AP Pensions: ఏపీలో పెన్షన్లు పెరిగాయ్.. జీవో జారీ చేసిన ప్రభుత్వం
అవును.. అటు సంతకం.. ఇటు శుభవార్త..! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్ల పెంపుపై మూడో సంతకం చేశారు. అన్నట్లుగానే మరుసటి రోజే పెన్షన్ పెంపుపై ప్రభుత్వం అధికారికంగా జీవో కూడా రిలీజ్ చేసింది. దీంతో పెన్షన్ దారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
- కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రోజుల వ్యవధిలోనే పెన్షన్ దారులకు శుభవార్త
- ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పేదలకు పింఛను పెంపుపై చంద్రబాబు మూడో సంతకం
- వెయ్యి పెంచుతూ మూడో చేవ్రాలు చేసిన నారా చంద్రబాబు నాయుడు
- మరుసటి రోజే పెన్షన్ పెంపునకు సంబంధించి ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
- సామాజిక పింఛన్ల పేరును ఎన్టీఆర్ భరోసాగా పునరుద్దరిస్తూ ఉత్తర్వులు
- పింఛన్ రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు
- వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పింఛన్ రూ.4 వేలకు పెంపు
- ట్రాన్స్ జెండర్లు, గీత కార్మికులు, మత్స్యకార వర్గాలకు పింఛన్ రూ.4 వేలకు పెంపు
- దివ్యాంగులకు పింఛన్ రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంపు
- పూర్తిస్థాయి దివ్యాంగులకు పింఛన్ రూ.5 వేల నుంచి రూ.15 వేలకు పెంపు
- తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పింఛన్ పెంపు
- ఈ మేరకు ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్
పేరు మారింది..
- పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మార్పు
- వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళలు..
- డప్పు కళాకారులు, ట్రాన్స్ జెండర్లు వంటి వారికి పెన్షన్లు పెంపు
- పెన్షన్లు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.
- రూ. 3వేలు ఉన్న పెన్షన్ రూ4వేలకు పెంపు
- దివ్యాంగుల పెన్షన్ రూ. 3 వేల నుంచి రూ.6వేలకు పెంపు
- పూర్తిస్థాయి దివ్యాంగుల పెన్షన్ రూ.5 వేల నుంచి రూ.15వేలకు పెంపు
- తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారికి రూ.10వేలు పెన్షన్
మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు..!