ఎపి సచివాలయంలో ఎపి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ మొదటి అడ్వయిజరీ సమావేశం
అమరావతి,6 నవంబరు: ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ మొదటి అడ్వయిజరీ సమావేశం గురువారం ఎపి సచివాలయంలో ప్రారంభమైంది.ఈసమావేశంలో ఎపిలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి తీసుకుంటున్న చర్యలు, ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చిస్తున్నారు.
ఈసమావేశంలో నీతి ఆయోగ్ సభ్యులు మరియు అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డా.వికె సారస్వత్, కమిటీ కోచైర్మన్ మరియు సిఎస్ కె.విజయానంద్,నెరెడ్ క్యాప్ విసి అండ్ ఎండి డా.కమలాకర్ బాబు, మెంబర్ సెక్రటరి ప్రొ.డి.నారాయణ రావు,సభ్యులు డా.ఆర్కె మల్హోత్రా తదితరులు పాల్గొన్నారు.












































