పెనమలూరు, జూన్ 24
ఏపీ సి ఆర్ డి ఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ సోమవారం పెనమలూరు మండలం తాడిగడప-ఎనికెపాడు 100 అడుగుల రోడ్డులో చైతన్య మహిళా జూనియర్ కళాశాల సమీపంలో నెల 27వ తేదీన నిర్వహించు స్వర్గీయ రామోజీరావు సంస్మరణ కార్యక్రమం ఏర్పాట్లు కృష్ణ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, కృష్ణ ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, కృష్ణ జిల్లాలో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలసి పరిశీలించారు.
డయాస్ వద్ద రామోజీరావు చిత్రపటం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి, అతిథులు పుష్పాంజలి ఘటించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు.
డయాస్ బ్యాక్ డ్రాప్ డిజిటల్ స్క్రీన్ ఏర్పాటుచేయాలని, రామోజీరావు చిత్రపటం, యానిమేషన్లో పుష్పాంజలి విజువల్స్ ప్రదర్శించాలని సూచించారు.
రామోజీరావు జీవిత విశేషాలు, పత్రికా రంగానికి చేసిన సేవలపై ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్, షార్ట్ ఫిలిం ప్రదర్శన, ముఖ్యమంత్రి ప్రధాన వేదిక వద్దకు చేరుకునే లోగా సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రధాన వేదిక పుష్పమాలలతో అలంకరించాలని, డయాస్ పైన అతిధులకు, ప్రజలకు స్నాక్స్ పంపిణీ చేయాలన్నారు.
ప్రధాన వేదిక వద్ద ముఖ్యమంత్రి కాన్వాయ్ వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు,
ప్రధాన వేదిక ఎదుట గల చైతన్య మహిళా జూనియర్ కళాశాల ఆవరణ, సిద్ధార్థ లేడీస్ హాస్టల్ ఆవరణ, కృష్ణవేణి విద్యాసంస్థల ఆవరణలు వివిఐపిలకు, వి ఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో బస్సులు జనరల్ పబ్లిక్ పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు.
శానిటేషన్ తాగునీటి సరఫరా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రధాన వేదిక వద్ద పార్కింగ్ ప్రదేశాల్లో అవసరమైన లైటింగ్, నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు పవర్ బ్యాక్అప్ ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు.
ప్రధాన వెన్యూ ప్రదేశంలో డయాస్, బ్యారీకేడింగ్ ఆర్ అండ్ బి అధికారులు ఏర్పాటు చేయాలని, వివిఐపీల, పబ్లిక్ గ్యాలరీల, గ్రీన్ రూమ్ ల వద్ద ఇన్చార్జి లను నియమించాలన్నారు.
సి ఆర్ డి ఏ అదనపు కమిషనర్ అలీం బాష , సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ కస్తూరి, ప్రోటోకాల్ అదనపు డైరెక్టర్ వాణి, ఉద్యాన శాఖ డిడి ధర్మజ, కృష్ణాజిల్లాలో వివిధ శాఖల అధికారులు, ఉయ్యూరు ఆర్డిఓ డి రాజు తదితరులు పాల్గొన్నారు.