వి.ఐ.టి – ఏ.పి విశ్వవిద్యాలయంలో ఘనంగా 7వ విశ్వవిద్యాలయ దినోత్సవ వేడుకలు
Date :24 -05 -2023
అమరావతి:
వి.ఐ.టి – ఏ.పి విశ్వవిద్యాలయంలో ఘనంగా 7వ విశ్వవిద్యాలయ దినోత్సవ వేడుకలు
వి.ఐ.టి – ఏ.పి విశ్వవిద్యాలయంలో 7వ విశ్వవిద్యాలయ దినోత్సవ వేడుకలను ది. 24 మే 2024 (శుక్రవారం) నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా జస్టిస్ సి. టి. రవి కుమార్ (జడ్జ్, సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా) మరియు గౌరవ అతిదిగా అమిత్ చౌదరి (డైరెక్టర్, డాటా ప్లాట్ఫార్మ్స్, మైక్రోసోఫ్ట్, బెంగళూరు ) హాజరయ్యారు.
ముఖ్య అతిది జస్టిస్ సి. టి. రవి కుమార్, గౌరవ అతిది అమిత్ చౌదరి, విశ్వవిద్యాలయ చాన్సలర్ డా|| జి. విశ్వనాథన్ చేతులమీదుగా విశ్వవిద్యాలయ వార్షిక నివేదిక ఆవిష్కరణ జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిధి జస్టిస్ సి. టి. రవి కుమార్ (జడ్జ్, సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా) మాట్లాడుతూ అకాడమిక్ మరియు రీసెర్చ్ రంగాలలో బహుమతులు సాధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. న్యాయ సూత్రాలను విస్మరించకూడని, అది సమాజానికి ఎంతో ప్రమాదకరమని తెలియచేసారు. జీవితంలో అంకిత భావంతో పనిచేస్తే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చునని, కాబట్టి ప్రతి విద్యార్ధి అంకిత భావంతో విద్యను అభ్యసించి మోహోన్నత శిఖరాలు చేరాలని సూచించారు.
గౌరవ అతిది అమిత్ చౌదరి (డైరెక్టర్, డాటా ప్లాట్ఫార్మ్స్, మైక్రోసోఫ్ట్, బెంగళూరు ) మాట్లాడుతూ ఆధునిక విద్యలో డేటా ప్లాట్‌ఫారమ్‌లు మరియు సాంకేతికత యొక్క కీలక పాత్రను తెలియ చేశారు. మైక్రోసాఫ్ట్ చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి వివరిస్తూ విఐటి-ఏపీ విశ్వవిద్యాలయం ఉన్నత విద్యలో చేస్తున్న కృషిని కొనియాడారు. మైక్రోసాఫ్ట్ ద్వారా అన్నివిధాలా విఐటి-ఏపీ విశ్వవిద్యాలయానికి సహకారం అందిస్తామని తెలియచేసారు.
విఐటి వ్యవస్థాపకుడు మరియు ఛాన్సలర్ డా|| జి. విశ్వనాథన్ మాట్లాడుతూ విఐటి నాలుగు క్యాంపస్ లలో 80 వేల మంది విద్యార్థులు పైగా చదువుతున్నారని, అత్యుత్తమ విద్య విధానాలు, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యను అందింస్తున్నామని, విద్యార్థులు సాధిస్తున్న విజయాలే ఇందుకు నిదర్శనమని తెలియచేసారు. భారతదేశంలో ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 27 శాతం మాత్రమే ఉందని, ఇది ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. యూనివర్సిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించి వారి ఉన్నతవిద్యకు సహాయం చేస్తున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా 274 అకాడెమిక్ అవార్డులు, 12 ఎండోమెంట్ అవార్డులు, 241 అధ్యాపక అవార్డులు, 271 రీసెర్చ్ స్కాలర్స్ అవార్డులు సాధించిన విద్యార్ధులు, అధ్యాపకలు మరియు సిబ్బందిని ప్రశంసించారు. అంతే కాకుండా 5 సంవత్సరాల సర్వీస్ ను పూర్తిచేసిన 24 మంది అధ్యాపకులు, 3 సిబ్బందిని సత్కరించారు.
విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా||. ఎస్.వి. కోటా రెడ్డి విశ్వవిద్యాలయ ప్రగతిని పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా|| జగదీష్ చంద్ర ముదిగంటి , డిప్యూటీ డైరెక్టర్ (స్టూడెంట్ వెల్ఫేర్) డా || ఖాదీర్ పాషా, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.