ADVERTISEMENT
వ్యవసాయాన్ని పండుగలా మారుస్తాం
గత పాలకుల నిర్లక్ష్యంతోనే జిల్లాలో మురుగు సమస్య
సాగునీటి కాల్వలన్నీ తూడు, మట్టితో నిండిపోయాయి
వీలైనంత త్వరగా సాగునీటి కాల్వల్ని శుభ్రం చేయండి
సాగునీటి రంగ సమస్యలపై కలెక్టర్‌తో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర
ఎడతెరిపి లేని వర్షాల కారణంగా తలెత్తిన వరదలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను రాష్ట్ర గనులు, భూగర్భ & ష్టిఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, వైద్యాధికారులు, మున్సిపల్ సిబ్బందితో ఫోన్లో మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యం, చేతకానితనం కారణంగానే ప్రస్తుతం జిల్లాలో వర్షాల కారణంగా ముంపు తలెత్తింది. వర్షాలకు నీరు పారే అవకాశాలు లేకుండా పోయాయి. గత ఐదేళ్ల కాలంలో ఏ రోజు కూడా ప్రజల సమస్యలపై దృష్టి సారించకుండా దోచుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. గట్లు బలోపేతం చేయాలి. కాలువల్లో తూడు తొలగించాలి. ఎంత వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. గత రెండు రోజుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 21.4మి.మీల వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజుల పాటు వర్షం కొనసాగే అవకాశం ఉంది. ఇదే సమయంలో సాగుకు రైతులు సిద్ధమయ్యారు. వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీకి ఇన్ ఫ్లూ పెరిగిందని, గేట్లు తెరిచిన తర్వాత దిగువ ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అదే సమయంలో వర్షాల కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అధికారులు తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మురుగు కాల్వలు తక్షణమే శుభ్రం చేయాలన్నారు. బ్లీచింగ్ చల్లి వ్యాధుల వ్యాప్తి జరగకుండా చూడాలన్నారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతన్నాయని, వాటి పరిష్కారంపై దృష్టి పెట్టాలని కలెక్టర్, మున్సిపల్ అధికారుల్ని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు
ADVERTISEMENT
ADVERTISEMENT