28.09.2023: అమరావతి
వరుసగా ఐదో ఏడాది…వైఎస్సార్ వాహన మిత్ర
నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నా, తమ బతుకు బండి లాగడానికి మాత్రం ఇబ్బంది పడుతున్న డ్రైవర్ అన్నదమ్ములకు బాసటగా..
2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ. 275.93 కోట్ల ఆర్థిక సాయం.. నేడు (29.09.2023) విజయవాడ విద్యాధరపురంలో బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి..
దేశంలో ఎక్కడా లేని విధంగా,
సొంత వాహనం కలిగి స్వయం ఉపాధి పొందుతున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఎండీయూ ఆపరేటర్లకు, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్స్తదితర అవసరాలకు అండగా నిలుస్తూ ఒక్కొక్కరికి ఏటా రూ. 10,000 ఆర్థిక సాయం అందిస్తున్న జగనన్న ప్రభుత్వం
వైఎస్సార్ వాహన మిత్ర” క్రింద నేడు అందిస్తున్న రూ. 275.93 కోట్లతో కలిపి ఇప్పటివరకు మన జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం 1,301.89 కోట్లు…
ఒక్కొక్క డ్రైవరన్నకు మన ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ 50 నెలల్లో అందించిన సాయం అక్షరాలా రూ. 50,000
“ఎండీయూ ఆపరేటర్లు, ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ అన్నదమ్ములకు తోడుగా ఉంటూ వారు సకాలంలో ఇన్సూరెన్స్, అవసరమైన రిపేర్లు చేయించుకునేందుకు, వారి వాహనాలను మంచి కండిషన్లో ఉంచుకునేందుకు.. వారు క్షేమంగా ఉంటూ, వారిని నమ్ముకున్న ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు డ్రైవరన్నల కుటుంబాలకు అండగా ఉంటున్న జగనన్న ప్రభుత్వం..
“వైఎస్సార్ వాహన మిత్ర” పథకానికి సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కొరకు జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్
లబ్ధిదారుల వివరాలు వర్గాల వారీగా, 2023-24 సంవత్సరానికి – ఎస్సీలు 67,513, ఎస్టీలు 11,497, బీసీలు 1,51,271, మైనార్టీలు (ముస్లిం, క్రిస్టియన్లు) 5,100, కాపు 25,046, ఇతరులు 15,504 మొత్తం 2,75,931 లబ్ధిదారులు