Athome at AP Rajhavan hosted by Governor S.Abdul Nazeer
గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని రాష్ట్ర గవర్నర్
ఎస్. అబ్దుల్ నజీర్ ఎట్ హోం కార్యక్రమాన్ని రాజ్ భవన్ లో నిర్వహించారు..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులతో పాటు, న్యాయమూర్తులు, రాష్ట్ర మంత్రులు, ఎంఎల్ఏలు , అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు , ప్రముఖులు ఎట్ హోం కార్యక్రమానికి హాజరయ్యారు..
గవర్నర్ స్వయంగా ఆహ్వానితుల ను ఆత్మీయంగా పలకరించారు ..
76 వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా విజయవాడ లోని గవర్నర్ నివాసమైన రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం ఆదివారం సాయంత్రం నిర్వహించారు… ఎట్ హోం నిర్వహించడమనేది రిపబ్లిక్ డే రోజు ఆనవాయితీ గా వస్తుంది.. అందులో బాగంగా చేపట్టిన ఎట్ హోం కు సిఎం చంద్రబాబు నాయుడు తో పాటు డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ ,మంత్రులు లోకేష్ , పయ్యావుల కేశవ్, అచ్చన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నారాయణ, నాదెండ్ల మనోహర్, పార్థసారథి, ఎస్. సవిత, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్, ఇతర న్యాయమూర్తులు, చీఫ్ సెక్రటరీ విజయానంద్, డిజిపి ద్వారకా తిరుమల రావు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు,ఎంఎల్ఏ లు యార్లగడ్డ వెంకటరావు,గద్దె రామ్మోహన్, శ్రీరామ్ తాతయ్య, మండలి బుద్ధ ప్రసాద్, వర్ల కుమార్ రాజా, వెనిగండ్ల రాము, ప్రజా ప్రతినిధులు, సీనియర్ ఐఏఎస్ , ఐపిఎస్ అధికారులు, సిపిఐ రామకృష్ణ, వివిధ పార్టీల ముఖ్య నేతలు ,ఇతర ప్రముఖులు పాల్గొన్నారు… ఈ సందర్బంగా ఒకరి కొకరు ఆత్మీయంగా పలుకరించుకుంటూ గవర్నర్ ఏర్పాటు చేసిన ఆతిద్యాన్ని స్వీకరించారు..
అతిధులు అల్పాహారం, హై టీ ని స్వీకరించి కుశల ప్రశ్నలతో గడిపారు.