తుళ్లూరు లోని కేవీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల – పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
తుళ్లూరు:
తుళ్లూరు లోని స్థానిక కేవీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో నేడు 1989-90 సంవత్సరం పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఇందులో 1989-90 వ సంవత్సరం పదవ తరగతి అభ్యసించిన విద్యార్థులు తమకు విద్యను ఉపదేశించిన ఉపాధ్యాయులకు సన్మానించి వారిని శాలువాలు, నూతన వస్త్ర లతో ఘనంగా సత్కరించారు.35 సంవత్సరాల తరువాత ఈ సంవత్సరం ఇలా అందరం కలుసుకోవటం చాలా సంతోషదాయక మని అందరికీ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు, పూర్వ ఉపాధ్యాయులు నేటికీ యుక్త వయస్సు లో ఉండి అందరికీ తెలుగు భాష ప్రాధాన్యత ను వివరించారు.
భవిష్యత్ తరాలకు తెలుగు ప్రాధాన్యత ను సవివరంగా నేటి యువతకు పెదబాలశిక్ష ఖచ్చితంగా కొనుక్కొని ఇంట్లో ఉండాలని తెలుగు ఉపాధ్యాయలు చందలూరు చంద్రశేఖర్ గారు తెలిపారు. హిందీ లో 23 సంవత్సరాల పాటు ఇదే పాఠశాల లో విద్యాబోధన చేసిన ఇందుమతి గారు మాట్లాడుతూ ఈ పాఠశాల, ఈ ఊరి అనుబంధాన్ని గుర్తు చేసుకొని విద్యార్థులు తమ పట్ల నిర్వహించిన ఈ కార్యక్రమం నకు మురిసిపోయారు.
తను ఈ ఊరి ఆడపడుచు గా కూడా అందరికీ సూపరిచుతురాలేనని అభివర్ణించారు.ఇందులో నే అమరావతి జేఏసీ కు ప్రతినిద్యం వహించిన పువ్వాడ సుధాకర్ కూడా ఉండటం తో అందరూ సుధాకర్ ను కూడా ఘనంగా సత్కరించారు.
భవిష్యత్ లో ఈ పాఠశాల పేరు ప్రతిష్టకు, విద్య కు కావాల్సిన ఆవశ్యకతను వివరించారు. అదే విధంగా పాఠశాల ప్రారంభమై 75 వసంతాలు పూర్తవుతున్న తరుణం లో 1986 నుంచి 1990 వరకూ చదివిన విద్యార్థులు ను ఒక ఐక్య కమిటీ గా చేసి తద్వారా 75 వసంతాల నిర్వహణకు అవసరమైన అన్నీ సహాయక చర్యలు చెప్పడతానని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుత్త శ్రీనివాసరావు కు హామీ ఇచ్చారు.