రైతులకు ఉదయం పూటనే సౌర శక్తితో 9 గంటల విద్యుత్తును సరఫరా చేసేందుకు అన్ని చర్యలు…
మచిలీపట్నం జనవరి 5:
రాష్ట్రంలో లోఓల్టేజీ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్తును పెద్ద ఎత్తున అందించేందుకు, రైతులకు ఉదయం పూటనే సౌర శక్తితో 9 గంటల విద్యుత్తును సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు
సోమవారం ఉదయం నియోజకవర్గ కేంద్రమైన గన్నవరంలో గన్నవరం విమానాశ్రయ పరిధిలో ఏపీ ట్రాన్స్కో నిధులతో నిధులు 30.65 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన 132/33 కె.వి విద్యుత్ ఉప కేంద్రాన్ని రాష్ట్ర మంత్రివర్యులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయనంద్ , ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, సి పి డిసి ఎల్. సి ఎం డి పుల్లారెడ్డి, ఏపీ ట్రాన్స్కో జే యం డి సూర్య సాయి ప్రవీణ్ చంద్, కృష్ణాజిల్లా సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ లతో కలిసి శిలాఫలకం ఆవిష్కరించి ప్రారంభించారు.
అనంతరం ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు కంట్రోల్ గదిని ప్రారంభించారు. తదుపరి మంత్రివర్యులు స్విచ్ ఆన్ చేసి సబ్ స్టేషన్కు విద్యుత్ సరఫరా జరిగేలా చేశారు.
తదనంతరం మంత్రివర్యులు కంట్రోల్ విభాగంతో పాటు ఆక్సిలరీ, కమ్యూనికేషన్ గదులు పరిశీలించారు. తదుపరి విద్యుత్ ఉపకేంద్రం ప్రాంగణంలో మంత్రివర్యులతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ విప్, సిఎండి, జెఎండి, సంయుక్త కలెక్టర్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విద్యుత్ శాఖ రూపొందించిన డైరీలను క్యాలెండర్లను మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ విద్యుత్ సబ్స్టేషన్ ఉపగేంద్రం ఏర్పాటుతో చుట్టుపక్కల ఉన్న రైతులకు, విమానాశ్రయానికి లో వోల్టేజ్ సమస్య తీరుతుందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజలపై ఎలాంటి విద్యుత్ చార్జీల వారము మోకకుండా , రాష్ట్రంలో ఎక్కడా కూడా లో వోల్టేజ్ సమస్య లేకుండా విద్యుత్ ఉపకేంద్రాలు, విద్యుత్ లైన్లు పెద్ద ఎత్తున నిర్మించే దిశగా పనిచేస్తున్నామన్నారు.
ఇదివరకు లైన్ లాస్ 16 నుంచి 18 శాతం ఉండేదని దాన్ని నేడు 11 శాతానికి తగ్గించామన్నారు. రానున్న రోజుల్లో ఇంకా తగ్గించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లోనూ విద్యుత్ చార్జీలు పెంచదంటూ ప్రజలపై భారం మోపే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
కొత్తగా విమానాశ్రయాలు వ్యాపార సంస్థలు నిర్మాణం జరుగుతున్నందున రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతోందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసిందని 75 వేల వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామన్నారు.
గత ప్రభుత్వం విద్యుత్ను బయట నుండి కొనుగోలు చేయడంతో 9 నుంచి 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిందన్నారు
తమ 5 సంవత్సరాల కాలంలో ట్రూ అప్ చార్జీలు వేసి ప్రజలపై వారం మోపవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారన్నారు. వీలైనంతవరకు తగ్గించుకుంటూ రావాలని సూచించారన్నారు.
తొలిసారిగా దేశ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ట్రూ అప్ చార్జీలు కాకుండా ట్రూ డౌన్ 13 పైసలు తగ్గించి ప్రజలకు మేలు చేస్తున్నామన్నారు. ఇంకా రానున్న రోజుల్లో మరింతగా ట్రూ డౌన్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు
ఇండ్లపైన సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు ప్రభుత్వం
అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.ముఖ్యంగా 78 వేల రూపాయల వరకు ప్రభుత్వం రాయితీ ఇస్తుందని, బీసీలకు అయితే మరో 20 వేల రూపాయలు రాయితీ అదనంగా ఇస్తుందన్నారు. ఎస్సీ ఎస్టీలకు నూరు శాతం రాయితీ ఇచ్చి సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, ఇందుకోసం టెండర్లు కూడా పూర్తి చేసామన్నారు. త్వరలో వాటిని మొదలుపెడతామన్నారు. గన్నవరం నియోజకవర్గంలో 10 వేల సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు చేయుటకు శాసనసభ్యులు చొరవ చూపాలన్నారు.
రైతులకు కూడా పీఎం సూర్య ఘర్ ద్వారా పగటిపూటనే 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఇందుకోసం కూడా టెండర్లు పిలిచామన్నారు.
వ్యవసాయ పనులు పూర్తయ్యాక వేసవికాలంలో చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇంకా విద్యుత్ శాఖలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చి రానున్న రోజుల్లో ట్రూ అప్ చార్జీలు అనేదే లేకుండా చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ మాట్లాడుతూ ప్రస్తుతం గన్నవరం మండలానికి చాలా దూరంలో ఉన్న గుణదల 220/132/ 33 కెవి విద్యుత్ కేంద్రం, గంగూరు విద్యుత్ ఉపకేంద్రము నుండి విద్యుత్ సరఫరా జరుగుతోందన్నారు. దీనివలన కొన్ని లో వోల్టేజ్ సమస్యలు వస్తున్నాయన్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయముతో పాటు గృహ అవసరాలకు దృష్టిలో ఉంచుకొని అధిక స్థాయి వోల్టేజ్ సామర్థ్యంతో నేడు 132/3 కెవి గన్నవరం విమానాశ్రయం విద్యుత్ ఉపకేంద్రాన్ని 31 కోట్ల రూపాయల వ్యయంతో నెలకొల్పామన్నారు.
గన్నవరం, విజయవాడ గ్రామీణ, కంకిపాడు మండలాల పరిధిలో గృహ సర్వీసులు 62 వేలు, వాణిజ్య సర్వీసులు 18, వేలు, పారిశ్రామిక సర్వీసులు 2 వేలు, వ్యవసాయ సర్వీసులు 6వేలు మొత్తం సుమారు 88 వేల సర్వీసులు లబ్ధి పొందుతున్నాయన్నారు. దీంతో గంగూరు విద్యుత్ ఉపకేంద్రంపై లోడ్ కూడా తగ్గుతుందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం నాణ్యమైన విద్యుత్తు అందించాలని, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఉద్దేశంతో ఉన్నారన్నారు.
ఇందులో భాగంగానే ట్రాన్స్లేషన్ నష్టాలు రాకుండాలని రాకుండా ఉండేందుకు వాణిజ్య రంగాల్లో అవసరాలను గుర్తించి కొత్తగా విద్యుత్ ఉప కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు
రాష్ట్ర ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు మాట్లాడుతూ
తన నియోజకవర్గంలోని పురుషోత్తమ పట్నం 70 సంవత్సరాల కిందట స్వాతంత్రం రాకమునుపే విద్యుత్తు లైన్ ఉండేదని శాసనసభలో ప్రస్తావించామన్నారు. దాన్ని ఒకసారి మంత్రివర్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశీలించాలని కోరుతున్నామన్నారు.
మల్లవల్లి పారిశ్రామిక వాడలో విద్యుత్ సమస్యతో పరిశ్రమలు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పిన వెంటనే ఇంధనశాఖ మంత్రివర్యులు స్పందించి 132/33 కెవి విద్యుత్ కేంద్రం మంజూరుకు ఆమోదం తెలిపినందుకు మంత్రికి, ప్రధాన కార్యదర్శికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు
అలాగే రామవరప్పాడు లో రెండు 32 కెవి విద్యుత్ ఉప కేంద్రాలు, బాపులపాడు లో ఒక విద్యుత్ కేంద్రం అడిగిన వెంటనే మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
తన నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని, విద్యుత్ ఉప కేంద్రాలకు స్థలాల కేటాయింపులో భూ సమస్య ఉందన్నారు. కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి త్వరగా విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డైరెక్టర్లు ఏ కె వి భాస్కర్, జే వి రావు, వెంకట రమణమూర్తి, విమానాశ్రయం డైరెక్టర్ ఎంఎల్ కే రెడ్డి, విద్యుత్ శాఖ సీఈ సుదీవన్, ఎస్.ఈ. భాగ్యరాజ్, ఈ ఈ జయకర రాయ్, గన్నవరం తహసిల్దారు శివయ్య పలువురు విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.






























































