Date :03-10-2023
అమరావతి: భారతదేశలోనే మొట్టమొదటి సారిగా కృత్రిమ మేధస్సును ఉపయోగించి హార్మోనీ అన్లీషెడ్ అనే సంగీత కచేరీ నిర్వహించిన విఐటి -ఏపి విశ్వవిద్యాలయం
ది.30.09.2023 తేదిన విఐటి -ఏపి విశ్వవిద్యాలయంలో నల్ (ఇన్ఫోసెక్) చాప్టర్, సెంటర్ అఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రోబోటిక్స్ మరియు ఇన్నోవేషన్,ఇంక్యూబేషన్ మరియి ఎంట్రప్రెన్యూర్ సెల్ సహకారంతో “హార్మోనీ అన్‌లీష్డ్”ను అనే భారతదేశపు మొట్టమొదటి కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) ఉపయోగించి సంగీత కచేరీ నిర్వహించారు. సంగీత ప్రపంచంలో సాంకేతికత మరియు ఆవిష్కరణల శక్తికి ఈ సంఘటన నిజమైన నిదర్శనం.
ఈ కార్యక్రమంలో ఆర్జిత్ సింగ్ పాడిన సోను నిగమ్ “కల్ హో నా హో” మరియు సిద్ శ్రీరామ్ పాడిన యువన్ శంకర్ రాజా “నీ యడలో నాకు” , శ్రేయా ఘోషల్ పాడటానికి శ్వేతా మోహన్ చేసిన “వా వాతి” అందరిని ఆకట్టుకున్నాయి.
నల్ చాప్టర్ యొక్క ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ డా|| సిబి చక్రవర్తి , సాంకేతికత మరియు సృజనాత్మకత యొక్క అద్భుతమైన కలయికతో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ తో రూపొందించిన మ్యూజిక్ వీడియోలను ప్రదర్శించారు. ఈ కార్యక్రామాన్ని ముందుండి నడిపించిన నల్ చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీ వెంకట్ హర్ష రాయసం, వైస్ ప్రెసిడెంట్ కె. ప్రణవ్ సాయి మరియు సాయి సంజయ్ ల సహకారానికి నల్ చాప్టర్ యొక్క ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ డా|| సిబి చక్రవర్తి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| ఎస్.వి.కోటా రెడ్డి, రిజిస్ట్రార్ డా || జగదీష్ ముదిగంటి, డా.అమీత్ చవాన్ (డైరెక్టర్, ఐఐఈసి) , డా|| హరి సీత, డా|| సిబి చక్రవర్తి ఎస్, ప్రొ|| శామ్యూల్ జాన్సన్ మరియు డా|| సుధాకర్ ఇలంగో, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా|| జగదీష్ చంద్ర తోపాటు హార్మోనీ అన్లీషెడ్ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ సంగీత కచేరీలో పాల్గొన్న విద్యార్థులు మరియు అధ్యాపకులు