-
సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం
-
జీఏడీ,హెచ్ వోడీ టవర్లలో శాఖలవారీగా అవసరమైన స్థలం కేటాయింపుపై చర్చ
-
తెలంగాణ,ఛత్తీస్ గడ్ సెక్రటేరియట్ లనూ పరిశీలించాలని నిర్ణయం
-
శాఖలవారీగా కోఆర్డినేటర్లను నియమించి అభిప్రాయాలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు
అమరావతి.
తేది..20-02-26.
అమరావతిలో నిర్మించే ఐకానిక్ భవనాల్లో ఏ శాఖకు ఎంతెంత కేటాయించాలని దానిపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది.రాజధానిలో సాధారణ పరిపాలన శాఖ టవర్ తో పాటు నాలుగు HOD టవర్లను ప్రభుత్వం నిర్మిస్తుంది..ఈ టవర్లను ఐకానిక్ భవనాలుగా నిర్మించేలా ప్రభుత్వం డిజైన్లు రూపొందించింది.ఇప్పటికే పనులు కూడా ప్రారంభం అయ్యాయి..గతంలో సెక్రటేరియట్ లో కేవలం ముఖ్య కార్యదర్శుల తో పాటు ఆయా శాఖలకు చెందిన సెక్షన్లు మాత్రమే ఉండేవి.కానీ కొత్తగా నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల్లో సెక్రటేరియట్ విభాగాలతో పాటు శాఖాధిపతుల కార్యాలయాలు,కార్పొరేషన్ కార్యాలయాలు కూడా ఒకేచోట ఉండేలా నిర్మాణం చేస్తున్నారు..అంటే రాష్ట్ర స్థాయి కార్యాలయాలకు చెందిన అన్ని విభాగాలు ఒకే చోట ఉంటాయన్నమాట..దీనికోసం ఏ శాఖకు ఎంత స్థలం అవసరం అవుతుంది అనే దానిపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం నియమించింది.
మంత్రులు నారాయణ,పయ్యావుల కేశవ్,మనోహర్, బాల వీరాంజనేయ స్వామి,బీసీ జనార్దన్ రెడ్డి,సత్య కుమార్ సభ్యులుగా ఉన్నారు..ఈ కమిటీ మొదటి సమావేశం ఇవాళ సెక్రటేరియట్ లోని రెండో బ్లాక్ లో జరిగింది..సమావేశం ముగిసిన తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.
సబ్ కమిటీ సమావేశంలో ఐకానిక్ భవనాల నిర్మాణం,పార్కింగ్ సదుపాయాలు వంటి అంశాలతో పాటు రాష్ట్ర స్థాయి ఉద్యోగులు ఎంతమంది ఉన్నారనే దానిపై చర్చించినట్లు మంత్రి చెప్పారు…శాఖల వారీగా ఉద్యోగుల వివరాలు,వారికి కావాల్సిన స్థలం,సదుపాయాలపై చర్చించాలని అధికారులకు ఆదేశించామన్నారు.2014-19 మధ్యలో 52.72 లక్షల చ.అ.బిల్టప్ ఏరియాతో భవనాలు డిజైన్ చేసామని….దీంట్లో 31.71 లక్షల చ.అ.విస్తీర్ణంలో కార్పెట్ ఏరియాలో ఉంటుందన్నారు…అయితే ప్రస్తుతం ఉన్న అవసరాలపై పూర్తిగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు కేబినెట్ సబ్ కమిటీ నియమించినట్లు మంత్రి తెలిపారు.ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మొత్తం 39,882 శాంక్షన్ పోస్టులు ఉన్నాయన్నారు…అయితే ఖచ్చితమైన లెక్కల కోసం ప్రతి డిపార్ట్ మెంట్ నుంచి ఒకరిని నామినేట్ చేయాలని సీఎస్ ను కోరుతామన్నారు…2014-19లో 26,700 మంది ఉద్యోగులు ఉంటారని… దానికి తగినట్లుగా భవనాలు డిజైన్ చేసామని మంత్రి నారాయణ చెప్పారు..
మరోవైపు ఇటీవల కొత్తగా నిర్మించిన నయారాయపూర్,హైదరాబాద్ లోని సచివాలయాలను కూడా పరిశీలించాలని
అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు..వచ్చే సోమవారం మరోసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై ఆయా అంశాలపై చర్చిస్తామని మంత్రి నారాయణ చెప్పారు.
ఈ సమావేశంలో సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు,అమరావతి గ్రోత్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శొంఠి శ్రీనివాస్,ఇతర అధికారులు పాల్గొన్నారు.














































