INSTRUCTIONS GIVEN TO THE OFFICERS TO STAY FOR A WHILE…
పోదుర్లే కాస్త ఆగండి!
కొత్త ప్రభుత్వం కొలువు తీరకముందే వైసీపీ అధికారుల లెక్కలు తేలుస్తున్నారు. ‘‘జగనన్నే సర్వం. ఆయనతోనే మేముంటాం’’ అంటూ ప్రభుత్వాధికారులమన్న మాటే మరిచిన వారందరినీ మడత పెట్టేస్తున్నారు.
సెలవులు రద్దు.. రిలీవ్ చేయొద్దు
ఐపీఎస్ సంజయ్ లీవ్ రద్దు చేసిన జీఏడీ
రాజేశ్వరరెడ్డిని వెనక్కి పంపించాలని లేఖ
రెవెన్యూ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా టీడీపీ నేతల
ఆర్థిక మూలాలపై వరుస దాడులు
ప్రభుత్వం మారగానే డిప్యుటేషన్
రద్దుచేసుకుని వెనక్కి..
రాజేశ్వర్‌రెడ్డిని వెనక్కి పిలిపిస్తున్న జీఏడీ
లెక్క తేలే వరకూ ఏపీలో ఉండాల్సిందే
గీత దాటిన అధికారులకు స్పష్టీకరణ
కొత్త ప్రభుత్వం కొలువు తీరకముందే వైసీపీ అధికారుల లెక్కలు తేలుస్తున్నారు. ‘‘జగనన్నే సర్వం. ఆయనతోనే మేముంటాం’’ అంటూ ప్రభుత్వాధికారులమన్న మాటే మరిచిన వారందరినీ మడత పెట్టేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడకముందే చల్లగా జారుకుందాం అని చూసినవారికి చెక్ పెట్టేశారు. ఇప్పటికే రాష్ట్రం దాటిన వారు తిరిగి వెనక్కి రావాలంటూ సాధారణ పరిపాలన విభాగం తాఖీదులు జారీ చేసింది. చివరికి సెలవుపై వెళ్తున్న వారిని కూడా ఆపేస్తున్నారు. ‘పోదుర్లే కాస్త ఆగండి’ అంటూ గేట్లు మూసేస్తున్నారు. సీఐడీ చీఫ్‌గా అడ్డగోలు ఆరెస్టులు సాగించిన అధికారి సంజయ్. ముఖ్యమంత్రిగా జగన్ రాజీనామా చేసిన వెంటనే, సంజయ్ విదేశాలకు వెళ్లిపోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి యఽథావిధిగా ఆయనకు సహకరించారు. సంజయ్‌కు సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్తులు జారీ చేశారు. కానీ జీఏడీ అధికారులు ఆయన సెలవును రద్దు చేశా రు. ఈ క్రమంలో చంద్రబాబును కలిసి కాస్త ప్రసన్నం చేసుకోవాలన్న సంజయ్ ఆలోచనకు కూడా బ్రేక్ పడింది. చంద్రబాబు నివాసంలోకి ఎంట్రీ దొరకలేదు.
హతవిధీ….
ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఆస్మదీయ ఐఆర్‌ఎస్ అధికారి చిలకల రాజేశ్వరరెడ్డిని తీసుకొచ్చి ఆ విభాగాన్ని జగన్ అప్పగించారు. 2020లో నియమితులైన రాజేశ్వరరెడ్డి అన్ని పనులు మానుకుని, టీడీపీ నేతల వ్యాపారాలపై పడ్డారు. ఎన్నికలకు కొద్ది కాలం ముందు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుటుంబ సభ్యులకు చెందిన వ్యాపారాలపై దాడులు చేయించారు. ఇదే సమయంలో కేంద్రం డిప్యుటేషన్‌పై కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఐదేళ్ల డిప్యుటేషన్ ను మూడేళ్లకు కుదించింది. దీంతో డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చిన ఆయనను తిరిగి వెనక్కి పంపించాలని కేం ద్రం.. జగన్ సర్కారుకు లేఖ రాసింది. అయితే, ఆయన మాత్రం ‘నేను పోను. ఇక్కడే ఉంటాన’ని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ మెట్లు ఎక్కి.. రిలీవ్ ఆర్డర్‌ను పక్కన పెట్టేలా చేసుకున్నారు. కానీ ప్రభుత్వం మారబోతుంద న్న విషయాన్ని గ్రహించారు. అంతే.. క్యాట్‌లో తాను వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. వెంటనే తనను రిలీవ్ చేయాలని కోరగా, అప్పటి సీఎస్ జవహర్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ రిలీవ్ చేసేశారు. ఇప్పుడు రాజేశ్వరరెడ్డిని వెనక్కి రప్పిస్తున్నారు. ఈ మేరకు జీఏడీ ఉత్తర్వులు జారీ చేసింది. అదే కోవలోకి చేరే ఐ అండ్ పీఆర్ కమిషనర్‌గా విజయకుమార్ రెడ్డి వైసీపీ కార్యకర్తలాగే పనిచేశారు. ప్రభుత్వం మారగానే.. వెళ్లిపోవాలని ప్రయత్నించారు. కానీ, ఆయనను జీఏడీ అధికారులు ఆపేశారు.