అంబరాన్నంటిన ప్రమాణ స్వీకార సంబరాలు….
Swearing-in ceremony jubilient festivities
గన్నవరం, జూన్, 12:
గౌ. నారా చంద్రబాబునాయుడు గన్నవరం సమీపంలోని కేసరపల్లి IT పార్క్ వద్ద బుధవారం జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమ సంబరాలు అంబరాన్నంటాయి. ముందుగా నారా చంద్రబాబునాయుడు చేత రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కొణిదెల పవన్ కళ్యాణ్ చేత మంత్రిగా ప్రమాణం చేయించారు. అనంతరం
కింజారపు అచ్చన్నాయుడు,
నారా లోకేష్,
కొల్లు రవీంద్ర,
నాదెండ్ల మనోహర్,
పొంగూరు నారాయణ,
అనిత వంగలపూడి,
సత్య కుమార్,
నిమ్మల రామానాయుడు,
ఎన్.ఎం.డి ఫరూక్,
ఆనం రాంనారాయణ రెడ్డి,
పయ్యావుల కేశవ్,
అనగాని సత్య ప్రసాద్,
కొలుసు పార్థసారథి,
డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి,
గొట్టిపాటి రవికుమార్,
కందుల దుర్గేష్,
గుమ్మడి సంధ్యా రాణి,
బీసీ జనార్ధన్ రెడ్డి
టి.జి . భరత్
ఎస్. సవిత
వాసంశెట్టి సుభాష్,
కొండపల్లి శ్రీనివాస్,
మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లతో రాష్ట్ర మంత్రులుగా రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, సినీ నటులు చిరంజీవి, ప్రభృతులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.