Unanimous election of Chandrababu as Legislative Assembly Party Leader
Chandrababu: శాసనసభ పక్షనేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక
టీడీఎల్పీ నేతగా అధినేత చంద్రబాబు పేరును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు ప్రతిపాదించారు. అనంతరం శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్, పురందేశ్వరి, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
అమరావతి: టీడీఎల్పీ నేతగా అధినేత చంద్రబాబు పేరును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. అనంతరం శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్, పురందేశ్వరి, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు.. గవర్నర్‌కు కూటమి పక్షాల నేతలు లేఖ ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు.. సాయంత్రానికల్లా చంద్రబాబును గవర్నర్ ఆహ్వానించనున్నారు.