ఎన్టీఆర్ భవన్, మంగళగిరి
తల్లి చెల్లిని గెంటేసిన జగన్ మహిళల గురించి మాట్లాడటం హాస్యాస్పదం
మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
Amaravati:
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, జంగిల్ రాజ్యం నడుస్తోందని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే, ఏపీ మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ ఉండవల్లి శ్రీదేవి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మహిళల రక్షణ గురించి జగన్ మాట్లాడటం “దుర్యోధన, దుశ్శాసనులు ధర్మం గురించి మాట్లాడినట్లు” హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించినా.. జగన్ రెడ్డి గానీ, అప్పటి మహిళా నేతలు రోజా, వరుదు కళ్యాణిలు గానీ ఎందుకు నోరు మెదపలేదని శ్రీదేవి ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని సస్పెండ్ చేయాల్సింది పోయి, వారిని వెనకేసుకొచ్చిన సంస్కృతి వైసీపీదని మండిపడ్డారు.
నిండు అసెంబ్లీలో నారా భువనేశ్వరి గారిని, లోకేష్ గారిని అవమానిస్తుంటే జగన్ రాక్షసానందం పొందారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు మీ చరిత్ర చూసుకోండని జగన్ కు హితవు పలికారు. సొంత చిన్నాన్నను నరికి నరికి చంపిన వారిని శిక్షించాల్సింది పోయి, వారిని కాపాడేందుకు జగన్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించిందని మండిపడ్డారు. “చిన్నాన్నను చంపిన హంతకులను పక్క రాష్ట్రాలకు పంపి రక్షించింది మీరు కాదా?” అని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం సొంత తల్లిని, చెల్లిని రోడ్డు మీదకు తెచ్చి, ఆ తర్వాత వారిని ఏ విధంగా విస్మరించారో అందరికీ తెలుసని విమర్శించారు. అధికారం ఉన్నప్పుడు ప్యాలెస్‌కే పరిమితమై, సొంత రక్తసంబంధీకులకే అన్యాయం చేశారని మండిపడ్డారు. న్యాయం కోసం పోరాడుతున్న తన సొంత చెల్లిపై వైసీపీ సోషల్ మీడియా ముఠాతో అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెట్టించారని, ఆమె కట్టుకున్న చీర గురించి కూడా హీనంగా మాట్లాడించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “చెల్లి అని కూడా చూడకుండా హింసించిన మీరు, మహిళా రక్షణ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది” అని నిలదీశారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం లేదా కోడుమూరు ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీ వారిని సస్పెండ్ చేసి, బాధ్యతాయుతంగా వ్యవహరించాయని తెలిపారు.
తప్పు ఎవరు చేసినా ఉపేక్షించని పాలన ప్రస్తుత కూటమి ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక మహిళగా తాను, మెడిసిన్ చదువుతున్న తన కుమార్తెలు ఏ విధంగా సోషల్ మీడియా వేధింపులకు గురయ్యారో ఆవేదన వ్యక్తం చేశారు. తన పిల్లలను కూడా చూడకుండా అసభ్యకర పోస్టులతో చిత్రవధ చేయించారని, ఆ పాపమే జగన్ ను నేడు 11 సీట్లకు పరిమితం చేసిందని అన్నారు. NCRB నివేదికల ప్రకారం వైసీపీ హయాంలో లక్షలాది కేసులు నమోదయ్యాయని, దాదాపు 30 వేల మంది మహిళలు, చిన్నారులు మిస్సింగ్ అయ్యారని గుర్తు చేశారు. డాక్టర్ అనిత ఆత్మహత్య, రమ్య హత్య, పులివెందుల దళిత మహిళపై అమానుషం వంటి ఘటనలపై జగన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాజమండ్రిలో 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికపై జరిగిన మానభంగం, ఆమె మరణం అప్పట్లో అందరినీ కలిచివేసింది. మీ సొంత నియోజకవర్గం పులివెందులలో దళిత మహిళ అత్యాచారం జరిగితే పట్టించుకోలేదు.
ఈ ఘటనపై పరామర్శించడానికి వెళ్లిన ప్రస్తుత హోంమంత్రి అనిత గారు, ఎమ్మెల్యే రాజు గారిపైనే అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత మీ ప్రభుత్వానిది. 2021 ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటుంటే, గుంటూరులో పట్టపగలే రమ్యను అత్యంత దారుణంగా హత్య చేశారు. గణపవరంలో మహిళా క్రికెట్ ప్లేయర్‌పై వైసీపీ నాయకుల అత్యాచారం, పలమనేరులో మిస్బా అనే తెలివైన విద్యార్థినిని హింసించి చనిపోయేలా చేయడం మర్చిపోగలమా? అయేషా కేసులో సత్యం బాబును అక్రమంగా అరెస్ట్ చేసి, 8 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించేలా చేసిన పాపం మీదే. వైసీపీ హయాంలో మహిళల రక్షణ కరువైతే, నేడు కూటమి ప్రభుత్వం వారు ఆర్థికంగా ఎదిగేందుకు, ఆత్మగౌరవంతో బతికేందుకు కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 80 లక్షల మంది డ్వాక్రా సభ్యులతో పాటు 24 లక్షల మంది మెప్మా సభ్యులు నేడు రూ. 26,000 కోట్ల పొదుపు నిధులను సేకరించగలిగారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 1.13 కోట్ల మంది మహిళలు బ్యాంకుల నుంచి రూ. 46,590 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఇది దేశంలోనే అత్యధికం. మహిళల భారం తగ్గించేందుకు సున్నా వడ్డీ రుణ పరిమితిని రూ. 3 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచాము. త్వరలోనే దీనిని రూ. 10 లక్షలకు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ. 50,000 నుంచి రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. ఇటీవల పీఎం స్త్రీ నిధి కింద రూ. 63 కోట్లు మంజూరు చేయడం జరిగింది. నేరస్థుల్లో భయం మొదలైంది. తునిలో బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి, ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలకు భయపడి ఆత్మహత్య చేసుకోవడమే దీనికి నిదర్శనం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఇచ్చే పెట్టుబడి రాయితీని 35% నుండి 45% కి పెంచి ప్రభుత్వం అండగా నిలిచింది. డైరీ, పౌల్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో దాదాపు 93 వేల మంది మహిళలు ఎంఎస్ఎంఈ (MSME) పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. నల్లపాడులో నిర్వహించిన ‘సరస్ మేళా’ వంటి కార్యక్రమాల ద్వారా హస్తకళలు, హ్యాండ్లూమ్స్ మరియు స్థానిక ఉత్పత్తులకు సరైన బ్రాండింగ్, మార్కెట్ లింకేజీ కల్పించబడింది. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ (She Teams), శక్తి టీమ్స్ మరియు జెండర్ రిసోర్స్ సెంటర్లను బలోపేతం చేశాం.
ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల వల్ల 2025లో మహిళలపై నేరాలు తగ్గుముఖం పట్టాయి. ఉదాహరణకు, విశాఖపట్నంలో నేరాల సంఖ్య 1,121 నుండి 951కి తగ్గడం ఒక గొప్ప మార్పు అన్నారు. ఏళ్ల కాలంగా పెండింగ్‌లో ఉన్న అంగన్వాడీ, ఆశా వర్కర్ల గ్రాట్యుటీని అమలు చేయడంతో పాటు, బడ్జెట్‌లో రూ. 60 కోట్లు కేటాయించి వారికి 5G స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేస్తున్నాం. ఇళ్ల పట్టాలు, భూముల కొనుగోలులో మహిళలకే ప్రాధాన్యత ఇస్తూ వారి పేరు మీదే రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నాం. రైతు బజార్లు, జనరిక్ షాపులు, ఇసుక ర్యాంపుల నిర్వహణ బాధ్యతలను కూడా మహిళలకే అప్పగించాం. కర్నూలు జిల్లాలో 29 మంది పురుష డ్రైవర్ల మధ్య, ఒక మహిళ హెవీ వెహికల్ డ్రైవింగ్ నేర్చుకుని, ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనడం మనందరికీ గర్వకారణం. పేద మహిళల కళ్లలో ఆనందం చూసేందుకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నాం. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 1,704 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రంలోని 2.4 కోట్ల మంది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాం. ఇప్పటివరకు 6 కోట్ల మంది మహిళలు ప్రయాణించి, దాదాపు రూ. 224 కోట్లు ఆదా చేసుకోగలిగారు. సగటున రోజుకు 20 లక్షల మంది మహిళలు ఈ సౌకర్యాన్ని వాడుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ‘అమ్మఒడి’ పథకం అమలులో అనేక కోతలు, అబద్ధాలు ఉండేవి. దానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం ‘తల్లి వందనం’ పథకాన్ని అత్యంత పారదర్శకంగా ప్రయోజనకరంగా అమలు చేస్తోంది. గత ప్రభుత్వం ‘అమ్మఒడి’ని కేవలం 42 లక్షల మంది తల్లులకు మాత్రమే పరిమితం చేసింది. కానీ, కూటమి ప్రభుత్వం దానిని ఏకంగా 67 లక్షల మంది తల్లులకు విస్తరించింది. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో రూ. 15,000 ప్రకటించి, రకరకాల కారణాలతో (స్కూల్ మెయింటెనెన్స్ అని, ఇతర కారణాలని) రూ. 12,000 లేదా రూ. 13,000 మాత్రమే ఇచ్చేది. కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో లబ్ధిని నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తోంది. తల్లి వందనం’తో పాటు డొక్కా సీతమ్మ పథకం కింద విద్యార్థులకు నాణ్యమైన పుస్తకాలు, యూనిఫాంలు అందిస్తూ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తోంది.
జగన్ రెడ్డి హయాంలో మహిళా లోకానికి అన్యాయం
గత ప్రభుత్వం మహిళా సాధికారతను కేవలం నినాదాలకే పరిమితం చేసి, వాస్తవంగా ఉన్న వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. సున్నా వడ్డీ రుణ హామీని రూ. 10 లక్షల నుంచి రూ. 3 లక్షలకు తగ్గించి మహిళల నడ్డి విరిచారు. డ్వాక్రా మహిళల పొదుపు నిధులు (రూ. 10,000 కోట్లు), అభయహస్తం నిధులను పక్కదారి పట్టించి మహిళలకు అన్యాయం చేశారు. ఉచిత ఇళ్ల పేరుతో మహిళల నుంచి రూ. 10,000 నుండి రూ. 30,000 వరకు OTS రూపంలో వసూలు చేశారు. ఆడబిడ్డలకు అండగా ఉండే పెళ్లి కానుక, బాలికల సైకిళ్లు, తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వంటి కీలక పథకాలను రద్దు చేశారు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను, పండుగ కానుకలను తీసేసి పేద మహిళలపై భారం మోపారు. మహిళా భద్రత కోసం “దిశ” పేరుతో కోట్లాది రూపాయల పబ్లిసిటీ తప్ప, క్షేత్రస్థాయిలో రక్షణ కరువైంది.
అది కేవలం ఒక ‘క్రెడిట్ చోరీ’ డ్రామా మాత్రమేనని తేలిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు ప్యాలెస్‌లకే పరిమితమై, బటన్లు నొక్కితే చాలు అనుకున్న జగన్ మోహన్ రెడ్డి గారికి, ఇప్పుడు అధికారం పోయాక రోడ్ల మీదకు వచ్చి పాదయాత్రలు చేసే నైతిక అర్హత లేదు. మీ పాలనలో మీరు చేసిన నాశనం, ప్రజలు పెట్టిన శాపం వల్లనే నేడు 11 సీట్లకు పరిమితమయ్యారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం మీ అజ్ఞానమే అని హితవు పలికారు.















































