కరోలినా ను చుట్టుముట్టిన కార్చిచ్చు
అదుపులోకి రాని మంటలు
ఉత్తర- దక్షిణ కరోలినాలు కార్చిచ్చు చుట్టుముట్టింది. సౌత్ కరొలినాలో 175 చోట్ల మొదలైన మొదలైన అగ్నికీలకాలు 17 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆహుతి చేసిందని గవర్నర్ హెన్రీ మాక్ మాస్టర్ తెలిపారు. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. దీంతో స్టానికులను సురక్షిత ప్రాతాలకు తరలివెళ్లాల్సిందిగా అధికారులు కోరారు.
వాతావరణం పొడిగా ఉండటంతో పాటు భీకర గాలు వీచడంతో ఉష్ణోగ్రతలు పెరిగాయి. వీకెండ్ లో మొదలైన కార్చిచ్చు ఆదివారం సాయంత్రానికి మిర్టిల్ బీచ్ లోని 1,200 ఎకరాలను దహించింది. ప్రమాదం మరింత పెరగవచ్చని అమెరికా వాతావరణ సంస్థ హెచ్చరించింది. భీకర మంటలతో పోరాడుతున్న అగ్నిమాపక దళాల వీడియోలు వైరల్ అయ్యాయి.
నెల క్రితం అమెరికాలోనే అత్యంత సంపన్న ప్రాంతమైన లాస్ ఏంజెల్స్ ను చుట్టుముట్టిన అగ్నికీలకాలు ఆ ప్రాంతాన్ని బూడిదగా మార్చడంతో 35 బిలియన్ డాలర్లు ఆస్తి నష్టం జరిగింది. ఆ భయంకర ఘటన మరిచిపోకముందే కరొలినాలో కార్చిచ్చు చెలరేగింది. అగ్నికీలకాలతో కరోలినా అటవీ ప్రాంతం తగలబడిపోతోంది. అక్కడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇంతవరకు అగ్నికీలకాలు నివాస గృహాలను చుట్టుముట్టలేదని అయితే కొంతమందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు.
ఉత్తర కరొలినాలో ని కార్చిచిచ్చును ఫైర్ సిబ్బంది కంట్రోలు చేస్తున్నారని అటవీ సిబ్బంది తెలిపారు. కరోలినా రాష్ట్రం లోని నాలుగు అటవీ ప్రాంతాలు మంటల్లో చిక్కుకున్నాయన్నారు. అతి భయంకర అగ్నికీలకాలు 400 ఎకరాల జాతీయ అటవీ ప్రాంతాన్ని, పశ్చిమ షార్లెట్ లోని మరో 50 మైళ్ల అటవీ ప్రాంతం అంటే మూడోవంతు ప్రాంతాన్ని అగ్నికీలకాలు ఇప్పటికే దహించివేశాయి
పోల్గీ కౌంటీ నైరుతి ప్రాంతంలోని చిన్న పట్టణమైన ట్రయాన్ , నార్త్ కరొలిన ప్రాంత వాసులను అధికారులు ఖాళీ చేయించారు. రెండు మూడు రోజుల్లో మంటలు అదుపులోకి రావచ్చని అధికారులు భావిస్తున్నారు. పరిసర ప్రాంత ప్రజలంతా దట్టమైన పొగతో ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు.