ప్రజల సంతృప్తి స్థాయిని మరింతగా మెరుగుపరిచేలా రెవెన్యూ సేవలు అందించాలి
గుంటూరు, జనవరి 28:- జిల్లాలో రెవెన్యూ సేవలపై ప్రజల సంతృప్తి స్థాయిని ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మరింతగా మెరుగుపరిచేలా తహసిల్దార్లు, వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లు బాధ్యతగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన రెవెన్యూ అధికారుల వర్క్ షాప్ లో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దీర్ఘకాలికంగా ఉన్న రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కారం కోసం ప్రభుత్వం రెవెన్యూ శాఖలో ఇటీవల అనేక సర్కూలర్స్ జారీ చేసిందన్నారు. నిషేధిత భూముల జాబితాలో ఉన్న కొన్ని రకాల భూములు తొలగింపుకు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ స్థాయి నుంచి ఆర్డీవో, తహసిల్దార్ స్థాయిలోనే దరఖాస్తులు పరిష్కారించటానికి అవకాశం కల్పించారన్నారు. క్షేత్రస్థాయిలోని అధికారులు సక్రమంగా విచారణ ద్వారానే రెవెన్యూ సమస్యలు ఎక్కువ శాతం పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. అందువలన నూతనంగా రెవెన్యూ శాఖలో జారీ చేసిన సర్కులర్ పై అవగాహన కోసం రెవెన్యూ డివిజన్ అధికారి స్థాయి నుంచి, తహసిల్దార్లకు, మండల సర్వేయర్లకు, క్షేత్రస్థాయిలో పనిచేసే విలేజ్ రెవెన్యూ అధికారులకు, గ్రామ సర్వేయర్లకు రెవెన్యూ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నామన్నారు. రెవెన్యూ సేవలు, దరఖాస్తులు సత్వరమే పరిష్కారం కోసం డివిజన్, మండల, గ్రామస్థాయి రెవిన్యూ సర్వే అధికారుల సామర్థ్యాలు పెంపుదలకు ప్రతి నెల రెవెన్యూ వర్క్ షాప్ లలో శిక్షణ నిర్వహించి రెవెన్యూ అంశాలను సమీక్షిస్తామని తెలిపారు. జిల్లాలో రెవిన్యూ అంశాలకు సంబంధించి ఐవీఆర్ఎస్ లో పబ్లిక్ పెర్సెప్షన్ లో ప్రజల పాజిటివ్ ఫీడ్ బ్యాక్ గతం కంటే మెరుగ్గా ఉందని, దీనిని మరింతగా మెరుగుపరచాలన్నారు. రెవెన్యూ సేవలకు సంబంధించిన దరఖాస్తులను ప్రజలను ఇబ్బంది పెట్టకుండా నిర్దేశించిన మార్గదర్శకాలు ప్రకారం సత్వరమే పరిష్కరించాలన్నారు. పిజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ లలో వచ్చిన దరఖాస్తులలో పరిష్కరించే అంశాలను క్షేత్రస్థాయిలో విచారణను సత్వరమే పూర్తి చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. పరిష్కరించలేని అంశాలను పూర్తి వివరాలతో దరఖాస్తు దారులకు వివరించాలన్నారు. రెవిన్యూ సేవలు, దరఖాస్తులు పరిష్కారానికి సంబంధించి వ్యక్తిగత నోటీసులు కచ్చితంగా అందించాలన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా క్షేత్రస్థాయిలోని ఉద్యోగులు పనితీరు , వాస్తవ పరిస్థితులు ప్రజల ఫీడ్ బ్యాక్ ద్వారా తెలుస్తుందని చెప్పారు. దీని ప్రకారం ఉత్తమ పనితీరు కనపరుస్తున్న అధికారులను అభినందిస్తామని తెలిపారు. అదేవిధంగా విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటూ ప్రజలను ఇబ్బంది పెట్టే వారిని గుర్తించి మొదటిసారిగా జిల్లాస్థాయిలో ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. అప్పటికే వారి పనితీరులో మార్పు రాకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విలేజ్ రెవెన్యూ అధికారులకు పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేసే అధికారం లేదని, నిబంధనలకు విరుద్ధంగా పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తే వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో అడంగల్ లో ఇతరుల సుమోటో కరెక్షన్స్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వెంటనే చేపట్టాలన్నారు. మండల స్థాయిలో ప్రతి మంగళవారం తహశీల్దార్లు వీఆర్వోలు, సర్వేయర్లతో సమావేశం నిర్వహించి రెవిన్యూ సేవలు, దరఖాస్తుల పరిష్కారం పై సమీక్ష నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ నిషేధిత భూముల జాబితా తొలగింపుకు సంబంధించిన దరఖాస్తులను మూడు నెలల్లో నూరు శాతం పరిష్కరించాలన్నారు. గ్రామస్థాయి నుంచి అన్ని రెవిన్యూ ఫైళ్లు ఈ ఆఫీస్ ద్వారానే కచ్చితంగా పంపించాలన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి మాట్లాడుతూ ఈ ఆఫీసులో వీళ్లు నమోదుకు మూడు రోజుల్లో మండల పరిధిలోని వీఆర్వోలు, ఆర్ఐలు, డిప్యూటీ తహశీల్దార్ లకు లాగిన్ లు అందించేలా తహశీల్దార్లు చర్యలు తీసుకోవాలన్నారు. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగింపుకు రెవిన్యూ శాఖ జారీచేసిన సర్కులర్స్, మ్యూటేషన్లు, సుమోటో కరెక్షన్స్, తదితర రెవెన్యూ అంశాలకు సంబంధించిన దరఖాస్తులు పరిష్కారంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, తెనాలి సబ్ కలెక్టర్ ఇంచార్జి లక్ష్మీ కుమారి, ఏడి సర్వేయర్ పవన్ కుమార్, ఆర్డీవో శ్రీనివాసులు, ఉదయం జరిగిన వర్క్ షాప్ లో గుంటూరు రెవిన్యూ డివిజన్ పరిధిలోని, మధ్యాహ్నం జరిగిన వర్క్ షాప్ లో తెనాలి రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు, మండల సర్వేయర్లు, వీఆర్వోలు, సర్వేయర్లు పాల్గొన్నారు.















































