ట్రంప్ నకు ఎదురుదెబ్బ
స్వేచ్చా వాణిజ్యానికి సంతకాలు
అగ్రదేశం అమెరికా అధ్యక్షుడిగా ఏం చేసినా ఎదురులేదనుకుంటున్న ట్రంప్ కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. పనామా నాది.. గ్రీన్ లాండ్ ను ఆక్రమిస్తా.. గాజాను స్వాధీనం చేసుకుంటాననడంతో ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. ఇదే సమయంలో కెనడా, మెక్సికో, చైనా, భారత్ ల దిగుమతులపై టారిఫ్ లను ఎక్కువ చేయడంపై కూడా యూరప్ యూనియన్ – భారత్ షాక్ ఇచ్చాయి.
భారత ప్రధాని మోడీ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సుల వాన్ డర్ లేయాన్ ఫిబ్రవరి 28న న్యూ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ ఏడాది చివరినాటికి రెండు దేశాల మధ్య స్వేచ్చా వాణిజ్య అగ్రిమెంటుకు సంతకాలు చేస్తామని తెలిపారు. వాస్తవానికి ఈ రెండు దేశాల మధ్య ఫ్రీ ట్రేడింగ్ 8 ఏళ్ల క్రితమే మొదలవ్వగా అనివార్య పరిస్థితుల్లో కొన్నేళ్లుగా స్థబ్దతగా ఉంది. దీనిని 2021 లోనే రిస్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఉన్న భౌగోళిక పరిస్థితుల్లో ఫ్రీ ట్రేడింగ్ తో పెట్టుబడి దారులకు రక్షణ కల్పించాలని ప్రధాని మోడీ- యురోపియన్ యూనియన్ భావిస్తున్నాయి.
2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షికంగా 137.5 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. దీంతో గత దశాబ్ద కాలంగా 98 శాతం యూరప్ దేశాలు భారత్ కు మధ్య వాణిజ్యం జరిగింది. యూరోపియన్ కార్లు, విస్కీ, వైన్ ఎగుమతులపై 100 శాతానికి టారిఫ్ రేట్లు తగ్గిచాలని యూరోపియన్ కోరుతుండగా.. భారతీయ ఉత్పత్తులైన ఔషధాలు, కెమికల్స్ టెక్స్ టైల్స్, గార్మెంట్స్ పై లెథర్ ఉత్పత్తులపై సుంకాలు పెంచడం.. 2026నుంచి హై కార్బన్ గూడ్స్ , స్టీల్ , అల్యూమినియం, సిమెంటులపై ఈయూ 20 నుంచి 35 శాతం సుంకాలను పెంచనుండటం భారత్ వ్యతిరేకిస్తోంది.
ఇలాంటి సమయంలో లేయాన్ భారత్ లో పర్యటించి ఐరోపా దేశాలు -భారత్ ల మధ్య వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేయడం కీలకంగా మారింది. కష్ట సమయంలో అవకాశాలను మెరుగు చేసుకొని ముందుకు నడవాలని కోరుతున్నట్లు ఆమె తెలిపారు. బ్యాటరీ తయారీ, ఫార్మస్యుటికల్స్, సెమికండక్లర్లు, క్లీన్ హైడ్రోజన్, రక్షణ విభాగాల్లో వాణిజ్యం, పెట్టుబడులు ప్రోత్సహిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ సమయంలో యూరోపియన్ దేశాలు – భారత్ మధ్య స్వేచ్చా వాణిజ్యం కోసం ఈ ఏడాది చివరినాటికి సంతకాలు పెట్టబోతున్నామన్నారు. దీంతో ఇరు దేశాల మధ్య సహకారం భాగస్వామ్యం కలిగి ముందుకెళతామన్నారు. ట్రేడ్ టెక్నాలజీ, సెక్యూరిటీ డిఫెన్స్, విభాగంలో రెండు దేశాల ప్రతినిధులు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.
యూరోపియన్ మార్కెట్ కూడా రేట్లు తగ్గించాలని కోరుతోంది. స్వేచ్చా వాణిజ్యం ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందమని లేయాన్ తెలిపారు. ఈ ఏడాది చివరినాటికి భారత్ – మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడార్ ను ఏర్పాటు చేయనున్నారు. దీనిలో భాగంగా భారత్, అరేబియన్ గల్ఫ్, యూరప్ దేశాల మధ్య గోల్డెన్ రోడ్ ఏర్పడనుంది. 2025 ఈ రెండు దేశాలమధ్య వాణిజ్య ఒప్పందాలకు కీలకంగా మారబోతోందన్నారు. వాణిజ్య ఒప్పందాల్లో మా రెండు దేశాలు ప్రపంచంలో ఒంటరిగా మారాయని, అయితే ప్రస్తుత ఒప్పందం రెండు దేశాలను బలోపేతం చేయడానికి కలసి పనిచేస్తామన్నారు. రక్షణ , భద్రత కోసం ఐరోపా యూనియన్- భారత్ లు జపాన్, దక్షిణ కొరియా తో భాగస్వమ్యం వహిస్తాయని ఉర్సుల వాన్ డర్ లేయాన్ స్పష్టం చేశారు.
అమెరికాలో ట్రంప్ – ఎలెన్ మస్క్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపును అక్కడి కోర్టు తప్పుపట్టింది. దీనికి సంబంధించిన ఉత్తర్య్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిస్ట్రిక్ట్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల తొలగింపుకు సంబంధించి ట్రంప్ ఇదివరకే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకాలు చేశారు. ఈ పరిస్థితుల్లో కోర్టు తీర్పుతో ట్రంప్ నకు భారీ షాక్ తగిలింది.