2న ఏపీ ఎస్ఆర్ఎం వర్సిటీ 3వ స్నాతకోత్సవం
– ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళసై
– సైన్స్ అడాడమీ ప్రెసిడెంట్ డాక్టర్ అశుతోష్ శర్మకు గౌరవ డాక్టరేట్
– 883 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు డిగ్రీలు, మెడల్స్
అమరావతి, ఆగస్టు 31 : అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో కొనసాగుతున్న ఏపీ ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం 3వ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. వచ్చే సెప్టెంబర్ 2, 2023 తేదీన ఉదయం 11 గంటలకు స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ప్రెసిడెంట్, మాజీ డీఎన్డీ సెక్రెటరీ డాక్టర్ అశుతోష్ శర్మ గౌరవ అతిథిగా హాజరవుతున్నారు. నానో టెక్నాలజీ రంగంలో విశేషమైన సేవలు అందించిన డాక్టర్ అశుతోష్ శర్మకు యూనివర్సిటీ మేనేజ్మెంట్ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయనుంది.
2017లో ప్రారంభమైన ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనతి కాలంలోనే అంతర్జాతీయంగా విశేషమైన గుర్తింపు పొందింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులను దక్కించుకుంది. బోధన, పరిశోధనల్లో ఉత్తమ ఫలితాలను సాధిస్తూ ఐఐటీలతో పోటీ పడుతోంది.
AP SRM Varsity 3rd Convocation on 2nd-Governor of Telangana Dr. Tamilsai will be the chief guest-President of Indian National Science Academy President Dr. Ashutosh Sharma will receive Honorary Doctorate-Degrees & medals for 883 engineering students
Amaravati, August 31 : AP SRM University, which is continuing with international education standards, is ready for its 3rd graduation ceremony. Arrangements have been made to hold the graduation ceremony on the Sept 2nd, 2023 at 11 am. Telangana Governor Dr Tamilsai Soundararajan will be the Chief Guest. Dr. Ashutosh Sharma, President of Indian National Science Academy and former DND Secretary, will be the guest of honour. Dr. Ashutosh Sharma will be awarded an Honorary Doctorate by the SRM University Management for his outstanding services in the field of Nano Technology.
AP SRM University, which started in 2017, has gained international recognition within a short period of time. It has won many awards at the national and international level. It is competing with the IITs by achieving the best results in teaching and research.