మహా మానవతామూర్తి గౌతమ బుద్ధుని 2585 వ జయంతి ! సందర్భంగా మీకోసం
1. బాల్యంలోనే బాణం దెబ్బకు విలవిల లాడిన పావురమును
కట్టు కట్టి కాపాడినవాడు!
2. బాణంతో కొట్టిన వాడిది కాదు, కాపాడిన వాడిదే పక్షి అని రాజ సభలో నిరూపించిన వాడు!
3. రెండు రాజ్యాల మద్య నదీజలాల వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించిన వాడు!
4. మానవ కళ్యాణానికి
భార్యా బిడ్డలను వదిలి మహాభినిష్క్రమణ చేసిన వాడు!
5. తమను వదిలి వెళుతున్నందుకు రధసారధి చెన్నుడితో పాటు అశ్వం కంథకను కూడా ఏడ్పించిన వాడు!
6. పెంచిన తల్లి గౌతమి పేరునే తన పేరుగా చేసుకున్న వాడు!
7. తాను జ్ఞానం పొందిన బోధి వృక్షం గుర్తు వచ్చేలా పేరు
స్థిరపడిన వాడు!
8. తనను ధిక్కరించి వెళ్ళిన వారినే తన బోధనలతో శిష్యులుగా
చేసుకున్న వాడు!
9. గజదొంగ అంగుళీ మాలుడి మనసు మార్చి తన అనుచరుడిగా చేసుకున్న వాడు!
10. ఆనాటి విశ్వ సుందరి, రాజ నర్తకి, గణిక వృత్తిలో వున్న “ఆమ్రపాలి”నిని
బౌద్ద బిక్షుణిగా మార్చిన వాడు!
11. గృహస్తులు శాఖాహార లేదా మాంసాహారం ఏది పెట్టినప్పటికీ భిక్షువులు తిరస్కరించ కూడదని చెప్పిన వాడు!
12. గృహస్తుడు పెట్టిన
కుళ్ళిన భిక్ష వలన తాను మరణ శయ్యపైన వున్నప్పటికీ
ఆ గృహస్తుని ఏమీ అనరాదని తన శిష్యులను ఆదేశించిన వాడు!
13. తాను చెప్పిన కార్య- కారణ, అనిత్య, అనాత్మ ,
ప్రతీత సముత్పాద
సిద్ధాంతాలను ప్రజా ఉద్యమ దృక్పథంతో
విశాల ప్రజా రాశులకు
చేర్చినవాడు!
14. తనకంటే ముందు చార్వాక , లోకాయతులు చెప్పిన హేతువాద ఆలోచనా ధారకు ప్రజా ఉద్యమ స్వరూప మిచ్చిన వాడు!
15. త్రిరత్నాలను, పంచశీలను , అష్టాంగ మార్గమును బోధించిన వాడు!
16. క్షురక వృత్తి దారుడయిన ఉపాలికి , చర్మ కారుడయిన సునీతుడికి బౌద్ద దీక్షను ఇచ్చి , స్వయం కృషితో వారు ఉన్నత స్తానం ఎదగటానికి కారణం అయినవాడు!
17. బౌద్ద సంఘంలో మహిళలను చేర్చుకోవటమే గాక బౌద్ద బిక్షుణీ సంఘాన్ని
ఏర్పరచి,
వారికి తగిన గౌరవ స్థానాన్ని కల్పించిన వాడు! మన దేశంలో మొదటి మహిళా సంఘ నిర్మాత అయినవాడు!
18. కులాన్ని- వర్ణాశ్రమ ధర్మాలను నిరశించటమే గాక
అన్ని కులాల వారిని తన అనుచరులుగా చేసుకున్న వాడు!
19. బౌద్ద దీక్షలో ప్రథముడు ఏ కులం వారు అయినప్పటికీ
తర్వాత వచ్చిన వారు ప్రధములను గౌరవించే
గురు సంప్రదాయాన్ని ఏర్పరిచిన వాడు!
20. భార్యా , పిల్లలను, తల్లి దండ్రులను తన బోధనలను అనుసరించే వారుగా చేసుకున్న వాడు!
21. ఆసియా జ్యోతిగా వెలుగొందిన వాడు!
22. బాబా సాహెబ్ అంబేద్కర్ తన సిద్దాంతాలకు మూల పురుషుడిగా చెప్పబడిన వాడు!
23.అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగ రచనకు ప్రేరణ అయిన
స్వేఛ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందించిన వాడు!
24. వేమన , గురజాడ, గుర్రం జాషువా, గాంధీ, నెహ్రూలపైన , ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్
ఐన్ స్టీన్ పైన విశేష ప్రభావం చూపిన వాడు!
25. మతాన్ని నల్లమందుగా భావించిన కారల్ మార్క్స్ చే గౌరవించ బడిన మన దేశ మహనీయుడు!
26. ప్రఖ్యాత మార్క్సిస్ట్ రచయిత అయిన రాహల్ సాంకృత్యాయన్
తన రచనలకు ప్రేరణగా తీసుకోబడినవాడు!
27. మహా వీరుడు అయిన చండాశోకుని
ధర్మమూర్తిగా శాంతాశోకుడుగా మార్చినవాడు!
28. పూర్వజన్మ, పునర్జన్మ లను , వర్ణాశ్రమ ధర్మాలను బలపరిచే కర్మ సిద్ధాంతాలను నమ్మవద్దని చెప్పినవాడు!
29. తన బోధనలను ప్రజలలో వుండి , ప్రజల తిండితిని , ప్రజలపై ఆధారపడి పని చేసే ప్రజా ఉద్యమ దృక్పధం ఏర్పరచి దానికి నియమ నిబంధనలు
ఏర్పరచిన వాడు!
30. తన జననం, జ్ఞానోదయం, మహాపరి నిర్యాణం ఒకే రోజు , వైశాఖ పూర్నిమ
రోజునే జరిగినవాడు!
31. తన జీవిత మంతా వనాలలోను ప్రజల మద్య బోధనలు చేస్తూ
గడిపిన వాడు !
32. ప్రకృతిని ప్రేమించిన వాడు, ప్రకృతి రక్షణ కోరిన వాడు!
33. ప్రజల భాషలోనే తన బోధనలు చేసిన వాడు!
34. దేవుడు లేడని చెప్పినవాడు
స్వయం శక్తిపై నమ్మకం ఉంచాలని చెప్పినవాడు!
35. సత్య నిరూపణ కోసం ఎవరి నయినా
ధిక్కరించమన్నది, తాను చెప్పిన దానిని కూడా తప్పని భావిస్తే తిరస్కరించమని,
ప్రతి దానిని నిరూపణ చేసుకోకుండా ఆచరించ వద్దని చెప్పినవాడు!
36. నిరంతర చలనం – నిరంతర మార్పు గురించి 2500 సంవత్సరాల నాడే చెప్పినవాడు!
37. ఇలాంటివి ఇంకా ఎన్నో చెప్పిన వాడు,
84 వేల ప్రవచనాలు చేసిన వాడు!
ఎవరు?
ఎవరా మహనీయుడు!
అతడే సిద్దార్దుడు
అతడే గౌతముడు
అతడే బుద్దుడు
అతడే సిద్దార్ధ గౌతముడు
అతడే గౌతమ బుద్దుడు
అతడే గౌతమ బుద్దుడు.
నమో బుద్దాయ!
నమో బుద్దాయ!
నమో బుద్దాయ!
On the occasion of 2567th birth anniversary of Gautama Buddha
1. A dove killed by an arrow in childhood
The one who saved him!
2. The one who proved in the royal assembly that the bird is not the one who hit it with an arrow, but the one who saved it!
3. The one who resolved the river water dispute between the two kingdoms through negotiations!
4. For human welfare
The one who left his wife and children and made a big divorce!
5. The one who made the charioteer Chennu and the horse Kanthaka cry for leaving them!
6. He took the name of his adopted mother Gautami as his name!
7. A name reminiscent of the Bodhi tree where he gained knowledge
The settled one!
8. Disciples with his teachings even those who rejected him
The one who did it!
9. Gajadonga Anguli was the one who changed Maludi’s mind and made him his follower!
10. “Amrapali” who was a world beauty, a royal dancer and a countess of those days
He who turned into a Buddhist bhikkhu!
11. He who said that bhikkhus should not reject whatever vegetarian or non-vegetarian food the householders put!
12. Put by the householder
Even though he was on his death bed due to rotten alms
He ordered his disciples not to say anything to that householder!
13. Karya- karana, anitya, anatma,
Pratita Samutpada
ideologies with a mass movement perspective
For the general public
He added!
14. Charvaka and Lokayatula before him gave the form of public movement to the rationalist thought stream!
15. The one who taught Triratna, Panchsheela and Ashtanga path!
16. The one who gave Buddhist initiation to Upali, who was a barber, and Sunitha, who was a skinner, and caused them to rise to a higher position through self-effort!
17. Buddhist Bhikshuni Sangha to include women in the Buddhist community
set up
He who gave them a place of honor! He is the first women’s association producer in our country!
18. Caste-Varnashrama dharma should be rejected
He who made all castes his followers!
19. No matter what caste the first in Buddhist initiation
Those who come later respect the first
Guru is the one who established tradition!
20. He who made his wife, children and parents followers of his teachings!
21. He who appeared as the torch of Asia!
22. Baba Saheb Ambedkar is said to be the originator of his theories!
23. Ambedkar was the inspiration for writing the Constitution of India
The one who gave freedom, equality and fraternity!
24. Vemana, Gurjada, Gurram Joshua, Gandhi, Nehru, World Famous Scientist
He had a special influence on Einstein!
25. The great man of our country who was honored by Karl Marx who considered religion as opium!
26. Rahul Sankrityayan, a famous Marxist writer
Who inspired his writings!
27. Chandashoku, the great hero
The one who turned Dharmamurthy into a saintly mourner!
28. The one who said not to believe in pre-birth, reincarnation, karmic doctrines that strengthen Varnashrama dharma!
29. Establish a vision of a mass movement that works from the people, the food of the people, and the people.
He who created it!
30. His Birth, Enlightenment, Mahapari Niryanam on the same day, Vaisakh Purnima
Happened on the same day!
31. Throughout his life he preached among the people in the forests
He spent time!
32. He who loved nature, sought the protection of nature!
33. He who preached in the language of the people!
34. He who says there is no God
The one who said to believe in self-power!
35. Whose naina for proof of truth
To defy, to reject even what he has said if he thinks it is wrong,
He who said that everything should not be practiced without proving it!
36. Perpetual Motion – The One Who Said 2500 Years About Perpetual Change!
37. He who said many more such things,
He made 84 thousand prophecies!
who
Who is great!
He is Siddharth
He is Gautama
He is the Buddha
He is Siddhartha Gautama
He is Gautama Buddha
He is Gautama Buddha.
Namo Buddaya!
Namo Buddaya!
Namo Buddaya!