హనుమాన్ జంక్షన్ జనవరి 22
మానవ శరీరం ముఖ్యమైన నేత్ర ఆరోగ్యం (కంటి చూపు)పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని లయన్స్ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ చక్రవర్తి సూచించారు. బాపులపాడు హైస్కూల్ లో విద్యార్థులకు అవసరమైన కళ్లజోళ్లను బుధవారం ఎంఇఓ రాంబాలాసింగ్ చేతుల మీదుగా ఉచితంగా అందజేసారు. గత నెలలో విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన 12మంది విద్యార్థులకు కళ్ళజోళ్ళను ఉచితంగా అందజేసినట్లు అధ్యక్షుడు రమేష్ చక్రవర్తి వివరించారు. విద్యార్థులకు అవసరమైన వైద్య సేవల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా అందజేయడం అభినందనీయమని ఎంఇఓ రాంబాలాసింగ్ అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం శ్రీనివాసరావు, కార్యదర్శి మాకినేని శ్రీనివాసరావు, కోశాధికారి అక్కినేని రాఘవేంద్రరావు,లయన్స్ ప్రతినిధులు నండూరి శర్మ, చలసాని వెంకటేశ్వరరావు, అక్కినేని శ్రీనివాస ఫణీంద్ర, కలపాల రంగారావు, చలపతి, ప్రసాద్ తదితరుల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.





















































