మంగళగిరిలో వివిధ అభివృద్ధి, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్
మంగళగిరిలో సత్యభామ సిల్క్స్ అండ్ హ్యాండ్ లూమ్స్ షోరూమ్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
మంగళగిరి: మంగళగిరిలో వివిధ అభివృద్ధి, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. మంగళగిరి పట్టణం రాజీవ్ సెంటర్ లో బిట్ర తులసీరామ్, అందె వీరాంజనేయులు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన సత్యభామ సిల్క్స్ అండ్ హ్యాండ్ లూమ్స్ షోరూమ్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కు నిర్వాహకులు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ను లాంఛనంగా ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. చేనేత చీరలను కొనుగోలు చేశారు. అందరితో ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావుతో పాటు పలువురు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







































