అసెంబ్లీ, సచివాలయంలోని కాంట్రాక్టు ఉద్యోగులను గత 15 రోజుల నుండి మండు టెండల్లో ఈ పనులు చేపిస్తున్నారు
🐚 రాజధాని గ్రామాల్లో పారిశుధ్య పనులు దెబ్బతిన్నాయి.
🐚 ఆదివారం సెలవులు కూడా ఇవ్వకుండా పనులు చేపిస్తున్నారు.
🐚 గత 15 రోజులుగా వడదెబ్బ తగిలి అనేకమంది అస్వస్థతకు గురయ్యారు, అయినా ప్రభుత్వం, అధికారులు కార్మికుల బాగోగులు పట్టించుకోలేదు.
🐚 ఈరోజు తీవ్ర గాలులు, వర్షానికి కార్మికుల భోజనం చేస్తున్న సమయంలోనే ఐరన్ రాడ్లతో ఉన్న టెంట్ కూలిపోయింది.
🐚 కార్మికుల బురదలో కూరుకు పోయారు, భయభ్రాంతులకు గురయ్యారు.
🐚 తీవ్రమైన తొక్కిసలాట జరిగింది, కార్మికులకు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
🐚 వర్షంలో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని చెల్లా చెదురు అయ్యారు.
🐚 ఐరన్ రాడ్లు పడి పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి ,వీరిలో అత్యధిక మంది మహిళ కార్మికులు.
🐚 హడావిడిగా జరిగిన పనులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
🐚 వారి విధులకు సంబంధం లేని పనులను అప్పగించడం నిబంధనలకు విరుద్ధం.
🐚 ఎటువంటి రక్షణ ఏర్పాట్లు చేయలేదు, ఎండల్లో కనీసం మజ్జిగ కూడా అందించలేదు.
🐚 అనారోగ్యంతో ఉన్నవారికి సెలవులు ఇవ్వలేదు, కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడారు.
🐚 ప్రభుత్వం, సి ఆర్ డి ఏ తక్షణమే స్పందించి గాయపడ్డ కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలి, పూర్తిస్థాయిలో వైద్యం అందించాలి.
🐚 కోలుకునే వరకు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలి.
🐚 వారి విధులకు సంబంధం లేని ఈ పనుల నుండి కార్మికులను మినహాయించాలి.
🐚 అదనంగా పని చేయించుకున్న కార్మికులందరికీ అదనపు వేతనాలు మంజూరు చేయాలి.
🐚 కార్మికులకు అదనపు సెలవులు ఇవ్వాలి.
🐚 ఈ వేసవిలో తగు రక్షణ ఏర్పాట్లు చేయాలి.
🐚 నిబంధనల విరుద్ధంగా చేయించిన పనులు, ప్రమాదంపై తగు విచారణ జరిపించాలి.
# గాయపడ్డ కార్మికులను పరామర్శించిన నేతలు సిఆర్డిఎ ఉన్నతాధికారులకు కార్మికుల ఇబ్బందులను వివరించారు, కార్మికుల గోడు తెలుసుకున్నారు.
తోటి కార్మికులకు ,కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు
పరామర్శించిన వారిలో కెవిపిఎస్ నాయకులు క్రాంతి కుమార్, రైతు నాయకులు నాగేశ్వరరావు తదితరులు కూడా ఉన్నారు.