• అమరావతి
రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష
• రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి రైల్ కనెక్టివిటీ, తెలంగాణా, కర్నాటక, చత్తీస్ ఘడ్ , మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన హింటర్ ల్యాండ్ నుంచి రైల్ రవాణాపై సమీక్షలో చర్చ
• రాయలసీమ ప్రాంతాల నుంచి కోస్తాంధ్రలోని వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీపై సమావేశంలో చర్చ
• విశాఖ, విజయవాడ, గుంతకల్, గుంటూరు, రేణిగుంట తదితర రైల్వే జంక్షన్లలో రద్దీ తగ్గించే అంశంపైనా సమీక్ష
• రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ పెంచడంపై సమావేశంలో చర్చ
• విజయవాడ బైపాస్, భద్రాచలం రోడ్-కొవ్వూరు సహా రాష్ట్రంలో వివిధ కొత్త రైల్వే మార్గాలకు సంబంధించిన ప్రతిపాదనలపైనా సమీక్షించిన ముఖ్యమంత్రి
• సమీక్షకు హాజరైన దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా, దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ల జనరల్ మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులు
• హైదరాబాద్-చెన్నయ్, చెన్నయ్-బెంగళూర్, హైదరాబాద్-బెంగళూరు లైన్లను హై స్పీడ్ రైల్వే కారిడార్లుగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు














































