శంభాజీ ని ఔరంగజేబ్ చంపేస్తే..
రాజ్యం పీష్వాల పరం ఎలా అయ్యింది ?
చావా మూవీ దేశ ప్రజలను అమితంగా ఆకర్షిస్తోంది. అత్యధిక వసూళ్లు రాబడుతోంది కూడా.
అయితే ఇది కేవలం సినిమానే గాని అసలు సిస లైన చరిత్ర కాదని హిస్టరీ పండితులు చెబుతున్నారు .
చావా సినిమా కల్పిత కధ గానే వారు చెబుతున్నారు. ప్రజల మధ్య మతాల అడ్డుగోడ లను సృస్తి స్తోందని సామాజిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు.
వాస్తవానికి శివాజీ కుమారుడైన శంభాజీ – ఔరంగజేబ్ కు మద్య రాజ్య కక్షలున్నాయి. ఇద్దరు ఆగర్భశత్రువులే. అయితే వీరిద్దరికీ గోడవలకి కారణం ఎవరు..?
వీరి శతృత్వం ఎవరికి లాభించిందో తెలుసుకుందాం.
దేశంలో మొఘల్ సా మ్రాజ్యం విస్త రిస్తున్న సమయం లో శివాజీ తల్లి జిజియా బాయీ తండ్రి, భర్త లు ,వేర్వేరు మొఘలుల సంసంస్థా నాల్లో సైనికాధి కారులుగా వుండేవారు. వీరి మద్య యుద్దం వచ్చినప్పుడు జిజియా భాయి తల్లఢిల్లే వారు.. మనకంటూ ఒక రాజ్యం వుంటే బాగుంటుందని ఆమె ఆలోచించి కుమారుడికి రాజ్య భోధ చేశారు. దీంతో శివాజీ మొఘలులని తరిమి కొట్టి మరాఠ సామ్రాజ్యాన్ని స్థాపించారు.
అప్పటి నియమం ప్రకారం శివాజీని ఒక బ్రాహ్మణుడు రాజుగా అభిషేకించాలి. అయితే ఒక శూద్రుడిని రాజు గా అభిషేకించడానికి ఎవరు ముందుకు రాలేదు. కలకత్తా నుంచి గాగా భట్టు అనే బ్రాహ్మణుడు నిలువెత్తు ధనం తీసుకొని తన అనుయాయులకు పెద్ద పెద్ద బహుమతులు తీసుకొని తన ఎడమ కాలు బొటన వేలితో శివాజీ నుదిటిన కుంకుమ దిద్ధడు. 1674 లో జరిగిన ఈ ఘటన శివాజీని జీవితాంతం వేధించింది. అయినప్పటికీ మనువాదు లకు శివాజీ పై ద్వేషం పోలేదు. అందుకే అతని పై విష ప్రయోగం జరిపారు. శివాజీ తన 50 వ ఏట 1680 ఏప్రిల్ 3న రక్తం కక్కుకొని చనిపోయాడు.
ఆ తర్వాత రాజ్యం చేపట్టిన శివాజీ పెద్ద కుమారుడు శంభాజీ విష ప్రయోగనికి కారణ మైన వారి తలలు నరికించాడు. దీంతో ఆయనపై మనువాదులు కక్ష పెంచుకొని తగిన సమయం కోసం ఎదురు చూశారు.
హిందూ రాజ్య స్థాపనే లక్ష్యంగా శివాజీ మహరాజ్ ముస్లిం రాజులపై దండయాత్ర చేశాడనడం కరెక్ట్ కాదు. శివాజీ బాహు జనుల రాజు.
కుల మతాలకు అతీతంగ రాజ్యపాలన చేశాడు. శివాజీ మహారాజు మొత్తం సైన్యం 2 లక్షల 35 వేలమంది వారి లో మరాట సైనికులు 1 లక్ష 75 వేల మంది .. మహార్ సైనికులు 30 వేల మంది ముస్లిం లు 10 వేల మంది, ఇతరులు 20 వేలమంది వున్నారు.
శివాజీ ముఖ్య సేనాపతి దౌలత్ ఖాన్ ,శివాజీ అంగ రక్షకు డు మదానీ మెహరత్, శివాజీ సన్నిహితుడు , విదే శి వ్యవహారాల శా ఖ మంత్రి ముల్లా హైదర్ లు పని చేశారు. శివాజీ రాయఘడ్ లో మసీదు , గుజరాత్ లో చర్చి ని బాగు చేయించారు.
శివాజీ చనిపోయాక రాజ్యాన్ని కలుపుకోవాలని ఔరంగ జేబ్ కు ఆయన ఆస్థానం లోని బ్రాహ్మణులే రెచ్చగొట్టారు.
వాస్తవానికి ఔరంగజేబ్ ది పెద్ద రాజ్యం. ఒక చిన్న రాజ్య మైన శివాజీ రాజ్యన్ని కలుపుకోవాల్సిన అవసరం ఔరంగజేబ్ కు లేదు. ఆదే సమయం లో ఒక వర్గానికి చెందిన కొందరు శంభాజీ ఆను పానులను ఔరంగజేబ్ కు చేరవేయడం తో ఆయన తన సైనికాధికారిని శంభాజీ పైకి పంపాడు. అంతేగానీ ఔరంగజేబ్ స్వయంగా యుద్ధం లో పాల్గో లేదు.
ఆయనతో పాటు వున్న ఒక వర్గా నికి చెందిన వారు అప్పటి మను వాదం ప్రకారం శాంభజినీ అత్యంత క్రూరంగా హింసించారు. అదే చావా సినిమాలో చూపారు. తర్వాతి రోజుల్లో నిజాలు తెలిసిన ఔరంగజేబ్ మసీద్ కు వెళ్ళి దువా జరిపారని చరిత్ర కారులు చెబుతారు.
ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమంటే, ఈ మరాఠా రాజ్యం ఔరంగజేబ్ పాలనలోకి వెళ్ళ కుండా .. పీష్వా భ్రహ్మణుల పాలన లోకి వెళ్ళింది.. ఇక్కడే మనకు విషయం బోధపడుతుంది.
భారత దేశాన్ని , ప్రజలను ఒక్కటిగా చేసి పాలించ లేనివాళ్ళు.. వారిని విడగొట్టి పాలిస్తున్నారు.. దానిలో భాగమే చావా సినిమా. ఇది Kashmir files, kerala files సినిమాల కోవలోకే ఇది వస్తుంది. ఇలాంటి సినిమాలతో దేశ సఖ్యత, సమగ్రత దెబ్బ తింటుంది.
కళలను ప్రజల మధ్య విభేదాలకు ఉపయోగించడం ఏ మాత్రం అంగీకారం కాదు.