రాష్ట్రంలో ప్రజా మద్దతు లేని టిడిపి నాయకుల- తాటాకు చప్పుళ్ళకు భయపడే వారెవరూ లేరు
-అంకంరెడ్డి నారాయణమూర్తి
ప్రజా మద్దతు లేని టిడిపి తాటాకు చప్పుళ్లకు, ప్రజలెవరికీ వినపడని మోతలు మోగించిన పచ్చ బ్యాచ్లూదే బాకాలకు , భయపడే వారెవరూ లేరని, అవినీతి కేసుల్లో అరెస్టయి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు మద్దతు తెలపడం అంటే అవినీతిని ప్రోత్సహించడమేనని, ఎంత గట్టిగా గంటలు, కంచాలు కొట్టి మోగించాలని టిడిపి చూసినా, ప్రజలెవరూ మద్దతు లేని తమ నిరసనను తెలియజేశారని, రానున్న ఎన్నికల్లో టిడిపికి బుద్ధి చెబుతారంటూ, నవరత్నాలు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి, గంటలు, కంచాలు మోగించి మద్దతు తెలపాలని, టిడిపి ఇచ్చిన పిలుపును సామాన్య ప్రజలెవరూ పట్టించుకోలేదన్నారు. అక్కడక్కడ టిడిపి నేతలు, కార్యకర్తలు అత్యుత్సాహంతో రోడ్లపై వాహనాల హారన్లు మోగిస్తూ, హడావుడి చేయడంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. భువనేశ్వరి, బ్రాహ్మణి, లోకేష్, కొందరు పార్టీ నేతలు మాత్రం పెద్దపెద్ద డప్పులు వాయించిన, ప్రజలెవరూ పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు అరెస్టుపై నిర్వహించిన రాష్ట్ర బంద్ తో సహా, ఏ కార్యక్రమానికి మొదటి నుంచి ప్రజల్లో స్పందన కనిపించడం లేదన్నారు. ఒకవైపు వరుస అవినీతి కేసులతో చంద్రబాబు విశ్వరూపం బయటపడుతుండటం, కోర్టుల్లో సైతం వారి వాదనలు వీగివటంతో, వాస్తవాలు తెలిసిపోతున్నాయని, ప్రజల నుండి కనీస సానుభూతి కూడా రావడం లేదన్నారు.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పిలుపుమేరకు కాపులు కంచాలు కొట్టినందుకు ఆనాటి ప్రభుత్వం, కాపు నేతలపై కేసులు పెట్టి, జైల్లోకి పంపారని, ఇప్పుడు స్కిల్ స్కామ్ లో జైల్లో ఉన్న చంద్రబాబుకు మద్దతుగా, కంచాలు కొట్టి మోత మోగిస్తూ, శబ్ద కాలుష్యానికి పాల్పడుతూ, ప్రజల్ని అసౌకర్యానికి గురి చేసినందుకు టిడిపి నాయకులపై కేసులు పెట్టాలన్నారు. ఆనాడు కంచాలు మోగించిన కాపులకు ఒక న్యాయం, ఈనాడు టిడిపి నాయకులకు మరో న్యాయమా అంటూ నారాయణమూర్తి ప్రశ్నించారు. కంచాలు మోగించినంత మాత్రాన, వెన్నతిని మూతి తుడిచేసుకున్నచిన్నపాటి వెన్నదొంగలా బాలకృష్ణులైపోరని, అవినీతికి సిగ్గుపడాల్సింది పోయి, సింగారించుకొని ఇళ్లల్లో నుండి బయటకు వచ్చి, నీతులు చెప్పటం ఏంటని నారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుండి 2019 వరకు అవినీతి ప్రభుత్వం నడిచిందని – జైల్లో దోమలు మోత” అన్న చందంగా ఆయన పరిస్థితి ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం నాలుగేళ్లలోనే 2.35 లక్షల కోట్ల మేర ప్రజలకు సంక్షేమ పథకాలు కింద అందిస్తే, వివిధ ప్రాజెక్టులు, పథకాల పేర్లతో ప్రజలకేమీ పంచకుండా, చంద్రబాబు రాష్ట్ర ఖజానాతో పాటు, కేంద్ర నిధుల్ని దోచేసినందుకు టిడిపి నేతలను సూటిగా ప్రశ్నించారు.
చంద్రబాబు అరెస్టు అక్రమమైతే, దర్యాప్తు సంస్థలకు, కోర్టులకు సహకరించి, వాటి ముందు తమ నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. అంతేగాని శబ్ద కాలుష్యంతో, ప్రజల్ని భయభ్రాంతులను చేసేలా, అసౌకర్యానికి గురి చేసేలా, కంచాలు, గంటలు కొట్టి మోతలు మోగించడం ఆనందంగా ఉంటే, ఢిల్లీ పోయి కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర మంత్రుల ఆఫీసుల ముందు మోతలు మోగించు కోవాలన్నారు. అంతేగాని ఏపీ ప్రభుత్వం, ప్రజలు మాత్రం టిడిపి ఉడత ఊపులకు, తాటాకు చప్పుళ్ళకు భయపడరని, ఖబడ్దార్ టిడిపి నేతల్లారా… ఖబడ్దార్ ఖబడ్దార్ అంటూ మరోసారి నారాయణమూర్తి ఘాటుగా హెచ్చరించారు.
అంకంరెడ్డి నారాయణమూర్తి
నవరత్నాలు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్