సినిమా ఆపరేటర్స్ పరీక్ష
విజయవాడ, తేదీ: 24-05-2023.
సినిమా ఆపరేటర్స్ పరీక్ష – 2023 కొరకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నామని విద్యుత్ భద్రతా సంచాలకులు మరియు ప్రభుత్వ ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి గుంటూరు వారు ఒక ప్రకటనలో తెలియజేసారు. జూలై 2023 లో నిర్వహించే సినిమా ఆపరేటర్స్ పరీక్ష కొరకు అర్హత గల అభ్యర్థులు జూలై 14వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా దరఖాస్తులు అందజేయాలన్నారు.
10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి 2022 జూన్ నాటికి ఆంధ్ర ప్రదేశ్ లోని ఏదైనా లైసెన్సుడ్ సినిమా ధియేటర్ లో ఒక సంవత్సరం అప్రెంటెషిప్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలని, ది. 01-07-2022 నాటికీ 18 సంవత్సరాల వయస్సు పూర్తి అయి ఉండాలని, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 10వ తరగతి పరీక్షలో పాస్ అయినా, ఫెయిల్ అయినా సినిమా ఆపరేటర్స్ పరీక్ష వ్రాయడానికి అర్హులని ప్రభుత్వ ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి గుంటూరు వారు తెలిపారు. పరీక్షా కేంద్రం విజయవాడలో ఏర్పాటు చేస్తామని, పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రూ. 600/-లు రుసుం చలానా రూపంలో జమ చేయాలన్నారు. పరీక్ష రుసుం చలానా రూపంలో ఈ క్రింది తెలిపిన విధంగా చెల్లించాలన్నారు.
Major Head 0043 TAXES AND DUTIES ON ELECTRICITY
Minor Head 103 FEES FOR ELECTRICAL INSPECTION OF CINEMAS
Sub Head 01 FEES FOR ELECTRICAL INSPECTION OF CINEMAS
D.D.O. CODE: 27000502001.
దరఖాస్తు ఫారాలు కావలిసినవారు విద్యుత్ భద్రతా సంచాలకులు మరియు ప్రభుత్వ ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి వారి కార్యాలయం, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ఇంటి నెం. 5-17-6, రెండవ అంతస్తు, 1/16, బ్రాడీ పేట, గుంటూరు-522002 నుండి పొందవచ్చునని, దరఖాస్తు ఫారాల కొరకు జత చేయవలసిన డాక్యూమెంట్లు ఇతర వివరాలకు విద్యుత్ భద్రతా సంచాలకులు మరియు ప్రభుత్వ ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి వారి నుండి వివరాలు పొందవచ్చునన్నారు.