25.08.2023
అమరావతి
దశాబ్దాలుగా వెనుకబడ్డ ఉత్తరాంధ్ర ప్రాంతంలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి, ఎందరో గిరిజనుల జీవితాల్లో విద్యా కుసుమాలు విరబూసేలా..
సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన
సాలూరు నియోజకవర్గం, విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి, ఇతర మౌలిక వసతుల కల్పనకు కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి శాఖామాత్యులు శ్రీ. ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో.. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా నేడు (25.08.2023) శంకుస్థాపన..
అధికారంలోకి వచ్చిన 50 నెలల్లోనే వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ, నాన్ డీబీటీ క్రింద గిరిజన సంక్షేమం పై మన జగనన్న ప్రభుత్వం చేసిన ఖర్చు అక్షరాలా రూ. 16, 805.77 కోట్లు…
గిరిజన ప్రాంతంలోనే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ..
గిరిజన విశ్వ విద్యాలయం గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే సత్సంకల్పంతో.. దత్తిరాజేరు మండలం మర్రివలసలో, మెంటాడ మండలం చినమేడపల్లి పరిధిలో భూసేకరణ.. ప్రభుత్వ భూమిని కేటాయించడంతో పాటు, ఇప్పటికే ఆయా గ్రామాల్లో యూనివర్సిటీకి భూములిచ్చిన రైతులకు రూ.29.97 కోట్ల పరిహారం.. మౌలిక వసతుల కల్పనకు మరో రూ. 28.49 కోట్లు చెల్లించిన జగనన్న ప్రభుత్వం…
ఉత్తరాంధ్రకు మకుటాయమానంగా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ
గత ప్రభుత్వం విభజన హామీలో ఒకటైన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అంశాన్ని గాలికొదిలేస్తే, ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది మన జగనన్న ప్రభుత్వం.. • విశాఖపట్నం-రాయగడ జాతీయ రహదారికి సమీపంలో, విశాఖ-హౌరా రైల్వేలైన్ లోని విజయనగరం, గజపతి నగరం, బొబ్బిలి రైల్వేస్టేషన్లకు అందుబాటులో ఉండేలా, సమీపంలోనే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్టు ఉండేలా యూనివర్సిటీకి భూకేటాయింపు.. వర్సిటీకి అవసరమైన భూమి, విద్యుత్, నీటి సరఫరా మరియు రోడ్డు కనెక్టివిటీని సమకూర్చిన జగనన్న ప్రభుత్వం.. శరవేగంగా నిర్మాణ పనులకు చర్యలు.. • సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లీష్, సోషియాలజీ, ట్రైబల్ స్టడీస్, బయోటెక్నాలజీ, కెమెస్ట్రీ, జర్నలిజం, ఎంబీఏ, ఎంఎస్ డబ్ల్యూ, డిగ్రీ స్థాయిలో ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, టూరిజమ్ అండ్ ట్రావెల్ మేనేజ్ మెంట్, బి.కామ్ లో ఒకేషనల్ తదితర 14 అకాడమిక్ కోర్సులు అందుబాటులో.. స్కిల్ డెవలప్ మెంట్, ఒకేషనల్, జాబ్ ఓరియెంటెడ్ షార్ట్ టర్మ్ కోర్సులు అందిస్తోన్న వర్సిటీ.. గిరిజన తెగల వ్యక్తిగత, సాంస్కృతిక మరియు పర్యావరణ అభివృద్ధిని ప్రోత్సాహాన్ని అందించనున్న యూనివర్శిటీ.
• 2019 నుండి విజయనగరం జిల్లా కొండకారకంలోని ఆంధ్రా యూనివర్సిటీ పాత పీజీ క్యాంపస్ భవనాల్లో వర్సిటీ తరగతులను నిర్వహిస్తున్న జగనన్న ప్రభుత్వం.. ప్రస్తుతం అక్కడ విద్యనభ్యసిస్తున్న 385 మంది విద్యార్థులు
కేవలం 50 నెలల్లో గిరిజన సంక్షేమం కోసం జగనన్న ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక చర్యలు..
అర్హులైన ఎస్టీ కుటుంబాలకు 2 ఎకరాల భూమి అందిస్తామని ఇచ్చిన మాట ప్రకారం గిరి భూమి
పోర్టల్ ద్వారా డిజిటలైజేషన్ చేసి ఇప్పటికే 1.54 లక్షల మంది గిరిజనులకు 3.23 లక్షల ఎకరాల్లో అన్ని హక్కులతో కూడిన RoFR పత్రాల పంపిణీ..
• రూ. 410.11 కోట్లతో 4.58 లక్షల మంది ఎస్టీ కుటుంబాలకు జులై, 2019 నుండి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. • గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా 37 మండలాలతో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం పేరుతో 2 కొత్త జిల్లాల ఏర్పాటు..
పార్వతీపురం, పాడేరులలో రూ.1000 కోట్లతో మెడికల్ కాలేజీలు, 300 మెడికల్ సీట్లతో నాణ్యమైన వైద్య సేవలు.. గిరిజనుల ఆరోగ్య సమస్యలపై పరిశోధనలకు పెద్దపీట..
గిరిజనుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రతి ఐటీడీఏ పరిధిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉండేలా రూ.246.30 కోట్లతో పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట, పార్వతీపురంలో, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం, ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం, ప్రకాశం జిల్లాలోని దోర్నాలలో 5 గిరిజన మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణం..
ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పలాసలో రూ. 50 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్ల నిర్మాణం, గిరిజన ప్రాంతాల్లో 24/7 వైద్య సౌకర్యం..
ప్రతి గ్రామంలో విలేజ్ క్లీనిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో గిరిజనులకు వారి గ్రామంలోనే మెరుగైన వైద్యం
• 105.32 ఎకరాల్లో రూ.153.85 కోట్లతో కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాల… కనీసం 500 జనాభా ఉన్న ప్రతి తండా/ గూడెంను పంచాయతీగా వర్గీకరిస్తామన్న మాటను నిలుపుకుంటూ గిరిజన ప్రాంతాల్లో 165 గ్రామ పంచాయతీలు ఏర్పాటు.. గిరిజన ప్రాంతాల్లోని 497 సచివాలయాల్లో అన్ని ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకే 100 శాతం రిజర్వేషన్..
7,921 మంది గిరిజన రైతులకు రూ.145.37 కోట్ల వైఎస్సార్ బీమా చెల్లింపు… గిరిజన సంక్షేమాభివృద్ధికి రాష్ట్రస్థాయిలో ఒక ఛైర్మన్, ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిషన్ ఏర్పాటు..
వైఎస్సార్ రైతు భరోసా సాయం కింద 3,40,503 మంది ఎస్టీ రైతులకు రూ. 2,089 కోట్లు, ఇన్ పుట్ సబ్సిడీ కింద 92,797 మందికి రూ. 71 కోట్లు, వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాల కింద 1,83,025 మందికి రూ. 48.26 కోట్లు, డా.వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద 70,618 మందికి రూ. 107 కోట్ల ఆర్ధిక సాయం అందించిన జగనన్న ప్రభుత్వం.
• చిన్నారుల భవిష్యత్ కోసం మనబడి నాడు నేడు క్రింద తొలి దశలో రూ.140 కోట్లతో 352 గిరిజన సంక్షేమ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన.. రెండో దశలో రూ. 103.39 కోట్లతో 358 గిరిజన సంక్షేమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చర్యలు..
• మన జగనన్న ప్రభుత్వంలో రూ.4,256 కోట్లతో 3,82,061 మంది ఎస్టీలకు గడపవద్దనే ఒక్కొక్కరికీ నెలకు రూ. 2,750 పెన్షన్లు, రూ.3,537.40 కోట్ల విలువైన 1,41,496 ఇళ్లపట్టాలు పంపిణీ.. రూ. 530.31 కోట్ల విలువైన 1,03,839 ఇళ్ల నిర్మాణం..
దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రభుత్వంలోని అన్ని నామినేటెడ్ పదవుల్లో అన్ని నామినేటెడ్ పనుల్లో 50 శాతం చొప్పున రిజర్వేషన్లు
ఎస్టీలకు ఒక డిప్యూటీ సీఎం పదవి, అందులోనూ ఒక మహిళకు అవకాశం ఇచ్చిన జగనన్న ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రైబల్ ఎడ్వైజరీ కమిటీ ఏర్పాటు
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT