అంతర్జాతీయ మారకంగా రూపాయి ?
ఒక దేశం సూపర్ పవర్ గా ఎదగడానికి ఏం కావాలి ?
బలమైన సైన్యం, స్థిరమైన ప్రభుత్వం, శక్తివంతమైన ప్రజలు, ఉన్నతమైన సాంసృతిక జీవనం ? ఇవేమీ కాదు. ఒక బలమైన ఆర్థికరంగం, ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న కరెన్సీ..ఇవి రెండూ ఉంటే ఏ దేశమైనా సూపర్ పవర్ గా ఎదగవచ్చు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా. అది ఉపయోగిస్తున్న డాలర్ ను ప్రపంచంలో ఎవరైనా ఉపయోగించుకోవడచ్చు. గత 80 ఏళ్లుగా ప్రపంచంపై దీనిదే పెత్తనం. అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు దీనిని అంతర్జాతీయ మారకం కోసం డాలర్లనే వాడతారు. విస్తారంగా వాడబడే ఈ డాలర్ అమెరికాను అగ్రదేశంగా మార్చింది.
ఇండియన్ రూపీతో డాలర్ కు సవాల్
ప్రస్తుతం రూపాయిని డాలర్లలోకి మార్చకుండానే వాణిజ్యం నెరపుకునే సౌలభ్యం ఉంది. ఇందుకోసం భారత ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. ప్రపంచంలోని అనేక దేశాలు ఇండియన్ రూపాయలతోనే ఎగుమతులు, దిగుమతులు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. రష్యా, శ్రీలంకతో సహా అనేక దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. దీంతో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్వదేశీ, విదేశీ వారికోసం 60 ప్రత్యేక వస్ట్రో అకౌంట్లను తెరవడానికి 18 దేశాలకు అనుమతించిందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగ్వద్ కరాద్ పార్లమెంటులో తెలిపారు.
రష్యా, సింగపూర్ , శ్రీలంక, బోట్సువాన, ఫిజీ, జర్మనీ, గయాన, ఇజ్రాయిల్, కెన్యా, మలేషియా, మారిషస్ , మయన్మార్, న్యూజిలాండ్, ఒమన్, సిషిల్స్, టాంజానియా,ఉగాండ, ఇగ్లాండ్ దేశాలన్నీ అంతర్జాతీయ ఒప్పందాలను డాలర్ తో కాకుండా, రూపాయితో చేసుకోవడానికి ముందుకొచ్చాయి.
సిలికాన్ వ్యాలీ బ్యాంకు పతనంతో ప్రపంచం అంతా డాలర్లకు చెక్ పెట్టడానికి ముందుకొస్తున్నాయి. దీంతో ఇండియన్ రూపీ బలపడుతూ, డాలర్ తోసి రాజవుతోంది.
అంతర్జాతీయంగా రూపాయి చెల్లింపులు సాధ్యమా ?
అంతర్జాతీయంగా రూపాయి చెల్లుబాటుకు ఎదురయ్యే సవాళ్లు ఏమిటంటే.. మొదటిగా ఏ కరెన్సీ అయినా చెల్లుబాటు కావాలంటే ఆ దేశానికి ఎంత ఆస్తులు ఉన్నాయి ? అన్నది ముఖ్యం.
అమెరికన్ డాలర్ల విశయమే తీసుకుంటే ఆదేశం ట్రెజరీ లో బంగారం ఎంత ఉంది ? అన్నది చూస్తాం. 70 ఏళ్ల క్రితం బ్రిటిష్ ఫౌండ్ లకు అత్యంత డిమాండు ఉండేది. అది ప్రపంచాన్ని శాసించింది. అయితే ప్రపంచ యుద్దాల తర్వాత అమెరికా డాలర్లు నిలకడగా, చెక్కుచెదరినివిగా ఉండటంతో పౌండు స్థానంలో డాలర్ స్థిరపడింది.
1944లో అమెరికా బ్రిటన్ వూడ్స్ అగ్రిమెంటును అమలు చేసింది. దాని ప్రకారం డాలర్ ను ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల ట్రేడ్ లకు వాడడం మొదలైంది. 1960 వరకు డాలర్లు కావాలంటే స్టాక్స్ , బంగారం అవసరమయ్యేది. దీంతో వ్యక్తులే కాకుండా దేశాలు కూడా వీటిని ఉపయోగించారు.
1970లో బ్రిటన్ లో సంక్షోభం ఏర్పడింది. ప్రచ్చన్న యుద్దం, వియత్నాం యుద్దం అనంతరం ఖర్చులు పెరిగి పోయి అమెరికా కూడా’’ నెగటివ్ బాలెన్స్ ఆఫ్ క్రైసిస్‘‘ లోకి వెళ్లింది.
1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఒక పెద్దనిర్ణయం తీసుకొని డాలర్ ను అంతర్జాతీయ బంగారంతో లింక్ చేశారు. అంటే అమెరిక డాలర్ విలువ ఆదేశ బంగారంపై ఆధారపడి ఉంది. డాలర్ డిమాండు ఎంతగా ఉంటే అంతగా విలువ పెరుగుతుంది. ఎప్పుడైతే మార్కెట్ లో పెట్రో డాలర్ల వచ్చయో అప్పుడే డాలర్ల విలువ, వాడకం మరింతగా పెరిగింది. క్రూడ్ ఆయిల్ కొనడంలో డాలర్లు తప్పనిసరిగా వాడాల్సి వచ్చింది.
ప్రపంచదేశాలు పారిశ్రామీకరణం చెందుతున్న కొలదీ క్రూడ్ ఆయిల్ డిమాండు పెరగడంతో డాలర్ డిమాండు కూడా పెరిగింది. దీంతో అమెరికా మరిన్ని డాలర్లను ముద్రించింది. అమెరికా, ఐఎంఎఫ్; వరల్డ్ బ్యాంకు వంటి గ్లోబల్ ఏజెన్సీల్లో దాని పాలుపంపులు ఎక్కువ.
1990లో 90శాతం చెల్లింపులన్నీ డాలర్లలోనే ఉండేవి. ప్రస్తుతం అమెరికా వద్ద 500 బిలియన్ డాలర్ల బంగారు నిల్వలు ఉండగా, 4 ట్రిలియన్ డాలర్ల హార్డు కరెన్సీ ఉంది. 38 ట్రిలియన్ డాలర్ల ట్రెజరీ బాండ్లు ఉన్నాయి. ఇవి అమెరికా మొత్తం ఆస్తుల కంటే 80 రెట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే మార్కెట్ లో డాలర్ల మారకం ఎక్కువగా ఉండటంతో అమెరికా కృత్రిమంగా డాలర్లను ముద్రిస్తోంది. దీనిని నివారించేందుకు ప్రపంచంమంతటా యుద్దం వంటి పరిస్థితులను కల్పిస్తోంది. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, చమురును అమ్ముతోంది. 80శాతం ఇన్పర్మేషన్ టెక్నాలజీ అమెరికాలోనే ఉండటంతో డాలర్ విలువ మరింత పెరిగింది. ప్రస్తుతం దాని నికర ఆస్తులకు, ముద్రించిన డాలర్ల కు మధ్య వత్యాసం రావడంతో డీ -డాలరైజేషన్కు అడుగులు పడుతున్నాయి.
డీ-డాలరైజేషన్ అవసరత
అమెరికాలోలని అతి పెద్ద పెట్టుబడిదారుడు జిమ్ రోజర్స్ చెబుతున్నదేమంటే ప్రపంచంలో అనేక దశాబ్దాలపాటు డాలర్ రారాజుగా వెలుగొందింది. అమెరికా విధిస్తున్న ఆంక్షలు, ఆర్థిక పాలసీలు అమెరికాకు నష్టం తెస్తున్నాయన్నారు. చైనా, రష్యా, ఇరాన్లు డాలర్లకు ప్రత్యామ్నాయం ఉండాలని ప్రయత్నిస్తున్నాయి.
2000 లో గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల్లో, ఐఎంఫ్ లో షేలర్ల షేర్ 71 శాతం ఉండగా, ప్రస్తుతం 57శాతంగా ఉంది. 2020 నాలుగో త్రైమాసికంలో 25 ఏళ్ల కనిస్టానికి పడిపోయింది. గోల్డ్ మెన్ సాచ్చ్ తెలిపిన ప్రకారం 20వ శతాబ్దంలో యూకే ఫౌండ్ కు ప్రస్తుతం డాలర్ కు ప్రాధాన్యత ఉంది. ఇందుకు కారణం డాలర్ ను ఆయుధంగా చేయడమే.
2014లో రష్యాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను విధించింది. దీంతో రష్యా డాలర్ ను దెబ్బతీయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. రష్య-చైన, రష్యా-భారత్ లు కూడా ఈ ప్రయత్నాల్లోనే ఉన్నాయి.
రానున్న ఐదారేళ్లలో అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ 40 నుంచి 50 శాతానికి పడిపోవచ్చు. దీంతో యూరప్ దేశాల యూరోదే పై చేయి అవుతుంది. అదే జరిగితే రష్యా తన చమురును రూబెళ్లలో అమ్మవచ్చు. చైనా యువాన్, జపాన్ యెన్, సౌదీ రియాల్, యూఎన్ ఏ దీరంలతోనే వాణిజ్యాలను నడుపుతాయి.
భారత్ 44 దేశాలకు రూపాయితోనే వాణిజ్యాలను జరిగిస్తుంది. ప్రపంచంలోనే ఆంక్షలు అధికంగా విధించే దేశాల్లో అమెరికాదే పై చేయి. దీనిని నివారించేందుకు మిగతా దేశాలు డాలర్ చెలామణిని తగ్గించేందుప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే ఆంక్షల బారిన పడటానికి వాటి వంతు కూడా వస్తుందేమో అన్న భంయం ఆయా దేశాలకు ఉంది. ఇటీవల జరిగిన పరిణామాలతో చాలా దేశాల్లో డాలర్ల రిజర్వు అడుగంటింది. ఆయుధాలు,ఇతర వస్తువులను అమ్మేందుకు అమెరికా ఖచ్చితంగా డాలర్లనే వాడాలనడం ఈ పరిస్తితుల్లో ఆయా దేశాలకు తలకు మించిన పని అవుతుంది. ప్రస్తుతం ఏ దేశం డాలర్ ను నమ్ముకొని కష్టాలు కొనితెచ్చుకునేందుకు సిద్దంగా లేదు.
ప్రపంచం డీ- డాలరైజేషన్ ను ఎందుకు కోరుకుంటోంది ?
కొద్ది రోజుల ముందు ఇరాన్ – పశ్చిమ ఆఫ్రికా మధ్య ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఇందులో ఇరాన్ ఎగ్జాంపుల్ గా భారత్ గురించి చెబుతూ పశ్చిమ ఆఫ్రికా దేశాలు కమర్షియల్ వాణిజ్యంలో డాలర్లతో కాకుండాస్థానిక కరెన్సీ రియాల్ ను ప్రాధాన్యత ఇచ్చింది. ఇందుకోసం ఇరాన్ ఆర్తిక మంత్రి ఒక ప్రత్యేక బ్యాంకును నెలకొల్పారు. ఈ పద్దతి తో డాలర్లు, యూరోలతో కాకుండా ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నాయి.
2022లో రిజర్వుబాంక్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ వాణిజ్యాన్ని భారత రూపాయిలో కొనసాగించే విధంగా ప్రక్రియను రూపొందించింది.
దీనిలో భాగంగా భారత్ మొదటి సారి రష్యాతో రూపాయితో చమురు కొంటోంది. అంతకు ఒకేడాది ముందు (2021) లో ఆర్బీఐ కరెన్సీ, అండ్ ఫైనాన్స్ పై ఒక నివేదికను వెలువరించింది. దీనిలో రూపాయిని అంతర్జాతీయకరణం చేయడం తప్పనిసరి అని తెలిపింది. దాని అర్థం దేశంలోనూ, అంతర్జాతీయ మార్కెట్ లో భారతీయులు, భారతీయేతరులు స్వేచ్ఛగా రూపాయిని వాడుకోవచ్చు.
ఎస్ బీ ఐ కూడా ఇదే రిపోర్టును విడుదల చేసింది. రూపాయిని గ్లోబలైజేషన్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
2022 జూలై 11న ఎగుమతలు, దిగుమతులపై రూపాయితో నిర్వహించే విధంగా ఆర్బీఐ చర్యలు తీసుకుంది. దీంతో రష్యాపై అమెరికా విధించిన ఆంక్షల నుంచి రష్యా తనను తాను కాపాడుకుంది. దీంతో చాలా దేశాలు ఈ ప్రక్రియను స్వాగతిస్తున్నాయి.
రెండు నెలల క్రిందట 35 దేశాలు వాణిజ్యంలో రూపాయి వాడకంపై ఆసక్తి చూపాయి. ఈ దేశాలన్నీ డాలర్ల నిల్వతక్కువగా కలిగి ఉన్నాయి. దీంతో రూపాయి మారకం ప్రత్యామ్నాయంగా కనిపించింది.
అయితే ఇందులో ఒక సంక్లిష్టమైన సమస్య ఉంది. అదేమంటే ఇండియా ఫారెక్స్ రిజర్వులు తరచూ ఒత్తిడికి గురవుతుంటాయి. భారత్ ఒక నెట్ ఇంపోర్టర్ అందువల్ల రూపాయి విలువ తగ్గుతూ ఉంటుంది. 2022లో అతి వేగంగా మారకవిలువ పడిపోయిన ఆసియా దేశంగా ఉంది. డాలర్ విలువ తో చూస్తే 10 శాతానికి వడిపోయింది. దీనిని కంట్రోల్ చేసి రూపాయి మారకాన్ని పెంచడమే ముందున్న లక్ష్యం.
రూపాయిన మారకంగా చేయడం వల్ల మన వాణిజ్య లోటును భర్తీ చేయవచ్చు. అంతర్జాతీయంగా భారత రూపాయి ఒక ముఖ్య భూమికను పోషిస్తుంది.
చైనా తన కరెన్సీని బలవంతంగా నైనా గ్లోబల్ పై రుద్దాలని చూసినా విజయం సాధించలేకపోయింది.
ఇప్పటి వరకు ప్రతి దేశం డాలర్లను నిల్వ ఉంచుకొని తమ వాణిజ్యాన్ని కొనసాగించేది ఎందుకంటే అంతర్జాతీయంగా ఆ కరెన్సీని అందరూ ఆమోదించారు కాబట్టి.
ఇండియన్ వ్యక్తి ఒక ఫ్రెంచ్ బూట్ల జతను కొనాలంటే రూపాయలను అమెరికా డాలర్ల లోకి మార్చాల్సి వచ్చేది. దీంతో చార్జీలు పడేవి. అంతేకాకుండా ఫారెక్స్ ఒడిదుడుకులు కూడా తోడయ్యేవి. ఇది చేతి చెల్లింపులు మాత్రమే అదే దేశ వాణిజ్యానికి వస్తే మరింత రిస్క్ ఉండేది. అదే రూపాయిలో చెల్లింపులు జరిగితే సౌలభ్యంగా ఉంటుంది. దీనికోసం వాస్ట్రో అకౌంట్ ఓపెన్ చేస్తారు.
వాస్ట్రో అంటే ఏమిటి
వాస్ట్రో ఒక లాటిన్ పదం దానికి అర్థం యువర్స్ (మీది) ఈ అకౌంటు ద్వారా రెండు దేశాల మధ్య ఆర్థిక లావాదేవీలు జరపడానికి ’మీడియం ఆఫ్ ఎక్సేంచ్ ఫెసిలిటేట్‘ చేస్తుంది. అంటే ఇండియన్ బ్యాంక్ ద్వారా ఇతర దేశాల్లోని కరస్సాడెంట్ బ్యాంకుల్లో అకౌంట్ తెరుస్తారు. ఇక్కడ విదేశీ వ్యక్తులు లేదా సంస్థలు డాలర్లతో కాకుండా రూపాయలతో లావాదేవీలు జరుపుతారు. ఆర్బీఐ నుంచి అనుమతి రాగానే ఇండియన్ బాంకు స్పెషల్ రూపీ ఆస్ట్రో అకౌంట్ ను పార్టనర్ కంట్రీ బ్యాంకులో తెరుస్తారు. దీంతో రెండు దేశాలు ఇండియన్ రూపీతో వాణిజ్యం జరుపుతారు. దీంతో భారత్ వేర్వేరు దేశాల్లో వేర్వేరుగా వాస్ట్రో అకౌంట్ ను తెరవాల్సి ఉంటుంది. దీంతో భారత్ – భాగస్వామ్య దేశాలే కాదు. భాగస్వామ్య దేశాల నుంచి చిన్నచిన్నదేశాలతో రూపాయలతో లావాదేవీల ప్రక్రియ జరపాల్సి ఉంటుంది. ఇది కేవలం ద్వైపాక్షిక సంబంధాలు మాత్రమే కాకుండా, డాలర్ల లా ఒక అంతర్జాతీయ కరెన్సీగా రూపాయి రూపొందుతుంది.
Rupee as an international currency?
What does it take for a country to become a superpower?
A strong army, a stable government, a powerful people, a high cultural life? None of this. A strong financial sector and a globally used currency..any country can become a superpower if they have both. America is the best example for that. The dollar it uses can be used by anyone in the world. This is what has dominated the world for the past 80 years. Central banks of all countries use dollars for international exchange. This widely used dollar made America the leading country.
A challenge to the dollar with the Indian rupee
Now there is ease of doing trade without converting rupees into dollars. Government of India has taken some steps for this. Many countries of the world are interested in exporting and importing in Indian rupees. Many countries including Russia and Sri Lanka are showing interest. Union Finance Minister Bhagwad Karad said in Parliament that the Reserve Bank of India (RBI) has allowed 18 countries to open 60 special Vastro accounts for domestic and foreign nationals.
Russia, Singapore, Sri Lanka, Botswana, Fiji, Germany, Guyana, Israel, Kenya, Malaysia, Mauritius, Myanmar, New Zealand, Oman, Seychelles, Tanzania, Uganda and England have all come forward to make international agreements in rupees instead of dollars.
With the collapse of the Silicon Valley bank, the world is moving to check dollars. As a result, the Indian rupee is getting stronger and the dollar is becoming stronger.
Is it possible to make international rupee payments?
The challenges facing the international validity of the rupee are.. First of all, if any currency is to be valid, how many assets does the country have? That is important.
In terms of American dollars, how much gold is there in the treasury? We will see. 70 years ago British founds were in high demand. It ruled the world. But after the world wars, the US dollar was stable and intact, so the dollar settled in place of the pound.
In 1944, America implemented Britain’s Woods Agreement. According to it, the dollar started to be used for all kinds of trades all over the world. Until 1960, if you wanted dollars, you needed stocks and gold. So not only individuals but countries also used them.
In 1970 there was a crisis in Britain. After the Great War and the Vietnam War, the costs increased and America also went into “Negative Balance of Crisis”.
In 1971, US President Richard Nixon took a major decision to link the dollar to international gold. This means that the value of the US dollar is based on the mandate of gold. The greater the demand for the dollar, the greater its value. Whenever petro dollars came in the market, the value and use of dollars increased. Dollars had to be used to buy crude oil.
As the world’s countries are industrializing, the demand for crude oil has increased, so the demand for the dollar has also increased. As a result, America printed more dollars. America, IMF; It has more involvement in global agencies like the World Bank.
In 1990, 90 percent of payments were in dollars. America currently has $500 billion in gold reserves and $4 trillion in hard currency. There are 38 trillion dollars of Treasury bonds. They are 80 times more than the total assets of the United States. That means America is artificially printing dollars due to the high exchange rate of dollars in the market. To prevent this, the whole world is creating a war-like situation. Selling arms, ammunition, oil. As 80 percent of information technology is located in the US, the value of the dollar has increased. Currently, the gap between its net assets and printed dollars is taking steps towards de-dollarization.
The need for de-dollarization
America’s biggest investor Jim Rogers says that the dollar has been the king of the world for many decades. He said that the sanctions and economic policies imposed by America are causing damage to America. China, Russia and Iran are trying to have an alternative to dollars.
In 2000, the share of shareholders in global central banks and IMF was 71 percent, and now it is 57 percent. It fell to a 25-year low in the fourth quarter of 2020. According to Goldman Sachs, the UK found in the 20th century is now preferred to the dollar. The reason for this is to make the dollar a weapon.
In 2014, the US imposed economic sanctions on Russia. With this, Russia continues to make many attempts to damage the dollar. Russia-China and Russia-India are also involved in these efforts.
In the next five to six years, the dollar may fall to 40 to 50 percent of international trade. This will make the Euro the upper hand of the European countries. If that happens, Russia can sell its oil in rubles. The Chinese Yuan, Japanese Yen, Saudi Riyal, and the United Nations trade with each other.
India trades with 44 countries in rupees. America has the upper hand among the countries that impose the most sanctions in the world. To avoid this, other countries are trying to reduce the circulation of the dollar. Because the respective countries are afraid that their turn will also come to be affected by the sanctions. With the recent developments, many countries have asked for dollar reserves. In these circumstances, it will be a mind-boggling task for the countries that America wants to use only dollars to sell arms and other goods. Currently, no country is ready to trust the dollar and bring hardship.
Why does the world want de-dollarization?
A few days ago a conference was held between Iran and West Africa. In this, Iran is talking about India as an example and West African countries preferred the local currency Riyal instead of dollars in commercial trade. For this purpose the Finance Minister of Iran established a special bank. With this method, dollars and euros are waiting for an alternative.
By 2022, the Reserve Bank of India has devised a process to continue international trade in the Indian rupee.
As part of this, India is buying oil with Russia for the first time. A year before that (2021), RBI released a report on Currency and Finance. It said that the internationalization of the rupee is a must. It means that Indians and non-Indians can use the rupee freely in the country and in the international market.
SBI has also released a similar report. Efforts to globalization of rupee are intensifying.
On July 11, 2022, RBI has taken steps to denominate exports and imports in rupees. With this, Russia has protected itself from the sanctions imposed by America on Russia. Many countries are welcoming this process.
In less than two months, 35 countries have expressed interest in using the rupee in trade. All these countries have low dollar reserves. With this, the rupee exchange appeared as an alternative.
But there is a complex problem with this. That means India’s forex reserves are often under pressure. India is a net importer and thus the rupee depreciates. Asia will be the fastest depreciating country in 2022. It has fallen to 10 percent in terms of dollar value. The main objective is to control this and increase the rupee exchange rate.
Converting the rupee can offset our trade deficit. Indian rupee plays an important role internationally.
China tried to force its currency on the global market but could not succeed.
Until now, every country used to store dollars and carry on their trade because that currency was accepted internationally.
An Indian would have to convert rupees into US dollars to buy a pair of French shoes. This will incur charges. Moreover, forex fluctuations are also included. It would have been more risky if it was only manual payments for same country trade. It will be convenient if the payments are made in the same rupee. Vastro account is opened for this.
What is Vastro?
Vastro is a Latin word meaning yours (yours) through this account the ‘Medium of Exchange Facilitates’ financial transactions between two countries. It means opening an account in correspondent banks in other countries through Indian Bank. Here foreign individuals or firms transact in rupees rather than dollars. After getting permission from RBI, Indian Bank Special Rupee Astro Account will be opened in the partner country bank. As a result, both countries trade in Indian rupees. So India has to open Vastro account separately in different countries. With this, India is not only partner countries. Transactions with small countries from partner countries have to be done in rupees. It is not just a bilateral relationship, but the rupee will become an international currency like the dollar.