సామాజిక న్యాయ ఛాంపియన్ జగనన్న
మైనార్టీలకు జగనన్న చేసిన మేలు అంతా ఇంతా కాదు – డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా
పేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్న జగనన్న –ఎంపీ నందిగం సురేష్
సంక్షేమ పథకాల సారధి… అభివృద్ధి ప్రదాత సీఎం జగన్ – ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
ప్రజల కష్టనష్టాలు తెలిసిన వ్యక్తి జగనన్న – ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు
దేశంలోనే అత్యధిక పింఛన్ అందిస్తున్న సీఎం జగన్ – ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్
రాయచోటి నియోజక వర్గంలో సామాజిక సాధికారయాత్ర
రాయచోటి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ముఖ్యమ్రంతి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మేలును గుర్తుచేసుకోవడం కోసం ఏర్పాటయిన సామాజిక సాధికార బస్సుయాత్ర విజయవంతమైంది. రాయచోటి నియోజకవర్గం నలుమూలల నుంచి జనం వేలాదిగా తరలి వచ్చారు. సభ అసాంతం అక్కడే ఉండి, నాయకుల ఉపన్యాసాలు విన్నారు. స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభలో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్, కొరుముట్ల శ్రీనివాసులు మాట్లాడారు. జిల్లాలోని కార్పొరేషన్, మునిసిపాలిటీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు పార్టీ నేతలు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా
– సామాజిక సాధికారత అంటే ఒక నినాదంగానే వింటూ వచ్చాం. కానీ మన రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ పార్టీ అధికారంలోకి రాగానే, ముఖ్యమంత్రి జగనన్న సామాజిక సాధికారత ఒక విధానం అని సాధించి చూపారు.
– ఈ రాష్ట్రంలో 70 నుంచి 80 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన గొప్ప నాయకుడు మన జగనన్న.
– వెనుకబాటుకు గురయిన మన బడుగు, బలహీన వర్గాలను నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలతో ఆర్థికంగానూ బలోపేతం చేశారు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి.
–ఈరోజు కేబినెట్‌లో 17మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారు మంత్రులుగా ఉన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రుల్లో నలుగురు ఆయా వర్గాలవారే ఉన్నారు.
– గతంలో మైనార్టీలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఎవరూ లేరు. మైనార్టీల్లో ఒక్కరూ మంత్రిగా లేరు. చంద్రబాబుగారి ఘనత అది.
– ఆయనకు బీసీలన్నా, ఎస్సీలన్నా, ఎస్టీలన్నా, మైనార్టీలన్నా చిన్నచూపు, అలుసు. అందుకే 2019 ఎన్నికల్లో ఆయన్ను ప్రజలు చావుదెబ్బ కొట్టారు.
– 2024లోనూ అదే చెయ్యాలి మనం. ఇచ్చిన హామీల్లో వందశాతం అమలు చేయాలని ముందుకు పోతున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. జగనన్న ప్రభుత్వం.
–ఈరోజున నా ఎస్సీలు, ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలంటూ ..మనలందర్ని అక్కున చేర్చుకున్న మన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడం మనకు అవసరం. మన జీవితాలు బాగుపడాలంటే జగనన్న మళ్లీ రావాలి.
– సిద్ధాంతాలంటూ ఏవీ లేని పార్టీలన్నీ కలిసి, జగనన్నను ముఖ్యమంత్రి పదవి నుంచి దించాలని ఆశపడుతున్నాయి. ప్రజానాయకుడిని ఓడించడం వారి వల్ల కాదు. వారిని మనం ఓడించాలి.
–జగనన్న వెంట కోట్లాదిగా ప్రజలు కదులుతున్నారు. జగనన్న అందించిన సంక్షేమ పథకాలు అన్నీ ఇన్నీ కావు. అవన్నీ ఎలా మరవగలరు ప్రజలు?
–మనం జగనన్నను గెలిపించాలి. మనకోసం..రాష్ట్ర భవిష్యత్తుకోసం మళ్లీ జగనన్నే రావాలి. జగనన్నే కావాలి.
–టీడీపీ, దాని తోక పార్టీలు పెత్తందారీ పార్టీలు. మన వైఎస్సార్‌సీపీ పేదల పార్టీ. పేదల పార్టీనే గెలవాలి. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలి.
– మన బడుగు,బలహీన, మైనార్టీ వర్గాలకు ఎంతో మేలు చేసిన ముఖ్యమంత్రి జగనన్నను గుండెల్లో పెట్టుకుందాం.
ఎంపీ నందిగం సురేష్
–మనపిల్లలు ఈరోజు సంతోషంగా బదులకు వెళుతున్నారంటే, ఇంగ్లీషు మీడియం చదువులు చదువుతున్నారంటే..ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తేవడమే కారణం.
– చదువే పిల్లలు తలరాతలు మారుస్తుందని గట్టిగా నమ్మిన ముఖ్యమంత్రి..ఆ దిశలో వేస్తున్న అడుగులు మామూలివి కావు. మన బడుగు,బలహీన వర్గాల తరతరాల తలరాతలు మార్చడానికే మన కోసం వచ్చిన దార్శనికత నేత జగన్‌మోహన్‌రెడ్డి.
–ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన ముఖ్యమంత్రుల్లో ఏ ఒక్కరూ చేయని విధంగా బడుగు,బలహీనవర్గాలు, మైనార్టీ వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత జగనన్నదే.
–చంద్రబాబు గోతిలో పడ్డవాడి చందం. బాబు గారు పైకి లేచే అవకాశమే లేదు. అందుకే..ఇప్పుడు నేను పైకి లేస్తే మనిషిని కాదంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు.
–నన్ను జైల్లో వేసి నానా ఇబ్బందులు పెట్టారు చంద్రబాబు హయాంలో.
– నాలాంటి వారిని జైల్లో వేసినవాడు చంద్రబాబు అయితే, ఏకంగా ఎంపీని చేసి పార్లమెంటుకు పంపించిన గొప్ప నాయకుడు జగనన్న.
–మీరంతా ఒక్కసారి ఆలోచించండి. ఆయనను గెలిపించుకుంటేనే మన బతుకులు, మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి.
–చంద్రబాబు హయాంలో మోసపోని వ్యక్తి అంటూ ఎవరూ లేరు.
ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
–జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పేదలకు మంచి జరగాలని అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు.
–ఈరోజు సామాజిక సాధికార యాత్ర లక్ష్యం ..ఈ నాలుగున్నరేళ్లలో బడుగు,బలహీన,మైనార్టీ వర్గాలకు జగనన్న వల్ల జరిగిన మేలును తలచుకోవడం. తెలుసుకోవడం.
– మన రాయచోటి నియోజకర్గానికే ఈ నాలుగున్నరేళ్లలో పథకాల కోసం, అభివృద్ధి పనుల కోసం రూ.1289 కోట్ల ప్రయోజనం కలిగించారు ముఖ్యమంత్రి.
– ఒక్క రాయచోటి నియోజకవర్గానికే డీబీటీ ద్వారా రూ.934 కోట్లు, నాన్ డీబీడీ కింద రూ.355 కోట్లు ఖర్చు చేశారు.
ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు
–ముఖ్యమంత్రి జగనన్న కష్టాలు చూశారు. నష్టాలు చూశారు. బాధలు చూశారు. అందుకే ఆయన ముఖ్యమంత్రి కాగానే…ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అవి నేరుగా ప్రజలకు చేరేలా చేశారు.
– ప్రజల కష్టాలు తీర్చడం. బాధలు తీర్చడం, రైతులను నష్టాల నుంచి కాపాడుకోవడమే లక్ష్యంగా జగనన్న పనిచేస్తున్నారు.
–జగనన్న ఓదార్పు యాత్ర చూశాం. పాదయాత్ర చూశాం. ప్రజల కోసం ఎందాకైనా అనే నాయకుడు జగనన్న. ఆయన ఈ నాలుగున్నరేళ్లలో పేదలకు, మహిళలకు చేసిన మేలు అంతా ఇంతా కాదు.
– మహిళల ఆర్థిక సాధికారతకోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది.
ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్
–దాదాపు నలభైఐదు రోజులుగా రాష్ట్రం నలుమూలలా సామాజికసాధికార యాత్ర జరుగుతోంది. స్వాతంత్య్రం వచ్చాక ఈ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు అయ్యారు.
–బడుగు,బలహీన వర్గాలకు అంతో ఇంతో చేశారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు సామాజిక సాధికారత పేరిట రాజ్యాంగ పదవుల్లో కూర్చోపెట్టారు.
–బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు కేబినెట్‌లో పెద్దపీట వేశారు. రాజ్యాంగ పదవుల్లో ఎమ్మెల్యేలుగా, కార్పొరేషన్లలో మేయర్లుగా, మునిసిపల్ చైర్మన్‌లుగా కూర్చోబెట్టారు జగనన్న. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదలకు డీబీటీ ద్వారా దాదాపు రూ.2.4లక్షల కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశారు జగనన్న.
–మన బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలు ఆత్మగౌరవంతో జీవించేలా చేశారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. అనేక సంక్షేమ పథకాలతో మన పేదల బతుకుల్లో వెలుగులు నింపారు ముఖ్యమంత్రి జగనన్న. ఇక ఇప్పుడు దేశంలోని..
– ఏ రాష్ట్రంలో ఇవ్వని అత్యధిక పింఛన్లు అవ్వాతాతలకు అందించబోతున్నారు జగనన్న. ఇక ఆయన అందించే ప్రతి సంక్షేమ పధకం పేదల గడపల దగ్గరకే వస్తోంది. నగదు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతోంది.
– ప్రేమించే మనసు, స్పందించే గుండె ఉన్న ప్రజానాయకుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి.