అమరావతి:
విఐటి-ఏపి విశ్వవిద్యాలయంలో విటోపియా 2026 వార్షిక క్రీడా పోటీల బహుమతి ప్రదానోత్సవాలు కార్యక్రమం
ది . 22 ఫిబ్రవరి 2026 నాడు విఐటి-ఏపి విశ్వవిద్యాలయంలో ఘనంగా ముగిసిన విటోపియా 2026 వార్షిక క్రీడా పోటీల బహుమతి ప్రధానోత్సవం . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అర్జున అవార్డు గ్రహీత జ్యోతి యర్రాజీ (అథ్లెటిక్స్) హాజరయ్యారు. వివిధ క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచినా విద్యార్థులకు ముఖ్య అతిధి చేతులమీదుగా బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఉదయం జరిగిన 5 కిలోమీటర్ల మారథాన్ లో పాల్గొని విద్యార్థులను ఉత్తేజపరిచారు.
ఈ సందర్బంగా ముఖ్య అతిధి మాట్లాడుతూ విఐటి-ఎపి విశ్వవిద్యాలయంలో జరుగుతున్నా విటోపియా 2026 లో విజేతలుగా నిలిచినా విద్యార్థులను అభినందించారు. జీవితంలో విజయం సాధించాలంటే ఎదురైనా సవాళ్ళను, సమస్యలను ఎదుర్కొంటు ముందునకు సాగాలని తెలియచేసారు. ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చి ఆసియాన్ గేమ్స్ లో స్వర్ణం సాధించే స్థాయికి ఎదిగే క్రమంలో అనేక ఒడిడుకులు ఎదురైనా మనో ధైర్యంతో నిలబడ్డానని తెలియచేసారు.
విఐటి-ఏపి విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ I/c డా|| పి. అరుల్మోళివర్మన్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పటు క్రీడా మరియు సాంసృతిక కార్యక్రమాలలో పాలుపంచుకోవడం అవసరమని తెలియచేసారు. ముఖ్య అతిధి జ్యోతి యర్రాజీని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు తమ జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమిస్తూ లక్ష్యాలను సాధించాలని తెలియచేసారు.
సాయంత్రం జరిగిన ప్రో-షోలో మోహన భోగరాజు, అబ్దుల్ వాహబ్ బ్యాండ్, డి జె నోటోరియస్ సంగీత విభావరీలు అందరిని అలరించాయి.
ఈ కార్యక్రమంలో విఐటి-ఏపి విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ డా || జగదీష్ చంద్ర ముదిగంటి , డా|| ఎస్. గోపికృష్ణన్ (విటోపియా కన్వీనర్), డా|| ఖాదీర్ పాషా (స్టూడెంట్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్), విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రత్యేక ఆహ్వానితులు, అతిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

















































