అనంతపురం జిల్లా రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటన
అమరావతి :- అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం, కలగాసుపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చిన సీఎం….ఒక్కో మృతుని కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
బాధితులకు అండగా ఉంటాం
– : ఎలాంటి ఆందోళన వద్దు.. చికిత్స ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది
– : జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టీజీ.భరత్
అనంతపురం:
– గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు – ఆటో ఢీకొన్న ప్రమాద ఘటనలో మృతిచెందిన, గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టీజీ.భరత్ భరోసా ఇచ్చారు.
– ఆదివారం అనంతపురం నగరంలోని కిమ్స్ సవేరా ఆస్పత్రిలో గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు – ఆటో ఢీకొన్న ప్రమాద ఘటనలో మృతిచెందిన, గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు టీజీ.భరత్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు, జిల్లా ఎస్పీ పి.జగదీష్, తదితరులు పాల్గొన్నారు.
– ఈ సందర్భంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో జిల్లా ఇన్చార్జ్ మంత్రి మాట్లాడారు. డాక్టర్లు బాగా వైద్యం అందిస్తున్నారా, ప్రమాదం ఎలా జరిగింది అంటూ వివరాలు ఆరా తీశారు. మంత్రి టీజీ.భరత్ మాట్లాడుతూ గాయపడిన వారికి ఎలాంటి ఆందోళన వద్దని ధైర్యం చెప్పారు. చికిత్స ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. 24 గంటలు దాటిన తర్వాత బాధితులకు మళ్ళీ సిటీ స్కాన్ చేయాలని, అనంతరం కూడా ఇంకా చికిత్స అవసరమైతే ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందని తెలిపారు. బాధితులకు మంచి చికిత్స అందించాలన్నారు. ఈ సందర్భంగా ప్రమాద వివరాలను, అనంతరం చికిత్సకి సంబంధించిన వివరాలను జిల్లా ఇన్చార్జ్ మంత్రికి జిల్లా కలెక్టర్ వివరించడం జరిగింది.
అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం..
: ప్రభుత్వం నుంచి సాధ్యమైనంత వరకు సహకారం అందిస్తాం..
పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో ఆదివారం రాత్రి గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు – ఆటో ఢీకొన్న ప్రమాద ఘటనలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను వారి ఇళ్ల వద్దకే వెళ్లి పరామర్శించి.. వారికి భరోసా కల్పించిన గౌరవ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు..
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, జిల్లా ఎస్పీ పి.జగదీష్, తదితరులతో కలిసి మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు..
అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని చెక్కుల రూపంలో అందజేసిన మంత్రి..
ప్రభుత్వం నుంచి అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.. మీ కష్టాన్ని తీర్చలేము.. మేమున్నామని భరోసా కల్పిస్తున్నాం.. మంత్రి
కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీఓ కేశవనాయుడు, డిఎస్పీ వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్, తదితరులు..