కర్నాటక ఫలితాలు
రేపు రాబోయే ఎన్నికల ఫలితాలు కర్నాటకలో రాజకీయ పార్టీల, నేతల భవితవ్యంతోపాటు వచ్చే ఏడాది దేశ వ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై కూడా ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతంలో సౌమ్యంగా వివాదాలకు దూరంగా ఉండే వారిగా కన్నడిగులకు గతం నుంచి మంచి పేరు ఉంది. ఇక్కడి ప్రజలు విశాల దృక్ఫథంతో ఆలోచిస్తారు.. ఆ కారణంగానే తెలుగు వారితో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం కర్నాటకలో చాలా ప్రాంతాలకు వలస వెళ్లి, అక్కడ ఆర్ధికంగా, రాజకీయంగా బలంగా మారిన పరిస్థితులు గతంలో చూశాం.. గాలి జనార్ధన్ రెడ్డి వంటి వారి రాజకీయ ప్రస్థానం చూస్తే.. ఆయన కర్నాటక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడంలో కన్నడిగులు సహకారం విస్మరించలేనిది.. నేడు సాటి తెలుగు రాష్ట్రం తెలంగాణలోనే ఆంధ్రోళ్లు అనే స్లోగన్ రాజకీయంగా అన్ని పార్టీలు అవసరమైన మేరకు వాడుకుని స్థానికంగా సక్సస్ అయ్యే ప్రయత్నాలు మనం చూస్తున్నాం. ఇదే తరహా ప్రతిఘటనలు కర్నాటకలో గతంలో ఉండి ఉంటే ఇంత పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల ప్రజలు అక్కడికి వలస వెళ్లేవారు కాదు.. ఇప్పటి మాదిరి రాజకీయంగా శాసించే పరిస్థితిలో ఉండేవారు కాదనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం.
శాంతి నుంచి విద్వేషాలకు కేరాప్ అడ్రస్ గా మారుతున్న వైనం
మొదటి నుంచి ఇక్కడి ప్రజలు అత్యంత సామరస్యంగా వ్యవహారించేవారు. సిలికాన్ సిటీ బెంగళూరులో కాస్మో పాలిటన్ కల్చర్ ఉండగా, మిగిలిన గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైతం వివాదాలకు దూరంగా ఉండేవారు.. అయితే రానూరానూ రాష్ట్రమంతా అక్కడి స్థానిక కన్నడ ప్రజల్లో సైతం మార్పు కనిపిస్తోంది. రెండేళ్ల క్రితం బ్యాంకింగ్ ఉద్యోగాల్లో తమ స్థానిక కోటాను ఆంధ్రా వాళ్లు ఉపయోగించుకుంటున్నారంటూ, పరీక్షలు రాయడానికి కర్నాటక వెళ్లిన ఆంధ్రా విద్యార్ధులపై రైల్వే స్టేషన్ లోనే దాడులు జరిగిన వైనాలు ఉన్నాయి.. అంటే కొద్దికొద్దిగా కన్నడిగుల్లో కూడా విద్వేషాలు మొదలవుతున్నాయి. వీటిని అందిపుచ్చుకుంటున్న రాజకీయ పార్టీలు నేడు ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు, హిజాబ్, బజరంగ్ దళ్ బ్యాన్ వంటి కొత్త రాజకీయ క్రీడలు ఆడుతూ ప్రజల్లో మరింత విద్వేషం రెచ్చగొడుతున్న పరిస్థితులను విజ్ఞులు, విద్యావంతులైన కన్నడిగులు గమనిస్తున్నారు.
గత 4 దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పార్టీకి రెండోసారి అధికారం కట్టబెట్టిన పరిస్థితి లేదంటే కన్నడ ప్రజలు ఎంత వివేకవంతులో అర్ధం అవుతుంది. అదే సందర్భంలో ఇప్పటి వరకు బీజేపీకి ఒక్కసారి కూడా కర్ణాటకలో సొంతగా మెజార్టీ సాధించిన పరిస్థితి లేదనే విషయాన్ని గమనించాలి.. కేంద్రంలో ఉన్న బలంతో బలవంతంగా గద్దెనెక్కి బీజేపీ తన పాలనను కొనసాగించింది. కర్ణాటకలో ఉన్న ఆర్ ఎస్ ఎస్ హిందుత్వ భావజాలం కారణంగానే దక్షిణాదిలో ఎక్కడా లేని విధంగా కన్నడనాట బీజేపీ అధికారం చెలాయించగలుగుతుంది. బీజేపీ – గాలి జనార్ధన్ రెడ్డి శకానికి మునుపు కర్ణాటకలో ఎన్నికలు హుందాగా, డబ్బులకు అతీతంగా జరిగేవి. అదే సమయంలో గెలిచిన పార్టీలు, నాయకులపై అవినీతి, స్కామ్ లు వంటివి దేశ స్థాయిలో కన్నడిగుల ప్రతిష్టను అభాసుపాలు చేసిన పరిస్థితులు లేవనే చెప్పాలి.
ఆంధ్రాతో కర్నాటక రాజకీయాలకు సామీప్యత…
ప్రస్తుతం కర్ణాటక ఎన్నికలు గమనిస్తే, ఆంధ్రాలో ఉన్న రాజకీయ పరిస్థితులకు సామీప్యత కనిపిస్తోంది. ఎందుకంటే, కర్ణాటకలో కాంగ్రెస్ మాదిరిగా, రాష్ట్రమంతా, ఒకేస్థాయిలో టీడీపీకి ఓటు బ్యాంక్ ఉంది. ఇక్కడ అధికార వైసీపీకి గ్రేటర్ రాయలసీమలో గంపగుత్తగా ఓటు బ్యాంక్ కేంద్రీకృతమై ఉంది. మిగిలిన కోస్తా, ఉత్తరాంధ్రలో ఒక మోస్తారుపైగా ఓటు బ్యాంక్ కలిగి ఉంది. అదే తరహాలో అక్కడ బీజేపీకి సైతం కొన్ని ప్రాంతాల్లో అధిక ఓటు బ్యాంక్ కేంద్రీకృతమై ఉంది. 2018 ఎన్నికల్లో కర్నాటకలో 2 శాతం ఓట్లు అధికంగా కాంగ్రెస్ కు వచ్చినా, బీజేపీకి 25 సీట్లు అధికంగా వచ్చిన విషయం సునిశితంగా గమనించాల్సిన అంశం. అందుకే ఓటు షేర్ తక్కువ ఉన్నా, దాన్ని సీట్లుగా మార్చుకోవడంలో మాత్రం బీజేపీ పైచేయి సాధిస్తోంది.. ఇక్కడ బీజేపీ విజయ సూత్రం ఇదే… అదే సందర్భంలో ఆంధ్రాలో అధికార వైసీపీకి రాయలసీమ, నెల్లూరు జిల్లాలో భారీ ఎత్తున ఓటు బ్యాంక్ కేంద్రీకృతం కావడంతో, అక్కడ భారీ మెజార్టీలతో సీట్లు సాధిస్తున్నప్పటికీ, మిగిలిన కోస్తా ప్రాంతంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. అందుకే పోటాపోటీగా జరిగిన 2014 ఎన్నికలను పరిశీలిస్తే, కేవలం 1 శాతం ఎక్కువ ఓట్లు సాధించిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి, 104 స్థానాల వరకు (దాదాపు 35 సీట్లు అధికంగా )గెలుచుకున్న పరిస్థితి నెలకొంది. 2019 ఎన్నికలు వచ్చేటప్పటికీ జగన్ మోహన్ రెడ్డి సుధీర్ఘ పాదయాత్ర కారణంగా 50 శాతంపైగా ఓట్లతో టీడీపీ కనీసం పోటీనిచ్చే పరిస్థితి కూడా లేకుండా ఏకపక్షంగా వైసీపీ విజయం సాగింది. అయితే పోటాపోటీగా ఎన్నికలు జరిగితే మాత్రం, టీడీపీకి ఓటు శాతం తక్కువ వచ్చినా, కర్నాటకలో బీజేపీ మాదిరిగా ఎక్కువ సీట్లు సాధించే పరిస్థితి ఉంది. ఇక అదే విధంగా కర్నాటకలో జేడీఎస్ పాత మైసూర్, మాండ్యా ప్రాంతాల్లో తన ప్రాబల్యం నిలబెట్టుకుంటూ, 18 నుంచి 20 శాతం ఓట్లతో 38 – 40 సీట్లను గెలుచుకుంటూ జాతీయ పార్టీలకు పోటీగా ప్రాంతీయ పార్టీగా తన సత్తా చాటుతున్న పరిస్థితి.. ఇదే తరహాలో ఏపీలో గోదావరి జిల్లాల్లో జనసేన తన ప్రాబల్యం చూపేందుకు ఆపసోపాలు పడుతుంది. గత ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీ చేసి, కేవలం 7 శాతం ఓట్లు మాత్రమే సాధించిన జనసేనకు గతం కంటే ఓటు బ్యాంక్ పెరిగిందనే మాట ఎక్కువగా వినిపిస్తుంది.. అదే నిజమై 10 నుంచి 15 శాతం జనసేన ఓటింగ్ పెరిగితే, 15 – 20 సీట్లు గెలిచే పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీ, బీజేపీతో జనసేన పొత్తు కుదిరితే మాత్రం ఈ సీట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇక బీజేపీ ఓటమే లక్ష్యంగా బరిలోకి దిగిన గాలి జనార్ధన్ రెడ్డి పార్టీ సైతం 2 నుంచి 3 సీట్లు వరకు గెలుచుకునే పరిస్థితి ఉంది..
ఆంధ్రాతో పోలిస్తే డబ్బు ప్రభావం తక్కువే
ఆంధ్రాలో జరిగే ఎన్నికలతో పోల్చితే కర్నాటకలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, డబ్బు ప్రాధాన్యత తక్కువనే చెప్పాలి. సైద్ధాంతిక పార్టీగా పేరు ఉన్న జాతీయ పార్టీ ఓటుకు రూ. 300 వరకు పంచుతుంటే, అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న మరో జాతీయ పార్టీ మాత్రం రూ.500 వరకు పంచుతున్నట్లు స్థానికంగా ఉన్న సమాచారం. అలాగే ఆంధ్రా మూలాలు కలిగిన నేతకు చెందిన పార్టీ మాత్రం అత్యధికంగా రూ.1000 వరకు పంచుతున్నారని చెబుతున్నారు. ఈ పరిస్థితిని పరిశీలించినప్పుడు మొత్తంగా ఏపీతో పోలిస్తే కర్నాటకలో డబ్బు ప్రభావం తక్కువగానే ఉందని చెప్పాలి.
కాంగ్రెస్ వైపే ఎగ్జిట్ పోల్స్..
ఇక పోలింగ్ పూర్తైన తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ను చూస్తే, హంగ్ ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నట్లు సర్వే సంస్థల ఫలితాలున్నాయి. అయితే మెజార్టీ సంస్థల ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ అధిక స్థానాలు గెలుస్తుందనే విధంగా తమ అభిప్రాయం వ్యక్తం చేశాయి.. సాధారణంగా కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీల ప్రభావం కూడా ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ పై ఎక్కువగా ఉంటుంది. ప్రీ పోల్స్ సర్వే విషయంలో అధికార పార్టీకి సానుకూలంగా సర్వే ఫలితాలను వెల్లడిస్తూ, ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం సాధారణంగా జరుగుతుంది. ఎగ్జిట్ పోల్స్ విషయంలో మాత్రం అప్పటికే ఫలితాలు ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి, సాధ్యమైనంత వరకు నిజాయితీగానే ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంటుంది. అయితే పూర్తి పారదర్శకంగా వ్యవహారించడం ద్వారా కేంద్ర, రాష్ట్రాల్లోని ఆయా అధికార పార్టీల వ్యతిరేకతను మూటకట్టుకునే సాహసం సర్వే సంస్థలు చేయవు. అలాగని మరి వాస్తవాలకు దూరంగా సర్వే ఫలితాలను పణంగా పెడితే, ఆయా సర్వే సంస్థల క్రెడిబులిటీ దెబ్బతింటుంది. కాబట్టి మధ్యేమార్గంగా వాస్తవ ఫలితాలకు.. ప్రతిపక్ష పార్టీలకు 10 సీట్లు తగ్గించి, అధికార పార్టీకి ఒక 10 సీట్లు పెంచే ఎత్తుగడను మెజార్టీ సర్వే సంస్థలు ఫాలో అయ్యే పరిస్థితి.. కాబట్టి మొత్తంగా కర్ణాటకలో సర్వే సంస్థలు వ్యవహారించిన తీరును సునిశితంగా పరిశీలిస్తే, కాంగ్రెస్ పార్టీకి 120 నుంచి 130 సీట్లు గెలుచుకుని, అధికారం కైవసం చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది.
రేపు రాబోయే ఎన్నికల ఫలితాల ప్రభావం రాబోయే 6 నెలల్లో ఎన్నికలు జరిగే తెలంగాణ, ఆతర్వాత జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో సైతం ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఈ ఎన్నికలను ప్రధాని మోదీతో పాటు, బీజేపీ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకుంది. సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టడంతో పాటు, ప్రచారాన్నంతా తన ఒక్క భుజంపైనే మోదీ వేసుకున్నారు. కర్నాటకలో బీజేపీ అభ్యర్ధులను కాదు, తనను చూసి ఓటు వేయండంటూ మోడీ, బీజేపీ అధినాయకత్వం చేసిన ప్రచారం, రోడ్ షో లు చూస్తే బీజేపీ ఎంత సీరియస్ గా తీసుకుందో అర్ధమవుతోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికలను సీరియస్ గా అటెంప్ట్ చేసింది. ముఖ్యంగా బెంగళూరులో పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో ప్రయాణిస్తూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ రాహుల్ గాంధీ సైతం వినూత్న ప్రచారానికి తెరలేపారు. మొత్తంగా మోదీ, బీజేపీ ప్రచారాన్ని అధిగమించి ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే, జాతీయ రాజకీయాల్లో మరో కీలక మలుపుకు కర్నాటక ఎన్నికలు నాంది పలకుతాయని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి ఉండదు.
బి రామదండు. కొత్తపల్లి
జర్నలిస్టు
Karnataka Results
The results of tomorrow’s elections will have an impact on the fate of political parties and leaders in Karnataka and also on the general elections to be held across the country next year. Especially in South India, Kannadigas have a good reputation since the past for being mild-mannered and avoiding controversy. The people here think with a broad perspective.. That is why the Telugu along with the people of other states also migrated to many parts of Karnataka and became economically and politically strong. Cooperation cannot be ignored.. Today, in the Telugu state of Telangana itself, we are seeing the efforts of all the parties to succeed locally by using the slogan ‘Andhrollu’ politically to the extent necessary. It is a fact that no one can deny that if there had been similar protests in Karnataka in the past, the people of the Telugu states would not have migrated there on such a large scale.
Vainam is changing from peace to hatred as a carop address
From the beginning, the people here behaved very harmoniously. While the Silicon City Bangalore has a cosmopolitan culture, the people of the rest of the rural areas used to stay away from disputes. Two years ago, Andhra students who had gone to Karnataka to write exams were attacked in the railway station, saying that Andhra people were using their local quota in banking jobs. Scholars and educated Kannadigas are observing the situation where the political parties who are accepting these are playing new political games like canceling reservations for Muslims, banning Hijab, Bajrang Dal and inciting more hatred among the people.
If the party that has been in power for the last 4 decades is not in a situation where it is in power for the second time, then it will be understood how wise the people of Kannada are. In the same context, it should be noted that the BJP has not even once achieved a majority in Karnataka. It is because of the Hindutva ideology of the RSS in Karnataka that the BJP is able to wield power in Kannada like nowhere else in the south. Before the BJP-Gali Janardhan Reddy era, elections in Karnataka used to be conducted in a sober manner and without money. At the same time, it must be said that there are no situations where the reputation of Kannadigas has been tarnished at the national level, such as corruption and scams against the winning parties and leaders.
Proximity of Karnataka politics with Andhra…
Looking at the current Karnataka elections, the political situation in Andhra seems to be close. Because, like the Congress in Karnataka, TDP has a vote bank across the state, at the same level. Here the ruling YCP has its vote bank concentrated in Gampagutta in Greater Rayalaseema. Rest of the coast, Uttarandhra has more than one vote bank. In the same way BJP also has a high vote bank concentration in some areas. In the 2018 elections in Karnataka, even though the Congress got 2 percent more votes, the fact that the BJP got 25 more seats is a matter that needs to be carefully observed. That’s why even though the vote share is low, the BJP is getting the upper hand in converting it into seats.. This is the BJP’s victory formula here… In the same situation in Andhra, the ruling YCP has a large vote bank concentrated in Rayalaseema and Nellore districts, although it is getting seats with huge majorities there, but the situation is the same in the rest of the coastal region. Not visible. That is why if we look at the competitive elections of 2014, the TDP, BJP and Jana Sena alliance, which got only 1 percent more votes, won up to 104 seats (almost 35 seats more). Even though the 2019 elections are coming, due to Jagan Mohan Reddy’s long march, YCP won unilaterally without TDP even contesting with more than 50 percent votes. But if the elections are held in a competitive manner, the TDP will win more seats like the BJP in Karnataka, even if the vote percentage is low. Similarly, in Karnataka, JDS is maintaining its predominance in the old Mysore and Mandya regions, winning 38-40 seats with 18 to 20 percent votes and showing its strength as a regional party in competition with the national parties. Janasena contested in 137 seats in the last election and got only 7% votes, it is said that the vote bank has increased more than before. At the same time, if the Janasena alliance with TDP and BJP is formed, the number of these seats is likely to increase. Gali Janardhan Reddy’s party, which came into the ring with the aim of defeating the BJP, is also in a situation of winning 2 to 3 seats.
Compared to Andhra, the effect of money is less
In comparison to the elections in Andhra, it should be said that money is less of a priority in Karnataka to tempt voters. A national party, which is known as an ideological party, will get Rs. 300 is being distributed, but there is local information that another national party, which is trying hard for power, is distributing up to Rs.500. Also, it is said that the party belonging to a leader with Andhra roots is distributing the highest amount up to Rs.1000. When we look at this situation, it has to be said that overall the influence of money is less in Karnataka as compared to AP.
Exit polls towards Congress..
If we look at the exit polls revealed after the polling, the results of the survey organizations show that there are more signs of hungover. But the exit polls of the majority of the organizations have expressed their opinion that the Congress will win more seats. Generally, the influence of the ruling parties in the center and the state is also more on the exit polls and pre-polls. In the case of pre-polls survey, an attempt is usually made to deceive the voters by disclosing the survey results positively to the ruling party. In the case of exit polls, since the results are already stored in the EVMs, it is possible to reveal the results as honestly as possible. However, the survey organizations do not dare to cover up the opposition of the respective ruling parties in the central and state by dealing in complete transparency. Also, if the survey results are taken away from the facts, the credibility of the respective survey organizations will be damaged. So in the middle way to the actual results.. the majority of the survey organizations follow the move of reducing 10 seats for the opposition parties and increasing 10 seats for the ruling party.. So if we look carefully at the behavior of the survey organizations in Karnataka, it seems that the
Congress party will win 120 to 130 seats and take power. .
There is no possibility that the results of tomorrow’s elections will have an impact on Telangana, where the elections will be held in the next 6 months, the AP assembly elections that will be held after that, and the general elections across the country. Along with Prime Minister Modi, the BJP leadership has taken this election very seriously. In addition to completely sidelining the seniors, Modi carried the whole campaign on his single shoulder. If you look at the campaign and road shows by Modi and the BJP leadership in Karnataka, you can see how seriously the BJP has taken it. On the other hand, Congress has also made a serious attempt at this election. Especially Rahul Gandhi also launched an innovative campaign while traveling in public transport in Bangalore and getting to know people’s opinions. It is no exaggeration to say that Karnataka elections will mark the beginning of another turning point in national politics if the Congress wins here after defeating the overall campaign of Modi and BJP.
B Ramadandu. Kothapally
Journalist