రాష్ట్రంలో ప్రతి గడపకు ప్రతిరోజు రక్షిత మంచినీరు అందించడం జగనన్న లక్ష్యం
లక్షల కోట్ల విలువ చేసి ఆస్తికి యజమానులను చేసే బృహత్తర కార్యక్రమం స్వామిత్వ
-మంత్రి జోగి రమేష్
పెడన (పెనుమల్లి), సెప్టెంబర్ 23
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి జోగి శనివారం పెడన మండలం పెనుమల్లి గ్రామంలో జల జీవన్ మిషన్ పథకం కింద రు.70 లక్షల వ్యయంతో 213 స్వచ్ఛమైన సురక్షితమైన మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసిన పథకాన్ని మంత్రి ప్రారంభోత్సవం గావించారు
అనంతరం పెనుమల్లి సచివాలయం వద్ద వైయస్సార్ జగనన్న శాశ్వత గృహక్కు భూ రక్ష పథకంలో భాగంగా స్వామిత్వ కార్యక్రమం కింద పెడన మండలంలో నేలకొండపల్లి, కొంగంచర్ల (కుమ్మరిగుంట), బంటుమిల్లి మండలం కొర్లపాడు గ్రామాలలో గ్రామకంఠం భూములలో నివసిస్తున్న 611 మందికి ఆస్తి యాజమాన్య ధ్రువపత్రాలు మంత్రి పంపిణీ గావించారు.
ఈ సందర్భంగా పెనుమల్లి గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ జీవన్ మిషన్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి కుళాయిలు అందించాలని జగనన్న సంకల్పించారని అన్నారు. ఇందులో భాగంగా, ఈరోజు పెడన మండలం పెనుమల్లి గ్రామంలో 70 లక్షలతో గ్రామంలో 213 కుళాయిలు ఏర్పాటు చేసి రక్షిత మంచినీటి పథకం ప్రారంభించడం జరిగిందన్నారు.
వైయస్సార్ జగన్ అన్న శాశ్వత భూహక్కు భూ రక్ష పథకం కింద గ్రామాల్లో గ్రామకంఠoలో గల భూములు, ఇళ్లు సర్వే చేసి కొలతలు కొలిచి ఆస్తి యాజమాన్య హక్కులు కల్పించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీ సర్వే చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్రం మొత్తం ప్రతి గ్రామంలో సర్వే చేసి హక్కులేని భూములు, ఇళ్ల యజమానులకు హక్కు పత్రాలు రిజిస్ట్రేషన్ చేసి అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు నేలకొండపల్లి గ్రామ పరిధిలో 262 మందికి, కొంగ oచర్ల గ్రామ పరిధిలో 121, కొర్లపాడు పరిధిలో 228 మొత్తం 611 మందికి ఆస్తి యాజమాన్య హక్కులు అందించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెడన ఎంపీపీ రాజులపాటి వాణి, గూడూరు ఎంపీపీ సంఘ మధుసూదన్ రావు పెడన మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ చారుమతి, పెనుమల్లి సర్పంచ్ రామానాయుడు, ఎంపీడీవో రెడ్డయ్య, తాసిల్దార్ మధుసూదన్ రావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ ఇంచార్జ్ హేమస్రవంతి, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు స్థానిక నాయకులు, వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.