ఏపీ ఆర్థిక వృద్ధిలో అమరావతి రైల్వే లైన్ కీలకం
రైల్వే డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌పై సోమవారం లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా చిన్ని మాట్లాడారు. విజయవాడ సమీపంలో మల్టీ-మోడల్ కమర్షియల్ కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతించారు. ఏపీ రాజధానిని ప్రధాన నగరాలు, ఓడరేవులతో అనుసంధానిచడం ద్వారా ఆర్థిక వృద్థిని పెంపొందించడంలో అమరావతి రైల్వే లైన్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

లోక్‌సభలో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి రైల్వే లైన్‌ను ఆమోదించినందుకు టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌పై సోమవారం లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా చిన్ని మాట్లాడారు. విజయవాడ సమీపంలో మల్టీ-మోడల్ కమర్షియల్ కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతించారు. ఏపీ రాజధానిని ప్రధాన నగరాలు, ఓడరేవులతో అనుసంధానిచడం ద్వారా ఆర్థిక వృద్థిని పెంపొందించడంలో అమరావతి రైల్వే లైన్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
విజయవాడలోని గుణదల-బెజవాడ క్రాసింగ్ వద్ద ఆర్వోబీ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రప్రభుత్వంతో జాయింట్ సర్వే పూర్తయిందన్నారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద ఆమోదం కోసం పెండింగ్‌లో ఉందని, దాన్ని వెంటనే ఆమోదించాలని కేశినేని చిన్ని కోరారు.